ఇటువంటి చలి మనలను చంపేస్తుంది

షేర్ చెయ్యండి:

భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే
ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.
గొఱ్ఱెబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే
బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.
ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే.
ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?
ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును
ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
(కీర్తన 147:15–18)

ఇటువంటి చలితో మీరు ఆటలాడకూడదు. ఈ చలి చంపేస్తుంది.

నేను సౌత్ కరోలినా నుండి మిన్నెసోటాకు వచ్చినప్పుడు,ఈ చలి కారణంగా ప్రత్యేకమైన దుస్తులు ధరించాను. కానీ ఒకవేళ నా కారు చెడిపోతే, నా ప్రాణాలను రక్షించే వ్యవస్థను నేను సిద్ధం చేయలేదు

ఒక ఆదివారం రాత్రి చర్చి నుండి ఇంటికి వస్తుండగా, ఈ రకమైన చలిలో, నా కారు చెడిపోయింది. అప్పటికి ఇంకా మొబైలు ఫోనులు వాడకంలో లేవు. కారులో నా భార్య, మా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.

ఆ దారిలో ఎవరూ లేరు. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నానని నేను గ్రహించాను.

వెంటనే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఎవరూ రాలేదు.

నేను దూరంగా ప్రహరీ గోడ ఉన్న ఒక ఇల్లును చూసాను. నేను ప్రహరీ ఎక్కి ఆ ఇంటికి పరిగెత్తి తలుపు తట్టాను. తండ్రిగా అది నా బాధ్యత.

ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు. కారులో నా భార్య మరియు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, మమ్మల్ని లోపలికి అనుమతిస్తారా అని అడిగాను. వారు అనుమతించారు.

ఇటువంటి చలితో మీరు ఆట్లాడకూడదు.

దేవుడు దీనినే ఇంకో విదంగా ఇలా చెప్తున్నాడు: “వేడిగా లేదా చల్లగా, ఎత్తుగా లేదా లోతుగా, పదునైన లేదా మొద్దుబారిన, బిగ్గరగా లేదా నిశ్శబ్దంగా, ప్రకాశవంతంగా లేదా చీకటిగా ఎటువంటి పరిస్థితైనా  . . . నాతో ఆడుకోకు. నేను దేవుణ్ణి. ఇవన్నీ నేనే తయారు చేశాను. వెచ్చని వేసవి గాలులు, తేలికపాటి వర్షాలు, మృదువైన వెన్నెల రాత్రులు, సరస్సు ఒడ్డున మరియు పొలంలో కాలువలు మరియు ఆకాశ పక్షుల వలె అవి కూడా నా గురించి మాట్లాడతాయి.”

ఇటువంటి చలిలో మనమందరం కోరుకోవాల్సింది ఒకటుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...