దురాశ అనే మరణ ఉచ్చు

దురాశ అనే మరణ ఉచ్చు

షేర్ చెయ్యండి:

“ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును”. (1 తిమోతి 6:9) దురాశ ఆత్మను నరకంలో శాశ్వతంగా నాశనం చేస్తుంది.

ఈ విధ్వంసం అనేది తాత్కాలిక ఆర్థిక వైఫల్యం కాదని, నరకంలో అంతిమ విధ్వంసం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అని పౌలు మూడు వచనాల తర్వాత 1 తిమోతి 6:12లో చెప్పాడు. విశ్వాస పోరాటంతో దురాశను ప్రతిఘటించాలని చెప్పాడు. ఆ తర్వాత, “నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.” దురాశను విడిచిపెట్టి, భవిష్యత్ కృపపై విశ్వాసం ద్వారా సంతృప్తి కోసం పోరాడడంలో ప్రమాదంలో ఉన్నది ఏదనగా నిత్యజీవమే.

కాబట్టి, పౌలు 1 తిమోతి 6:9లో ధనవంతులుగా ఉండాలనే కోరిక ప్రజలను నాశనం చేస్తుందని చెప్పినప్పుడు, దురాశ మీ వివాహాన్ని లేదా మీ వ్యాపారాన్ని గందరగోళానికి గురి చేస్తుందని అతను చెప్పడం లేదు (అది ఖచ్చితంగా చేయగలదు!). దురాశ మీ శాశ్వత జీవితాన్ని పాడు చేయగలదని అతడు చెబుతున్నాడు. లేదా, 1 తిమోతి 6:10 చివరిలో చెప్పినట్లుగా, “కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”

దురాశ అనబడిన విగ్రహారాధన ఎటువంటి విజయం సాధించలేని పరిస్థితికి మనలను తీసుకువస్తుందని మనలను హెచ్చరించడానికి బైబిల్‌లో దేవుడు వివరించాడు. ఈ పదం యొక్క అర్థం డెడ్-ఎండ్ వీధి. ఇది ఒక ట్రిక్ మరియు ఒక ఘోరమైన ఉచ్చు.

కాబట్టి, మీకు నా మాట 1 తిమోతి 6:11: “వీటివి విసర్జించి”. ఇది వస్తున్నట్లు మీరు చూసినప్పుడు (టెలివిజన్ యాడ్లో  లేదా క్రిస్మస్ కేటలాగ్ లేదా ఇంటర్నెట్ పాప్-అప్ లేదా పొరుగువారి కొనుగోలులో), జంతు ప్రదర్శనశాల(zoo) నుండి గర్జిస్తున్న, ఆకలితో అలమటిస్తున్న సింహం నుండి మీరు పరుగెత్తే విధంగా దాని నుండి పరుగెత్తండి. “నిత్యజీవాన్ని పట్టుకోండి.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...