మధురమైన దేవుని ప్రణాళికలు

మధురమైన దేవుని ప్రణాళికలు

షేర్ చెయ్యండి:

“తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు”. (గలతీ 1:15)

పౌలు మారుమనస్సును విషయంలో క్రీస్తు సార్వభౌమాధికారమును గురించి లోతుగా ఆలోచించండి మరియు పౌలు పాపాలకు మీ రక్షణతో సంబంధం ఏమిటో ఆలోచించండి.

“తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి”, ఆపైకొన్ని సంవత్సరాల తరువాత, దమస్కు రహదారిపై, “తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు” (గలతీ 1:15) అని పౌలు చెప్తున్నాడు. పౌలు యొక్క జన్మకు మరియు దమస్కు రహదారిపై అతని పిలుపుకు మధ్యలో అతను ఎన్నుకోబడినవాడే, కానీ ఇంకా పిలవబడని, దేవుని సాధనం అని దీని అర్థం (అపొస్తలుల కార్యాలు 9:15; 22:14).

దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తిగా, త్వరలో క్రైస్తవ మిషనరీగా కాబోతున్న పౌలు, క్రైస్తవులను కొట్టి, ఖైదు చేస్తున్నాడని మరియు హత్య చేస్తున్నాడని దీని అర్థం.

“నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను. నేను నేలమీద పడిపోయినపుడు సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని”. (అపొస్తలుల కార్యాలు 22:6–7)

ఈ పిలుపును తిరస్కరించడానికి లేదా తప్పించుకోవడానికి లేదు. పౌలు పుట్టకముందే దేవుడు అతనిని దీని కోసం ఎన్నుకున్నాడు. ఇప్పుడు దేవుడు అతనిని పిలుచుకుంటున్నాడు. క్రీస్తు వాక్యం సార్వభౌమాధికారం గలది. ఎటువంటి చర్చలకు తావులేదు.

“నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను”. (అపొస్తలుల కార్యాలు 22:10)

పౌలును రక్షించడానికి దశాబ్దాలుగా ఫలించని దైవిక ప్రయత్నాల తర్వాత, చివరకు దమస్కులో క్రీస్తుకు తనకు తానుగా లొంగిపోయాడని కాదు; కానే కాదు. దేవుడు అతనిని ఎన్నుకోవడానికి (అతను పుట్టక ముందు) సమయం కలదు మరియు అతనిని (దమస్కురహదారిపై) పిలవడానికి ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు పిలిచాడు, కాబట్టి లొంగిపోయాడు.

కాబట్టి, పౌలు పుట్టుకకు మరియు అతని పిలుపుకు మధ్యలో దేవుడు అనుమతించిన పాపాలు ప్రణాళికలో భాగమయ్యాయి, ఎందుకంటే దేవుడు అతన్ని త్వరగా పిలిచే అవకాశం లేదు.

ఆ పాపాల ఉద్ధేశ్యం ఏమిటో మనకి తెలుసా? అవును, మనకు తెలుసు. అవి మీ కోసం మరియు నా కోసం (అనగా కృప చూపినప్పటికి తాము పాపం చేస్తామేమో అని భయపడే వారందరి కొరకు) అనుమతించబడ్డాయి. పౌలు తన పాపాలకు మీ నిరీక్షణకు మద్య సంబంధాన్ని ఇలా చెప్తున్నాడు;

12పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను…. 16అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని“. (1 తిమోతి 1:12, 16)

ఆహా! కఠినులైన, నిస్సహాయులైన పాపాత్ముల సార్వభౌమ రక్షణ విషయంలో దేవుని ప్రణాళికలు ఎంత మధురమైనవి!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...