నిరాయుధుడైన మన శత్రువు

నిరాయుధుడైన మన శత్రువు

షేర్ చెయ్యండి:

మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.” (కొలొస్స 2:13-15)

క్రీస్తుతో ఐక్యమవ్వడం ద్వారా ఒక విశ్వాసికి కలిగే ఒక గొప్ప వ్యత్యాసాన్ని కలిగించే ఒక కారణం కల్వరిలో క్రీస్తు సాతాను మీద ఒక నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించడమే. ఆయన సాతానును లోకం నుండి తీసివేయలేదు గాని అతని చేతినుండి శపించు ఆయుధాన్ని తీసివేసి అతణ్ణి నిరాయుధునిగా చేశాడు.

క్షమించబడని పాపవిషయమై అతను విశ్వాసులను నిందించలేడు. ఇది మనల్ని నాశనం చేసే ఏకైక ఆరోపణ. అందుచేత, వాడు మనల్ని పూర్తిగా నాశనం చేయలేడు. దేవుడు అనుమతిస్తేనే అతడు మనల్ని శారీరకంగా, మానసికంగా హాని చేయగలడు, మనల్ని చంపగలడు. వాడు మనల్ని శోధించగలడు మరియు మనకు విరుద్ధంగా ఇతరుల్ని ప్రేరేపించగలడు. అయితే, వాడు మనల్ని సంపూర్ణంగా నాశనం చేయలేడు.

కొలొస్స 2:13-15 వచనాలలోని నిర్ణయాత్మక విజయం అనేది ఏంటంటే “మనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఋణ ప్రత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు” అనే వాస్తవాన్ని ఒప్పుకోవడమే. ఆ సాతానుడు మనకు విరుద్ధంగా తన ప్రధాన ఆరోపణను చేసాడు.  అతనికిప్పుడు పరలోకపు న్యాయస్థానములో ఆరోపించడానికి ఎటువంటి ఆరోపణ లేదు. అతడు మనల్ని నాశనం చేయాలనుకున్నాడు గాని అతడు మనల్ని ఏమి చేయలేని నిస్సహాయుడయ్యాడు. అతడు ఏమీ చేయలేడు. మనకు పడవలసిన శిక్షను క్రీస్తు భరించాడు. సాతానుడు నిరాయుధుడయ్యాడు.

ఈ విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే హెబ్రీ 2:13-15 వచనాలను చూడండి: “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను [క్రీస్తు శరీరధారిగా వచ్చాడు].”

మరణం అనేది ఇంకా మన శత్రువే. అయితే, దీనికి ఎటువంటి శక్తి లేదు, దాని ముల్లు విరువబడింది. పాము యొక్క విషం తీసివేయబడింది. ఇక మరణపు ముల్లు లేదు. మరణపు ముల్లే పాపముగా ఉండింది. పాపపు ఆధిపత్యపు శక్తి ధర్మశాస్త్రంలో ఉండింది. అయితే, ధర్మశాస్త్రం కోరుకున్నదానిని (డిమాండును) నెరవేర్చిన క్రీస్తుకు వందనాలు. “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?” (1 కొరింథీ 15:55).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...