అసాధారణ ప్రేమకు కీలకమైనది ఏది?
“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి”. (మత్తయి 5:11–12)
మత్తయి 5:44 నుండి శత్రువులను ప్రేమించడం గురించి బోధిస్తున్నప్పుడు నేను వేసిన ప్రశ్నలలో ఒకటి, మిమ్మల్ని అపహరించి చంపాలనుకునే వ్యక్తులను మీరు ఎలా ప్రేమిస్తారు?
మనము దీన్ని ఎలా చేయగలము? ఇలా ప్రేమించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వాస్తవ ప్రపంచంలో కనిపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! క్రీస్తు యొక్క సత్యాన్ని, శక్తిని మరియు వాస్తవికతను ఇంతకంటే ఎక్కువగా ఏదైనా చూపించగలదా?
మత్తయి 5:44లో వివరించబడిన ఈ గొప్ప, త్యాగపూరితమైన ప్రేమకు యేసు ఇదే అధ్యాయంలో ఇంతకుముందు కారణం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను.
ఆయన మత్తయి 5:44లో “మీ శత్రువులను ప్రేమించుము మరియు మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థించుము” అని చెప్పినట్లు, మత్తయి 5:11-12లో హింసించబడుట గురించి మాట్లాడుచున్నాడు. ఈ వాక్యములో విశేషమేమిటంటే, మీరు శత్రువుల వేధింపులను సహించడమే కాకుండా దానిలో ఆనందించగలరు అని యేసు చెప్పాడు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి.”
మన శత్రువుల కోసం ప్రార్థించడం లేదా వారికి మేలు చేయడం కంటే ఇది మించినది. నేను అసాధ్యమైన ఈ మానవ పనిని చేయగలిగితే – అంటే, హింసించబడినందుకు సంతోషిస్తే – అప్పుడు నన్ను హింసించేవారిని ప్రేమించడం సాధ్యమవుతుంది. అన్యాయం, బాధ మరియు నష్టాల భయానక పరిస్థితుల మధ్యలో ఆనందమనే అద్భుతం జరిగితే, మనకు హాని చేసే వారి పట్ల ప్రేమ అనే అద్భుతం కూడా జరగవచ్చు.
యేసు ఈ వచనాలలో ఆనందానికి తాళం చెవిని ఇచ్చాడు. “సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” అని ఆయన చెప్పాడు. దేవుని యొక్క భవిష్యత్తు కృపపై విశ్వాసం ఉంచడమే సంతోషానికి కీలకం – అంటే, దేవుడు మీ కోసం ఉంటానని వాగ్దానం చేసిన ప్రతిదానిలో సంతృప్తి చెందడం. “సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును” అని ఆయన చెప్పాడు. పరలోక ఆనందం ఈ భయానక క్షణంలోకి తిరిగి ప్రవహించి మనము ప్రేమించేలా స్వేచ్ఛను అనుగ్రహించడం ద్వారా హింసలలో సంతోషించగలుగుతాం. కాబట్టి, మన శత్రువులు మనల్ని హింసించినప్పుడు వారిని ప్రేమించేలా చేసే స్వేచ్ఛా శక్తియే ఈ ఆనందం.
అదే నిజమైతే, ప్రేమించాలనే ఆజ్ఞ పరోక్షంగా “పైనున్న వాటిమీదనేగాని- దేవుడు మనకు చేసిన వాగ్ధానాలన్నింటి పైన, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి” అని అజ్ఞాపిస్తున్నట్లే (కొలస్సయులకు 3:2).
మన శత్రువును ప్రేమించాలనే ఆజ్ఞ దేవునిలో మరియు ఆయన గొప్ప బహుమానాలలో – ఆయన భవిష్యత్ కృపలలో మనము నిరీక్షణను లోతైన ఆత్మ-సంతృప్తిని కనుగొనాలని ఆదేశం. భవిష్యత్ దయపై విశ్వాసముంచడమే గొప్ప ప్రేమకు కీలకం. దేవుని ప్రేమ “జీవముకంటె ఉత్తమము” (కీర్తన 63:3) అని మన బాధల మధ్యలో మనం ఒప్పించబడి నడిపించబడాలి. మీ శత్రువును ప్రేమించడం వల్ల మీకు పరలోకము లభించదు. పరలోక బహుమానమును నందు సంతోషించడం ద్వారా మన శత్రువును ప్రేమించే శక్తిని పొందుకొంటాము.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web