“నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను”. (ఫిలిప్పీయులు 4:11–13)

దేవుని దిన-దిన భవిష్యత్ కృప పౌలు నింపబడడానికి లేదా ఆకలితో ఉండటానికి, అభివృద్ధి చెందడానికి లేదా శ్రమపడడానికి, సమృద్ధిని కలిగి ఉండటానికి లేదా లేమిలో ఉండటానికి బలపరుస్తుంది.

“నేను అన్నీ చేయగలను” అంటే “క్రీస్తు ద్వారా నేను ఆకలితో మరియు బాధలతో మరియు లేమితో ఉండగలను.” ఇది ఫిలిప్పీ 4:19లోని అద్భుతమైన వాగ్దానాన్ని సరైన వెలుగులో మనకు చూపిస్తుంది: “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును”.

ఫిలిప్పీ 4:11–12 దృష్ట్యా “మీ ప్రతి అవసరము” అంటే ఏమిటి? “దేవుని మహిమపరిచే సంతృప్తి కోసం మీకు కావలసినవన్నీ అని దాని అర్థం.” అది ఆకలి కావచ్చు, లేమి కావచ్చు. ఫిలిప్పీయుల పట్ల పౌలుకున్న ప్రేమ దేవునిలో అతనికున్న సంతృప్తి నుండి ప్రవహించింది మరియు సంతృప్తి పుష్కలంగా ఉన్న సమయాల్లో, లేమి సమయాల్లో అవసరమైనది తప్పకుండా సమకూర్చే దేవుని భవిష్యత్తు కృపపై అతనికుండే విశ్వాసం నుండి వచ్చినది.

అత్యాశ అనేది విశ్వాసానికి సరిగ్గా వ్యతిరేకమనది. ఇది క్రీస్తులో సంతృప్తిని కోల్పోయేలా చేస్తుంది. తద్వారా మన హృదయ కోరికలను తీర్చడానికి మనం వేరేవాటిని కోరుకోవడం ప్రారంభిస్తాము, కాని దేవుని సన్నిధి మాత్రమే మనకు సంతృప్తినిస్తుంది. మరియు ప్రతి సందర్భంలోనూ మనకు అవసరమైనది దొరుకుతుందనే దేవుని వాగ్దానంపై ఉన్న అవిశ్వాసానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధమే దురాశకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం.

ఇది హెబ్రీ 13:5లో చాలా స్పష్టంగా ఉంది. ధనాపేక్ష నుండి విముక్తి అనేది దురాశ నుండి విముక్తి అని – అదే  దేవునిలో సంతృప్తి అని రచయిత ఎలా వాదించాడో చూడండి: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.’” “నిన్ను ఎన్నడును ఎడబాయను” అనే వాగ్దానంపై విశ్వాసముంచడమనేది, దేవుణ్ణి అవమానపరిచే అన్ని కోరికల యొక్క శక్తిని – అన్ని దురాశల శక్తిని విరగ్గొడుతుంది.మన హృదయాలలో స్వల్పంగానైనా దురాశ పెరగడాన్ని మనం గ్రహించినప్పుడల్లా, ఈ విశ్వాసం అనే ఆయుధాలను ఉపయోగించి మన శక్తితో పోరాడడం ప్రారంభించాలి.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *