మరణ భయం ఇక లేదు

మరణ భయం ఇక లేదు

షేర్ చెయ్యండి:

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. (హెబ్రీయులు 2:14-15)

క్రీస్తు మనల్ని మరణ భయం నుండి ఎలా విడిపిస్తాడు? మరియు “నాకున్న సర్వస్వం విడిచి వెల్లనే, ఈ మర్త్య జీవితం కూడా వెళ్లిపోనే” అని చెప్పగలిగే ఒకరకమైన ప్రేమపూర్వక త్యాగంతో జీవించే స్వేచ్ఛని ఎలా అనుగ్రహిస్తాడు?

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. . .

“పిల్లలు” అనే పదం పై వచనాల నుండి తీసుకోబడింది మరియు మెస్సీయ అను క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక సంతానమే ఈ పిల్లలు. వీరు “దేవుని పిల్లలు” కూడా. మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తును పంపడంలో, దేవుడు తన “పిల్లల” రక్షణను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకున్నాడు. “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. . . ”

ఆ ప్రకారమే. . . ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను

శరీరదారిగా అవతరించడానికి పూర్వం శాశ్వతమైన వాక్యంగా (యోహాను 1:1) ఉనికిలో ఉన్న దేవుని కుమారుడు, రక్తమాంసములను ధరించాడు మరియు మానవత్వంతో తన దైవత్వాన్ని ధరించాడు. ఆయన నిజముగా మానవుడు  అయ్యాడు మరియు నిజమైన దేవుడుగా అలాగే ఉన్నాడు.

మరణముద్వారా. . .

 మరణించడానికే క్రీస్తు మనిషిగా మారాడు. శరీరదారిగా అవతరించడానికి పూర్వం దేవుడుగా, ఆయన పాపుల కోసం మరణించలేడు. కానీ రక్తమాంసములను ధరించిన వాడుగా ఆయన మరణించగలడు. మరణించడమే ఆయన లక్ష్యం. అందువల్ల, ఆయన మానవుడిగా జన్మించవలసి వచ్చింది.

మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును. . .

మరణించి, క్రీస్తు అపవాదిని మూర్ఛపోయేలా చేశాడు. ఎలా? మన పాపాలన్నింటినీ కప్పి ఉంచడం ద్వారా (హెబ్రీయులు 10:12). దేవుని యెదుట మనలను నిందించుటకు సాతానుకు ఎటువంటి న్యాయబద్ధమైన ఆధారాలు లేవని దీని అర్థం. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;” (రోమా ​​8:33). అతను ఏ ప్రాతిపదికన నీతిమంతులుగా తీరుస్తాడు? యేసు రక్తము ద్వారా (హెబ్రీయులు 9:14; రోమా 5:9).

మనకు వ్యతిరేకంగా సాతాను వద్ద ఉన్న అంతిమ ఆయుధం మన పాపమే. యేసు మరణం దానిని తీసివేస్తే, అపవాది వద్ద ఉన్న ప్రధాన ఆయుధం అతని చేతిలో నుండి తీసివేయబడింది. ఆ కోణంలో, అతను శక్తిహీనుడయ్యాడు.

జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకునుకాబట్టి, మనం మరణభయం నుండి విముక్తి పొందాము. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. మన ముందు భవిష్యత్ కృప మాత్రమే ఉంది. సాతాను ఆ శాసనాన్ని రద్దు చేయలేడు. మరియు దేవుడు మన అంతిమ భద్రత. ఇది మన జీవితాలపై తక్షణ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న దాస్యత్వమును మరియు భయాన్ని తీసివేయడానికి సంతోషకరమైన ముగింపు కోసం ఆయన మనకు ఉన్నాడు అని అర్థం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...