చింత విషయంలో ఎలా పోరాడాలి?

చింత విషయంలో ఎలా పోరాడాలి?

షేర్ చెయ్యండి:

“ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద [వేయుడి]”. (1 పేతురు 5:7)

“నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను” అని కీర్తన 56:3 చెబుతోంది.

గమనిక: “భయముతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు” అని ఈ వాక్యం చెప్పట్లేదు. భయం వచ్చినప్పుడు పోరాటం ఆరంభమవుతుంది. అందుచేత, నిజమైన విశ్వాసులకు ఎటువంటి చింతలు ఉండవని బైబిల్ చెప్పట్లేదు గాని చింతలు భయాలు కలిగినప్పుడు వాటితో ఎలా పోరాడాలనే విషయాన్ని బైబిల్ మనకు చెబుతోంది.

ఉదాహరణకు, ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద [వేయుడి] అని 1 పేతురు 5:7 చెబుతోంది. మీకు చింతలనేవే ఉండవని ఈ వాక్యం చెప్పట్లేదు. మీకు చింతలు ఉన్నప్పుడు, వాటిని దేవుని మీద వేయమని చెబుతోంది. మీ కారు విండ్ షీల్డ్ మీద బురద చిట్లినప్పుడు, రోడ్డు కనపడక, తాత్కాలికంగా కంగారు పడి ఆందోళన చెందుతారు. అప్పుడు వైపర్లను ఆన్ చేసి, విండ్ షీల్డ్ వాషర్ తో తుడిచివేయండి.

అందుచేత, ప్రతిరోజూ చింత విషయంలో ఎదుర్కొనే వ్యక్తికి నా స్పందన ఏంటంటే అది చాలా సాధారణ విషయం అని చెప్తాను. కనీసం ఇది నా యుక్త వయస్సు నుండి సర్వ సాధారణంగా జరుగుతున్న విషయమే. సమస్యంతా, వాటితో మనం ఎలా పోరాడుతాం? అన్నదే.

ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే అవిశ్వాసానికి విరుద్ధంగా పోరాటం చేయడం ద్వారా మరియు భవిష్యత్తు కృపలో నమ్మకముంచడం కోసం పోరాటం చేస్తాం. ఈ “మంచి పోరాటం” (1 తిమోతి 6:12; 2 తిమోతి 4:7) చేసే విధానం ఏంటంటే భవిష్యత్తు కృపను గురించి దేవుడిచ్చిన భరోసా మీద ధ్యానం చేయడం మరియు ఆయన ఆత్మ సహాయం కోసం అడగడం.

విండ్ షీల్డ్ వైపర్స్ అనేవి అవిశ్వాసపు బురదను కడిగేటువంటి దేవుని వాగ్దానాలు మరియు విండ్ షీల్డ్ శుభ్రపరిచే ద్రవం అనేది పరిశుద్ధాత్మ సహాయం. చింత అనే పాపంతో సహా పాపం నుండి స్వతంత్రులయ్యే పోరాటమనేది ఆత్మ ద్వారా మరియు సత్యమందు విశ్వాసం ఉంచుట ద్వారా” చేసే పోరాటమైయున్నది (2 థెస్స 2:13). 

ఆత్మ కార్యం మరియు సత్య వాక్యం అనేవి గొప్ప విశ్వాసాన్ని నిర్మిస్తాయి. పరిశుద్ధాత్ముని సున్నితమైన కార్యం లేకుండా వాక్యమనే వైపర్ కేవలం విండ్ షీల్డ్ మీద (కారు అద్దం మీద) ఉండే అవిశ్వాసపు బురదను గీకినట్లుగా ఉంటుదంతే.

ఆత్మ మరియు వాక్యము, రెండూ అవసరమే. మనం దేవుని వాగ్దానాలను నమ్ముతాం మరియు ఆయన ఆత్మ సహాయం కోసం ప్రార్థిస్తాం. విండ్ షీల్డ్ (కారు అద్దాన్ని) తుడిచిన తర్వాత, మన కోసం దేవుడు ప్రణాళిక వేసిన (యిర్మీయా 29:11) సంక్షేమ స్థితిని చూడగలుగుతాం, మన విశ్వాసం మరింత ఎక్కువగా బలపరచబడుతుంది మరియు చింత వెళ్లిపోతుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...