“యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి”. (మత్తయి 2:2)

కొన్ని విషయాలు ఎలా జరిగాయనే దానిపై మన కుతూహలమును బైబిలు పదే పదే ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  తూర్పు దేశపు జ్ఞానులను ఈ “నక్షత్రం” తూర్పు నుండి యెరూషలేముకు ఎలా తీసుకొని వచ్చింది?

అది వారిని నడిపించిందని లేదా యెరూషలేముకు వెళ్లే మార్గంలో వారికి ముందుగా వెళ్లిందని చెప్పలేదు. వారు తూర్పున ఒక నక్షత్రాన్ని చూశారని మాత్రమే చెబుతుంది (మత్తయి 2:2) మరియు యెరూసలేంకు వచ్చారు. మరియు మత్తయి 2:9 చెప్పినట్లుగా యెరూసలేం నుండి బెత్లెహేముకు ఐదు మైళ్ల నడకలో ఆ నక్షత్రం వారి ముందు ఎలా వెళ్ళింది? మరియు ఒక నక్షత్రం ఎలా “ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచింది”?

సమాధానం: మనకు తెలియదు. గ్రహాలు లేదా తోకచుక్కలు లేదా సూపర్నోవాలు లేదా అద్భుత లైట్ల కలయికల పరంగా దీనిని వివరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాని వాస్తవమేంటంటే మనకు తెలియదు. చివరికి తాత్కాలికంగా మాత్రమే ఉండే మరియు చాలా తక్కువ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన కల్పనలపై మీ మనస్సు నిమగ్నమై ఉండకూడదని – అలా దానినే పట్టుకొని ఉండకూడదని నేను మీకు హెచ్చరించాలనుకుంటున్నాను.

నేను మిమ్మల్ని హెచ్చరించడానికి కొన్నిసార్లు ప్రమాదకరమైన ఒక సాధారణ విషయాన్ని చెప్తున్నాను: నక్షత్రం ఎలా పనిచేసింది మరియు ఎర్ర సముద్రం ఎలా చీలిపోయింది మరియు మన్నా ఎలా పడిపోయింది మరియు యోనా చేప కడుపులో  ఎలా బ్రతికాడు మరియు చంద్రుడు రక్తంగా ఎలా మారాడు వంటి వాటిని గూర్చి నిరంతరం ఆలోచించేవారు పైపైవాటిని గూర్చి ఆలోచించే మనస్తత్వం గలవారుగా ఉంటారు.

సువార్తలోని గొప్ప స్థిరమైన సత్యాల పట్ల లోతైన ఇష్టం కలిగి ఉండడం వారిలో నువ్వు గమనించవు: దేవుని పవిత్రత, పాపం యొక్క వికృతత్వం, మనిషి యొక్క నిస్సహాయత, క్రీస్తు మరణం, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడడం, ఆత్మ యొక్క పవిత్రీకరణ పని, క్రీస్తు రాకడ యొక్క మహిమ మరియు చివరి తీర్పు. వారు ఎల్లప్పుడూ ఏదో ఒక అనవసరమైన దానితో ఉత్సాహంగా ఉన్నవారై దానిని గూర్చిన కొత్త కథనం లేదా పుస్తకంతో మిమ్మల్ని ప్రక్కకు తీసుకువెళుతున్నట్లు కనిపిస్తారు. స్థిరమైన సత్యాలలో సంతోషించడం చాలా తక్కువ.

కానీ నక్షత్రమునకు సంబంధించిన స్పష్టమైన విషయం ఏమిటంటే, అది తనంతట తానుగా చేయలేని పనిని చేస్తోంది: ఇది దేవుని కుమారుడిని ఆరాధించమని తూర్పు దేశపు జ్ఞానులకు మార్గనిర్దేశం చేస్తుంది.

బైబిల్ ప్రకారం, నక్షత్రానికి ఉన్న ఆ ఉద్దేశం వెనుక ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు: ఆయనే దేవుడు.

కాబట్టి, నేర్చుకోవాల్సిన పాఠం స్పష్టంగా ఉంది: దేవుడు తనను ఆరాధించడానికి విదేశీయులను క్రీస్తు వైపుకు నడిపిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా, బహుశా విశ్వ వ్యాప్తంగా తన ప్రభావమును మరియు శక్తిని ప్రయోగించడం ద్వారా ఆయన దానిని పూర్తి చేస్తున్నాడు.

దేవుడు మొత్తం రోమా సామ్రాజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాడని లూకా చూపించాడు. తద్వారా దీనురాలైన కన్యక ఆమె ప్రసవంతో బెత్లెహేముకు వచ్చి ప్రవచనాన్ని నెరవేర్చడానికి జనాభా లెక్కలు ఖచ్చితమైన సమయంలో జరిగేలా దేవుడు చేశాడు. వారు కుమారుడిని ఆరాధించడానికి వీలుగా కొద్దిమంది విదేశీయులను బెత్లెహేముకు తీసుకురావడానికి ఆకాశంలోని నక్షత్రాలను దేవుడు ప్రభావితం చేస్తున్నట్లు మత్తయి చూపించాడు.

ఇది దేవుని రూపకల్పన. అప్పుడు చేశాడు. ఇప్పుడూ అలాగే చేస్తున్నాడు. ఆయన లక్ష్యం ఏమిటంటే, దేశాలు – అన్ని దేశాలు (మత్తయి 24:14) – ఆయన కుమారుడిని ఆరాధించడం.

మీరు పనిచేసే కార్యాలయంలో, మీ తరగతి గదిలో, మీ పరిసరాల్లో మరియు మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది దేవుని చిత్తం. యోహాను 4:23 చెప్పినట్లు, “తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు.”

మత్తయి ప్రారంభంలో మనకు ఇప్పటికీ “రండి-చూడండి” నమూనా ఉంది. కానీ చివరిలో నమూనా “వెళ్ళి-చెప్పండి.” జ్ఞానులు వచ్చి చూశారు. మనం వెళ్లి చెప్పాలి.కానీ, తన కుమారుడిని ఆరాధించడానికి దేశాలను సమీకరించడంలో దేవుని ఉద్దేశ్యం మరియు శక్తి భిన్నమైనది కాదు. ప్రపంచ ఉనికికి కారణం, అన్ని దేశాల ఆరాధనలో క్రీస్తును ఘనపరచడం.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *