పునరుత్థానము యొక్క తీవ్రమైన పరిణామాలు

పునరుత్థానము యొక్క తీవ్రమైన పరిణామాలు

షేర్ చెయ్యండి:

“ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమైయుందుము”. (1 కోరింథీ 15:19)

పౌలు, గంట గంటకు పొంచి ఉన్న ప్రమాదం, రోజువారీ మరణం మరియు క్రూర మృగాలతో పోరాటం మొదలగు వాటిని దృష్టిలో పెట్టుకొని, తాను చెప్తున్న మాట ఏంటంటే తాను మరణం నుండి లేపబడకపోతే యేసును అనుసరించే ఈ జీవితం అవివేకమైనది మరియు దయనీయమైనది.

మరణమే ముగింపు అయితే, “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” (1 కొరింథీయులు 15:32) అని చెప్తున్నాడు. దీని అర్థం పునరుత్థానం లేకపోతే మనమందరం తిండిపోతులు మరియు తాగుబోతులుగా మారుదాం అని కాదు. పునరుత్థానం ఉన్న లేకున్నా తాగుబోతులది దయనీయ పరిస్థితే. దాని అర్థం పునరుత్థానం లేకపోతే భూసంబంధమైన ఆనందాల విషయంలో ఇప్పటివరకు మితంగా ఉన్న మనం, వాటి విషయంలో హద్దులు దాటి ప్రవర్తించిన తప్పు లేదు. అలా ప్రవర్తించడమే ఈ జీవితానికి సరియైన విధానం అనిపిస్తుంది.

కానీ పౌలు ఎంచుకున్నది అది కాదు. అతను శ్రమలను ఎంచుకుంటాడు. ఎందుకంటే అతను విధేయతను ఎంచుకుంటాడు. దమస్కు మార్గంలో క్రీస్తును కలుసుకున్న తర్వాత అననియా పౌలు వద్దకు వచ్చి “ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని”(అపొస్తలుల కార్యములు 9:16) అని ప్రభువైన యేసు చెప్పెను అని అంటాడు. పౌలు తన పిలుపులో భాగంగా ఈ శ్రమలను అంగీకరించాడు.

పౌలు ఎలా అంగీకరించగలుగుతున్నాడు? ఈ తీవ్రమైన మరియు బాధాకరమైన విధేయతకు మూలం ఏమిటి? 1కొరింథీయులకు 15:20లో సమాధానం ఇవ్వబడింది: “ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు.” మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు లేచాడు మరియు నేను ఆయనతో పాటు లేస్తాను. కావున, యేసు కొరకు అనుభవించిన శ్రమలు ఏవీ వ్యర్థం కావు (1 కొరింథీయులకు 15:58).

పునరుత్థాన నిరీక్షణ పౌలు జీవన విధానాన్ని సమూలంగా మార్చివేసింది. అది పౌలును ఈ లోకవస్తూభోగాలని అనుభవించాలని సమకూర్చుకోవాలనే ఆలోచనల నుండి విముక్తి కలిగించింది. ఈ జీవితంలో చాలా మంది తమకు ఉండాలని భావించే సుఖాలు మరియు ఆనందాలు లేకుండా కూడా జీవించే శక్తిని ఇది ఇచ్చింది. ఉదాహరణకు, పౌలు వివాహం చేసుకునే హక్కు ఉన్నప్పటికీ (1 కొరింథీయులు 9:5), తాను చాలా బాధలను భరించడానికి పిలువబడ్డాడు కాబట్టి ఆ ఆనందాన్ని త్యజించాడు.

పునరుత్థాన నిరీక్షణ మన ప్రవర్తనను మార్చేస్తుందని యేసు చెప్పారు. ఉదాహరణకు, ఈ జీవితంలో మనకు తిరిగి చెల్లించలేని వారిని మన ఇంటికి ఆహ్వానించమని చెప్పాడు. దీన్ని చేయడానికి మనకి ప్రేరణ ఏంటి? “నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు” (లూకా 14:14).

మన ప్రస్తుత జీవితాలు పునరుత్థానం యొక్క నిరీక్షణతో రూపుదిద్దుకుంటున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇది మనకు తీవ్రమైన పిలుపు. మనం ఈ లోకంలో లాభాలని లేదా పరలోకంలో లాభాలని ఆశించి నిర్ణయాలు తీసుకుంటున్నామా? పునరుత్థానము వెలుగులో మాత్రమే ప్రేమ కోసం మనం చేసే సాహసాలు తెలివైనవిగా అనిపిస్తాయి. అవి లాభమైన నష్టమైన,వాటిని ప్రేమిస్తున్నామా?

జీవితకాలమంతా పునరుత్థానం మన జీవితాలపై  తీవ్రమైన ప్రభావము చూపాలని అందుకోసం మన జీవితాలను ప్రభువుకి మరలా సమర్పించుకోడానికి దేవుడు సహాయం చేయును గాక.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...