సృష్టించే ఆజ్ఞ.

సృష్టించే ఆజ్ఞ.

షేర్ చెయ్యండి:

సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా. అందుచేత – నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు”. (ఎఫెసీ 5:13,14)

మృతులలో నుండి లేచి రమ్మని యేసు లాజరును ఆజ్ఞాపించినప్పుడు, లాజరు ఎలా ఆ ఆజ్ఞకు లోబడినాడు? “‘లాజరూ, బయటికి రమ్ము’ అని యేసు బిగ్గరగా పలికాడని” యోహాను 11:43వ వచనం చెబుతోంది. అది చనిపోయినవానికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఆ తర్వాత వచనంలో, “చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను” అని యోహాను 11:44 లో రాయబడింది.

లాజరు బయటికి ఎలా వచ్చాడు? చనిపోయిన వ్యక్తి తిరిగి జీవించడానికి ఆ ఆజ్ఞకు ఎలా లోబడగలడు? నూతన జీవాన్ని సృష్టించే శక్తి ఆ ఆజ్ఞకు ఉన్నది. బ్రతికున్న ప్రజలు ఆజ్ఞకు లోబడినట్లుగా లోబడడమే ఈ ప్రశ్నకు జవాబు అనిపిస్తోంది.

ఇది అతి ప్రాముఖ్యమైన విషయం. “మృతులలో నుండి పైకి లేవడం!” అనే దేవుని ఆజ్ఞలోనే మనం విధేయత చూపడానికి కావాల్సిన శక్తి ఉంది. మనమే జీవాన్ని సృష్టించడం ద్వారా ఆ శక్తికి లోబడటం లేదు. బ్రతికున్న ప్రజలు ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా మనం ఆ శక్తికి లోబడుతున్నాం.లాజరు బయటికి వచ్చాడు, మృతులలో నుండి లేపబడ్డాడు. యేసు వద్దకు నడుస్తూ వెళ్ళాడు.

దేవుని పిలుపు జీవమును పుట్టిస్తుంది. ఆ పిలుపు సృష్టించేవాటిలో ఉన్న శక్తికి మనం స్పందిస్తాం.

ఎఫెసీ 5:14లో  “నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు” అని పౌలు గారు చెప్పారు.  నిద్రపోతున్నప్పుడు, నిద్ర నుండి మేల్కొనడమనే ఆజ్ఞకు ఎలా లోబడగలరు?

మీ ఇల్లు విషపూరితమైన కార్బన్ మొనాక్సైడ్ చేత నింపబడి ఉంటే, “లేవండి! మిమ్మల్ని మీరు రక్షించుకోండి! బయటకు రండి!” అని ఎవరో ఒకరు గట్టిగా కేకలు వేస్తారు. మిమ్మల్ని మీరు మేల్కొలపడం ద్వారా ఆ ఆజ్ఞకు మీరు లోబడరు. గట్టిగా అరిచి చెప్పబడిన శక్తివంతమైన ఆదేశం ద్వారా మాత్రమే మీరు నిద్ర నుండి లేపబడతారు. ప్రమాదం సంభవించినప్పుడు మేల్కొని ఉన్నవారు ఎలా చేస్తారో అలాగే మీరు కూడా లోబడతారు. మీరు పైకి లేచి, ఇంటి నుండి బయటకు వస్తారు. ఆ పిలుపు మిమ్మల్ని మేల్కొలుపుతుంది. పిలుపు సృష్టించిన మేల్కొలుపు అనే శక్తికి మీరు స్పందిస్తారు.

నూతనంగా జన్మించడం గురించి బైబిల్ విరుద్ధమైన విషయాలు ఎందుకు చెబుతుందనేదానికి ఇది వివరణ అని నేను నమ్ముతాను.అదేమిటంటే, మనం కొత్త హృదయాలను పొందాలి, కాని కొత్త హృదయాన్ని సృష్టించేది దేవుడే.

ఉదాహరణకు:

ద్వితీయోపదేశకాండం 10:16: “…. మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని…..”

ద్వితీయోపదేశకాండం 30:6: “….దేవుడైన యెహోవా … నీ హృదయమునకును… సున్నతి చేయును.”

యెహెజ్కేలు 18:31: “… నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి!”

యెహెజ్కేలు 36:26: “… నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను… ”

యోహాను 3:7: “…మీరు క్రొత్తగా జన్మింపవలెను…”

1 పేతురు 1:3: “… ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను…”

క్రొత్తగా జన్మించే ఆజ్ఞకు విధేయత చూపే మార్గమేదంటే, మొదట జీవితం మరియు ఊపిరి అనే దైవిక బహుమానాన్ని అనుభవించడం. ఆ తర్వాత ఊపిరి గల ఈ బ్రతికున్నవారు, చేయాల్సింది ఏమిటంటే విశ్వాసంలో, కృతజ్ఞతలో, ప్రేమలో దేవునికి మొర పెట్టడం. 

సృస్టించగల, మార్పుచేయగల పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు, అది నూతన జీవమునిస్తుంది. మనం దానిని నమ్ముతాం, ఆనందిస్తాం, విధేయత చూపుతాం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...