అసాధారణ ప్రమాద గడియ

అసాధారణ ప్రమాద గడియ

షేర్ చెయ్యండి:

“క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు”. (1 పేతురు 4:14)

నేడు ప్రపంచంలోని చాలా మంది క్రైస్తవులకు క్రీస్తును విశ్వసించడం వల్ల వచ్చే ప్రమాదం గురించి తెలియదు. ఎలాంటి శ్రమలు లేని జీవితానికి మనం అలవాటు పడ్డాము. అదే జీవితం అనిపిస్తుంది.

అయితే అంతా బాగుంది అనుకొన్నపుడు అనుకోకుండా ముప్పు వస్తుంది. కానీ దానికి  మనం తరచుగా కోపంతో స్పందిస్తాం. కానీ మనం పరదేశులు మరియు యాత్రికులము అనే భావనను కోల్పోయామనడానికి ఆ కోపం సంకేతం కావచ్చు (“ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు. . . ” 1 పేతురు 2:11)

బహుశా మనం ఈ ప్రపంచంలో చాలా ఎక్కువగా స్థిరపడిపోయు ఉండవచ్చు. పౌలు వలె మనకు క్రీస్తు పట్ల అంతగా ఆకాంక్ష ఉండదు: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. ” (ఫిలిప్పీయులు 3:20)

మనలో చాలా మందికి ఈ విషయం జ్ఞాపకం చేయవలసిన అవసరం వుంది: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.” (1 పేతురు 4:12). ఇది వింత కాదు.

మిమ్మల్ని చంపడానికి మీపై తన తుపాకిని గురిపెట్టివున్న ఒక క్రూరమైన వ్యక్తి మిమ్మల్ని “మీరు క్రైస్తవులా?” అని అడిగితే ఆ సమయంలో మీరు ఏమి చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అనుకున్న దానికంటే మెరుగైన సమాధానమివ్వడానికి మీకు ఆశ కలిగించే బలమైన పదం ఇక్కడ ఉంది.

పేతురు ఇలా అంటున్నాడు, “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు” (1 పేతురు 4:14). పేతురు నుండి వచ్చిన ఈ ప్రోత్సాహం అసాధారణమైన ముప్పు (అవమానమైనా లేదా మరణమైనా) సమయంలో “మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు” అని చెబుతుంది. క్రైస్తవులు అయినందుకు సంక్షోభ సమయంలో బాధపడేవారికి దేవుడు ప్రత్యేక సహాయం చేస్తాడని అర్థం కాదా?

దేవుడు మన ఇతర బాధలలో లేడని నా ఉద్దేశ్యం కాదు. “క్రీస్తు నామము నిమిత్తము” బాధపడే వారు “మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ” వారిపై “నిలుచుచున్నాడు” కాబట్టి వారు ప్రత్యేకమైన దేవుని  సన్నిధిని అనుభవిస్తారు అని పేతురు చెపుతున్నాడని నా ఉద్దేశ్యం.

ప్రమాదం వచ్చినప్పుడు ఇది మీ అనుభవంగా ఉండాలని ప్రార్థించండి. మనకు వేరే సమయంలో లేని ఓర్పుకు సంబంధించిన వనరులు ఆ క్షణంలో ఉంటాయి. దైర్యంగా ఉండండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...