శాశ్వత ఆనందం మాత్రమే

శాశ్వత ఆనందం మాత్రమే

షేర్ చెయ్యండి:

“అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్ద నుండి తీసివేయడు”. (యోహాను 16:22)

“మీ సంతోషమును ఎవడును మీయెద్దనుండి తీసివేయడు,” ఎందుకంటే మీ ఆనందం యేసుతో ఉండడం ద్వారా వచ్చింది మరియు యేసు యొక్క పునరుత్థానం అంటే మీరు ఎప్పటికీ చనిపోరని అర్థం; మీరు ఎప్పటికీ ఆయన నుండి వీడిపోరని అర్థం.

అందుచేత, మీ సంతోషము మీ వద్ద నుండి ఎవరు తీసివేయకూడదనుకుంటే పైన చెప్పిన రెండు విషయాలు నిజం కావాలి. ఒకటి, మీ ఆనందానికి మూలమైనది శాశ్వతంగా ఉండాలి మరియు మీరు శాశ్వతంగా ఉండాలి. మీరైనా, లేక మీ ఆనందానికి గల కారణం క్షయమైనదైతే, మీ ఆనందం మీ వద్ద నుండి తీసివేయబడుతుంది.

అయ్యో, ఎంత మంది అలా ఉండిపోయారో! తినండి, త్రాగండి, సుఖించండి, ఎందుకంటే రేపు మనం చనిపోతామని వారు చెప్తారు (లూకా 12:19). ఆహారం శాశ్వతంగా ఉండదు, నేను కూడా శాశ్వతంగా ఉండను. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని బాగా అనుభవిద్దామని వారు చెప్పుకుంటారు. ఎంత విచారకరమో కదా!

అటువంటి ఆలోచనకు మీరొకవేళ గురైనట్లయితే, యేసుతో ఉండడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుకుంటున్నారని, రాబోయే జీవితంలో “మీ సంతోషం మీనుండి ఎవరూ తీసివేయలేరు” అని సాధ్యమైనంత తీవ్ర స్థాయిలో పరిగణించండి.

జీవమైనా, మరణమైనా, దూతలైనా, ప్రధానులైనా, ప్రస్తుతమందున్నవైనా, రాబోవు సంగతులైనా, శక్తులైనా, ఎత్తులైనా, లోతులైనా, సృష్టిలో ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తులో మనకున్న ఆనందాన్ని తీసివేయలేవు (రోమా 8:38-39).

యేసుతో ఉండటంలో కలిగియున్న ఆనందం ఇప్పటి నుండి నిత్యత్త్వం వరకు ఉన్న ఒక తీగ. ఆయన మరణం ద్వారా గాని, మన మరణాల ద్వారా గాని అది తెగిపోయేది కాదు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...