“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును”. (కీర్తన 23:4)
23వ కీర్తనను అమర్చిన విధానము నుండి మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి.
కీర్తన 23:1–3లో దావీదు దేవున్ని “ఆయన” అని సంబోధించాడు:
యెహోవా నా కాపరి. . .
ఆయన నన్ను పరుండజేయు చున్నాడు. . .
ఆయన నన్ను నడిపించుచున్నాడు. . .
ఆయన నా ప్రాణమునకు సేదదీర్చుచున్నాడు.
తర్వాత 4 మరియు 5 వచనాలలో దావీదు దేవున్ని “నీవు” అని సంబోధించాడు:
ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు;
నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు.
తర్వాత 6వ వచనంలో దావీదు తిరిగి మొదట్లోలానే సంబోధిస్తాడు:
యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, దేవునితో మాట్లాడకుండా దేవుని గురించి ఎక్కువసేపు మాట్లాడకపోవడమే మంచిది.
వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు ఒక వేదాంతపరుడే- అనగా, దేవుని స్వభావం మరియు మార్గాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి, తరువాత వాటిని మాటలలో వ్యక్తపరిచేవాడు. మనం వేదాంతవేత్తలు కానట్లయితే, మనం ఎప్పుడూ ఒకరికొకరం గాని లేదా దేవునితో గాని దేవుని గురించి ఏమీ చెప్పుకోలేము. అప్పుడు ఒకరి విశ్వాసానికి ఒకరం మనము ఏ విధంగా కూడా ఉపయోగపడము.
కానీ నేను 23వ కీర్తన మరియు ఇతర కీర్తనలలో దావీదు నుండి నేర్చుకున్నది ఏమిటంటే, నేను నా వేదాంతాన్ని (థియాలజి) ప్రార్థనతో ముడిపెట్టాలి. నేను తరచుగా దేవునితో మాట్లాడటం ద్వారా దేవుని గురించి మాట్లాడటానికి అంతరాయం కలిగించాలి.
“దేవుడు ఉదారంగా ఉన్నాడు” అనే వేదాంత వాక్యం వెనుక, “దేవా, నీ దాతృత్వానికి ధన్యవాదాలు” అనే ప్రార్థన రావాలి.
“దేవుడు మహిమాన్వితుడు” అనే మాటలో, “నేను నీ మహిమను ఆరాధిస్తాను” అని రావాలి.
దేవుని వాస్తవికతను మన హృదయాలలో అనుభూతి చెందుతూ, అలాగే మన మనసులో ఆలోచిస్తూ, మన పెదవులతో వర్ణిస్తూ ఉండాలి.