పౌలు రక్షణ నీ కోసమే
“నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని”. (1 తిమోతి 1:13–14, 16)
పౌలు యొక్క మార్పు మీ కోసమే. ఇది విన్నారా? “అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని”. అది మనమే – మీరు మరియు నేను.
మీరు దీన్ని చాలా వ్యక్తిగతంగా వింటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు పౌలును ఎన్నుకున్నప్పుడు, ఆయన సార్వభౌమాధికారం ద్వారా అతన్ని రక్షించినపుడు ఆయన మిమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకున్నాడు.
మీరు నిత్యజీవం కోసం యేసును విశ్వసిస్తే – లేదా నిత్యజీవం కోసం మీరు ఆయనను ఒకవేళ భవిష్యత్తులో విశ్వసిస్తే – పౌలు యొక్క మార్పు మీ కోసమే. క్రీస్తు యొక్క అపురూపమైన దీర్ఘశాంతమును మీకు తేటతెల్లం చేయడం కోసం పౌలు జీవితంలో ఈ మార్పు జరిగింది.
మార్పుకు ముందు పౌలు జీవితం యేసుకు ఒక సుదీర్ఘమైన పరీక్ష అని గుర్తుంచుకోండి. “నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని యేసు దమస్కు మార్గంలో పౌలును అడిగాడు (అ.కా 9:4). “నీ అవిశ్వాసం తిరుగుబాటు జీవితం నాకు హింస!” మరియు ఇంకా తాను పుట్టకముందే దేవుడు తన అపొస్తలులత్వం కొరకు వేరు చేయబడ్డాడని పౌలు గలతీ 1:15లో చెప్పాడు. ఇది అద్భుతమైన విషయం. దీని అర్థం, రక్షించబడక ముందు వరకు అతని జీవితమంతా చాలా కాలం దేవుణ్ణి దూషిస్తున్నాడు మరియు అతను పుట్టకముందే అపొస్తలుడిగా ఎన్నుకున్న యేసును దీర్ఘకాలము తిరస్కరించి అపహాస్యం చేశాడు.
అందుకే పౌలు తన మార్పు యేసు దీర్ఘశాంతమునకు అద్భుతమైన నిదర్శనమని చెప్పాడు. ఆయన ఈ రోజు మనపట్ల చూపిస్తున్నది అదే దీర్ఘశాంతము.
మనం దైర్యం కోల్పోకుండా ఉండేందుకు, ఆయన నిజంగా మనల్ని రక్షించలేడని మనం అనుకోకుండా ఉండేందుకు, ఆయన కోపంతో ఉన్నాడని మనం అనుకోకుండా ఉండేందుకు, మనం చాలా దూరం వెళ్లామని అనుకోకుండా ఉండేందుకు, యేసు యొక్క సార్వభౌమాధికారం, పొంగిపొర్లుతున్న దయ ద్వారా మనకు ప్రియమైన వ్యక్తిని మార్చలేడని మనం అనుకోకుండా ఉండేందుకు, మన కోసమే మనకు “దేవుని సంపూర్ణ సహనమును ప్రదర్శించుటకు” (1 తిమోతి 1:16), యేసు పౌలును రక్షించాడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web