హృదయపు కిటికీ.

హృదయపు కిటికీ.

షేర్ చెయ్యండి:

మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన
తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి”. (హెబ్రీ 12:3)

మానవ మనస్సు యొక్క అత్యంత విశేషమైన సామర్థ్యాలలో ఒకటి ఏంటంటే అది ఎంచుకున్న దాని వైపుకు తన సొంత దృష్టిని మళ్లించే సామర్ధ్యం కలిగియుండడం.“ఈ విషయం గురించి ఆలోచించు దాని గురించి కాదు” అని మనం ఆగి మన మనస్సులతో చెబుతాము. ఒక ఆలోచన మీద, ఓక సంఘటన మీద, ఒక సమస్య మీద, ఒక నిరీక్షణ మీద మనం శ్రద్ధ పెడతాం.

ఇది ఒక అద్భుతమైన శక్తి. ఇలాంటి శక్తిని జంతువులు కలిగి ఉండడం నాకు సందేహమే. అవి బహుశా సహజ సిద్ధంగా ఆలోచించడానికి బదులుగా తమకున్న సహజ కోరికలను బట్టి, జంతుప్రవృత్తిని బట్టి  నడిపించబడుతుంటాయి.

పాపానికి వ్యతిరేకంగా మీరు చేసే యుద్ధంలో మీ యుద్ధ ఆయుధశాలలో ఉన్న ఈ గొప్ప ఆయుధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అద్భుతమైన ఈ బహుమానాన్ని ఉపయోగించమని బైబిల్ మనకు పదే పదే పిలుపునిస్తోంది. అరలో లేదా షెల్ఫులో ఉన్న ఈ బహుమానాన్ని మనం బయటకి తీసి, దానిపై గల దుమ్ము దులిపి, దానిని వాడుకోవాలి.

ఉదాహరణకు, రోమా 8:5-6 వచనలాలో “శరీరానుసారులు శరీరవిషయముల మీద శ్రద్ధ పెడతారు; ఆత్మానుసారులు ఆత్మవిషయముల మీద శ్రద్ధ పెడతారు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది” అని అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు.

ఇది అద్భుతమైన విషయం. మీరు మీ మనస్సును దేనిపై ఉంచుతారో దాని ఫలితం జీవమా లేక మరణమా అనేది మీ మనసు నిర్ణయిస్తుంది.

మనలో అనేకులు శాంతి కోసం, సంపూర్ణత కోసం, మార్పు కోసం సాధన చేయడంలో వెనుకబడ్డారు. ప్రస్తుత వైద్య శాస్త్ర యుగంలో మనం కేవలం “సమస్యలను గురించి మాట్లాడుకోవడం” లేక “మనకున్న సమస్యలతో వ్యవహరించడం” లేక “సమస్యల యొక్క ఆరంభ మూలాలను కనుగొనడం”అనే స్తబ్ధమైన మనస్తత్వములోనికి పడిపోయామనే భావన నాకుంది.

అయితే, క్రొత్త నిబంధనలో రూపాంతరం చెందడం పట్ల మరింత బలమైన వైఖరిని నేను గ్రహించాను. అలా మీ మనస్సును ఆ విధంగా సిద్ధపర్చుకోండి. “పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి..” (కొలొస్స 3:2).

మన ఆలోచనలు మన భావాలను మరియు భావోద్వేగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, లూకా 12:24, 27 లో “కాకుల, గురించి, పువ్వుల గురించి విచారించుట” ద్వారా మనకున్న ఆందోళన అనే భావోద్రేకాన్ని జయించమని యేసు మనకు చెబుతున్నాడు. 

మనస్సు మన హృదయానికి  కిటికీ వంటిది. మనము మన మనస్సులను నిరంతరం అంధకారంలో నివసించడానికి అనుమతించినట్లయితే, హృదయము అంధకారాన్ని అనుభవిస్తుంది. కానీ మనము మన మనస్సు యొక్క కిటికీని వెలుగుకు తెరిచినట్లయితే, హృదయము వెలుగును అనుభవిస్తుంది.

అవన్నిటికి పైగా, ఆలోచించడానికి మరియు దృష్టి సారించడానికి మన మనస్సులకున్న ఈ గొప్ప సామర్థ్యం యేసును తలంచడం కోసమే నియమించబడింది. అందుచేత, “మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి” అనే మాటలు పాటించడానికి సిద్ధపడదాం (హెబ్రీ 12:3).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...