దేవుడిచ్చిన శతృవులు మరియు దేవుడిచ్చిన విశ్వాసం

దేవుడిచ్చిన శతృవులు మరియు దేవుడిచ్చిన విశ్వాసం

షేర్ చెయ్యండి:

“ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక….. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి….. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను”. (ఫిలిప్పీ 1:27-29)

క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించడం అంటే శత్రువుల ముందు ఎటువంటి భయం లేకుండా జీవించడమని పౌలు ఫిలిప్పీయులకు చెప్పాడు. ఆ తర్వాత ఆయన భయం లేకుండా జీవించడానికి ఒక కారణం చెప్పాడు.

ఆ కారణం ఏంటంటే: దేవుడు మీకు ఒకటి కాదు, విశ్వాసం మరియు శ్రమ అనే రెండు వరాలను ఇచ్చియున్నాడు. 29 మరియు 30 వచనాలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయి. “మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.” మీరు విశ్వసించడానికి మరియు శ్రమ పడటానికి ఆశీర్వదించబడ్డారు.

ఈ సందర్భంలో ఆ మాటకు అర్థం ఏంటంటే: మీరు శ్రమ అనుభవిస్తున్నప్పుడు మీరు కలిగియున్న విశ్వాసం మరియు మీరు కలిగియున్న శ్రమ ఈ రెండు వరాలు దేవుని వద్దనుండి వచ్చినవే. మీరు మీ శత్రువులను చూసి భయపడకండి అని పౌలు చెప్పినప్పుడు వారు ఎందుకు భయపడకూడదో చెప్పడానికి ఆయన మనస్సులో రెండు కారణాలు ఉన్నాయి:

1. శత్రువులందరూ దేవుని చేతిలో ఉన్నారన్నది ఒక కారణం. వారు తిరుగుబాటు దేవుని నుండి వచ్చిన వరమే. దానిని ఆయన పాలిస్తాడు. ఇదే 29వ వచనంలో చెప్పబడిన మొదటి విషయం.

2. భయపడవద్దని చెప్పడానికిగల మరొక కారణం ఏంటంటే భయపడకుండ ఉండనితనం, లేక మీ విశ్వాసం అనేది కూడా దేవుని చేతుల్లోనే ఉంది. ఇది కూడా దేవుని బహుమానమే. ఇదే 29వ వచనంలో చెప్పిన మరొక విషయం.

అందుచేత, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో నిర్భయంగా ఉండటానికిగల కారణం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన రెండు సత్యాలే: మీరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో మీరు కలిగియున్న విశ్వాసం మరియు ప్రతికూలతలు రెండూ దేవుడిచ్చిన బహుమానాలే.

దీనిని ఎందుకు “క్రీస్తు సువార్తకు తగినట్లుగా” జీవించడం అని పిలుస్తారు? ఎ౦దుక౦టే, మనకు విశ్వాసాన్ని ఇవ్వడానికి మరియు మన నిత్యత్వపు మేలు కోసం ఎల్లప్పుడూ మన శత్రువులను ఏలడానికి దేవుని సార్వభౌమాధికార కార్యాన్ని తన ప్రజలందరి కోసం క్రీస్తు నిబంధన రక్తం ఎటువంటి లోపం లేకుండా కొని తెచ్చిపెట్టింది. దీనినే సువార్త భద్రపరచియుంది. అందుచేత, ఆ విధంగా జీవించడం అనేది సువార్తకున్న శక్తిని మరియు మంచితనాన్ని చూపుతుంది.

అందుచేత, భయపడవద్దు. దేవుడు అనుమతించినదానికంటే ఎక్కువగా మీ శత్రువులు ఏమి చేయలేరు. మీకు అవసరమైన విశ్వాసాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాలన్నీ రక్తం ద్వారా కొనబడినవి మరియు ముద్రించబడినవి. అవన్నీ సువార్త వాగ్దానాలు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...