“ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది”. (యోబు 36:26)  

దేవుని గురించి బాగుగా తెలుసుకోవడం అసాధ్యం.

ఈయన ఉనికిని కలిగిన అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఆయనే ఇతరులందరిని సృష్టించాడు మరియు వారు ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నా అది ఆయనకే చెందుతుంది.

ఇతర జీవులు కలిగియున్న బలమైనా, తెలివితేటలైనా, నైపుణ్యమైనా, అందమైనా ఆయన నుండే వస్తుంది. ఇప్పటివరకు మీకు తెలిసిన లేదా మీరు విన్న ఉత్తమ వ్యక్తికంటే ఆయనే అనంతుడైన గొప్పవాడు.

అనంతుడు కావడంతో అనిర్వచనీయమైన ఆసక్తిని కలిగి ఉంటాడు, కాబట్టి దేవుడు విసుగు చెందడం అసాధ్యం. ఆయన జరిగించు అత్యంత తెలివైన మరియు ఆసక్తికరమైన క్రియల నిరంతర ప్రదర్శన అనేది అగ్నిపర్వతం లాంటిది.

ప్రతి మంచి సంతోషానికి మూలంగా, ఆయనే పూర్తిగా మరియు అంతిమంగా సంతోషిస్తాడు. మనం ఆయన్ని అలా అనుభవించకపోతే, మనం చనిపోయినవారంగానైనా లేదా గుడ్డివాళ్ళంగానైనా లేదా నిద్రలో నడిచేవారంగానైనా ఉంటాం.

ఇందుచేతనే, ఈ లోకంలో దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయాస చాలా తక్కువగానే ఉంటుందని చెప్పడంలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇది ఎలా ఉంటుందంటే అమెరికా అధ్యక్షుడు మీతో ఒక నెల పాటు ఉండటానికి వచ్చారని, ప్రతి రోజూ మీరు ఆయనకు హలో మాత్రమే చెప్పారన్నట్లుగా ఉంటుంది. లేదా సూర్యుడు, సౌర కుటుంబం చుట్టూ కొన్ని గంటల పాటు మీరు కాంతివేగంతో ఎగురుతూ కిటికీలోంచి చూడకుండా కంప్యూటర్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంటుంది. లేదా ఉత్తమ నటులు, గాయకులు, క్రీడాకారులు, ఆవిష్కరణ కర్తలు మరియు పండితులు వారి ఉత్తమ ప్రదర్శనను చూడటానికి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు టివిలో వచ్చే సీరియల్ ఆకరి ఎపిసోడ్ చూడడానికి దానిని నిరాకరించినట్లుంటుంది.

అనంతమైన గొప్ప దేవుడు మన హృదయాలను వంచుకొని, ఆయనను వీలైనంత సంపూర్ణంగా చూడటానికి మరియు ఆయనను మరింత తెలుసుకోవడానికి మన కళ్ళు తెరవాలని మనమందరం కలిసి ప్రార్థిద్దాం.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *