దేవుని కోసం, సత్యం కోసం ఆశ కలిగి ఉండుట.

దేవుని కోసం, సత్యం కోసం ఆశ కలిగి ఉండుట.

షేర్ చెయ్యండి:

కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. (రోమా. 3:3-4)

సత్యం పట్ల మనకున్న శ్రద్ధ తప్పనిసరిగా దేవునిపట్ల మనకున్న శ్రద్ధ నుండి పుడుతుంది. దేవుడు ఉనికిలో ఉన్నట్లయితే, ఆయనే సమస్తానికి ప్రమాణం. సమస్తాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్న ప్రమాణంలోనే మనం కూడా ఆలోచించాలి. 

సత్యమును గురించి పట్టించుకోకపోవడమంటే దేవుని గురించి పట్టించుకోకపోవడమే. దేవుణ్ణి అమితంగా ప్రేమించడం అంటే సత్యాన్ని అమితంగా ప్రేమించడమే. జీవితంలో దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉండడమంటే పెట్టుకోవడం అంటే సేవలో సత్యం ప్రకారం నడిపించబడడం అని అర్థం. సత్యం కానిదేదో అది దేవునికి సంబంధించింది కాదు.

దేవుని గురించి, సత్యం గురించి ఉన్నటువంటి ఈ నాలుగు వాక్య భాగాలను గమనించండి:

1) దేవుడే సత్యం

రోమా 3:3-4 (తండ్రియైన దేవుడు): “కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.”

యోహాను 14:6 (కుమారుడైన దేవుడు): “యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”

యోహాను 15:26 (పరిశుద్ధాత్మ దేవుడు): “తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.”

2) సత్యాన్ని ప్రేమించకపోవడం అనేది నిత్య వినాశనానికి దారి తీస్తుంది.

2 థెస్స 2:9: “నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక” దుష్టులు నశిస్తారు.

3) క్రైస్తవ జీవితం, సత్య సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది

1 కొరింథీ 6:15-16: “మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? – వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?”

4) క్రీస్తు శరీరం ప్రేమయందు సత్యముతో కట్టబడుతుంది

కొలొస్స 1:28: “ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.”

దేవుడు కోసం, సత్యం కోసం ఆశపడు ఉత్సాహపరులుగా దేవుడు మనల్ని చేయునుగాక.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...