దేవుడు మనలో ప్రతి ఒక్కరికి విభిన్నమైన నైపుణ్యాలు, కోరికలు, స్వభావాలు, మానసిక సామర్థ్యాలు, భావోద్వేగ శక్తులు, అభిరుచులు మొదలైనవాటిని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన తలాంతులను ఉపయోగించి మనం ఏ పాత్రను పోషించాలో ఎలా తెలుసుకోవాలి? ఇది ఎల్లప్పుడూ ఉండే ప్రశ్న. నేడు ఈ ప్రశ్న సాండ్రా అనే ఓ కళాశాల విద్యార్థి నుండి వచ్చింది.
“పాస్టర్ జాన్, నమస్కారం, నా పేరు సాండ్రా. నేను ఓహియో స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని. ఈ పాడ్‌కాస్ట్‌కు మరియు కాలేజీ విద్యార్థుల నుండి ప్రశ్నలు స్వీకరించడానికి మీరు చూపే ఉత్సాహానికి ధన్యవాదాలు. నేను దశాబ్దం క్రితం రక్షించబడ్డాను మరియు క్రీస్తుని ప్రేమిస్తున్నాను. నేను చదివే పుస్తకాలలో మరియు నేను హాజరయ్యే సదస్సులలో, నాపై మరియు నా జీవితంపై దేవుని పిలుపును అర్థం చేసుకోమని నాకు చెప్పబడుతున్నట్లు ఎక్కువగా అనిపిస్తుంది. నేను ఖచ్చితంగా అది తెలుసుకోవాలనుకుంటున్నాను! కానీ నాకు ఇక్కడ కొంత గందరగోళం ఉంది.
“బహుశా నేను వ్యాపారంలోకి వెళ్తానేమో. లేక ఒక ఇంటిని చూసుకునే తల్లిని అవుతానేమో. లేదా నేను కూడా సువార్త ప్రచారకురాలిగా మారుతానేమో? దేవుడు నా కోసం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది, కానీ ప్రార్థించడం తప్ప, నేను ఏం చేయాలో ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియడం లేదు. నా జీవితంలో దేవుని పిలుపును నేను ఎలా కనుగొనగలను? నేను ఎక్కడ ప్రారంభించగలను?”
ఈ ప్రశ్న ఎప్పటికీ పాతది కాదు ఎందుకంటే తరం తర్వాత తరం దీనికి సమాధానం ఇవ్వాలి. దీనికి సమాధానం ఇవ్వడం మాత్రం అంత సులభమేమి కాదు, ఈ గొప్ప బైబిల్ సత్యాలను తిరిగి పరిశీలించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, సాండ్రా.
నేను ఈ ప్రశ్నను మొదలుపెట్టే ముందు, దేవుడు దీనిని ఉపయోగించి వందలాది మందికి తన ఖచ్చితమైన, మహిమాన్వితమైన, అద్భుతమైన చిత్తాన్ని కనుగొనేలా చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇది మీకు స్పష్టంగా తెలిసి ఉండవచ్చు, కానీ అందరికీ అలా తెలిసి ఉండకపోవచ్చు అని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే, నేను మూడు రకాల పిలుపులను వివరించాలనుకుంటున్నాను.
మరణం నుండి జీవానికి పిలవబడ్డారు
మొదటిది, పాపాల్లో చనిపోయిన మనలను దేవుడు పిలిచే ఒక రకమైన పిలుపు ఉంది – ఆ పిలుపు మనలను క్రీస్తుతో ఐక్యపరిచి మరణంలో నుండి జీవంలోకి తీసుకువచ్చే పిలుపు. పౌలు ఈ పిలుపు గురించి 1 కొరింథీయులకు 1:22–24 లో ఈ విధంగా చెప్పాడు, “యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. ”
లక్షలాది మంది ప్రజలు సువార్త సందేశంలో దేవుని సాధారణ పిలుపును వింటారు. అయితే లక్షలాది మందిలో కొందరు ఈ సందేశాన్ని మూర్ఖత్వంగా భావిస్తారని పౌలు చెప్పాడు. కొందరు దీనిని అడ్డంకిగా భావిస్తారు. అయితే కొందరు, ఆ సువార్త సందేశం ద్వారా దేవుని యొక్క దివ్యమైన, అంతర్గత పిలుపును గ్రహించి “సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తియని, దేవుని జ్ఞానమని చెప్తారు.
“దేవా, నా జీవితాన్ని వృధా చేసే నిర్ణయాలు తీసుకోనివ్వకు.”
వారు దానిని హత్తుకుంటారు, మరియు వారు రక్షించబడ్డారు. క్రైస్తవులందరూ ఈ కోణంలో పిలువబడ్డారు. మరణం నుండి జీవానికి తీసుకువచ్చిన దేవుని సార్వభౌమ పిలుపు ద్వారా మనం క్రైస్తవులుగా మార్చబడ్డాము.
ఒక నిబంధనకై పిలువబడ్డాము
రెండవది,మనం దేవుని సన్నిధిలో చేసే జీవితకాల నిబంధనలలో మరొక రకమైన పిలుపు ఉంది దానిలోబైబిల్ నిర్దేశించిన వివాహ నిబంధన ప్రధానమైనది. దేవుడు ఇద్దరు వ్యక్తులను ఒక నిబంధనలో కలిపినప్పుడు – ప్రధానంగా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మరియు సంఘానికి చేసిన నిబంధన యొక్క సారూప్యతపై – దేవుడు ఒక పురుషుడిని మరియు స్త్రీని అలా కలిపినప్పుడు, ఏ మనుష్యుడు కూడా దీనిని విడదీయలేని విధంగా దేవుడు వారిని జతపరచాడని యేసు చెప్పాడు (మార్కు 10:9). కాబట్టి వివాహంలో మనకు ఉన్న పిలుపు, ఏదైనా నిర్దిష్ట వృత్తికి మనం చేసే పిలుపులా కాకుండా ఉంటుంది.
మీరు ఉద్యోగంలో చేరినప్పుడు, మీరు దేవుని ముందు జీవితాంతం నిబంధనను ఏర్పరచుకోవడం లేదు. మీరు ఉద్యోగాలు మార్చుకోవచ్చు. మీరు వివాహం చేసుకున్నప్పుడు, “మరణం మనల్ని ఎడబాపు వరకు” అని మీ పిలుపు ఉంటుంది. అది రెండవ రకమైన పిలుపు. ఇది నేను ఇప్పుడు మాట్లాడబోయే మూడవ రకం లాంటిది కాదు, సాండ్రా నిజంగా అలాంటిదే అడుగుతోంది.
ఒక ప్రక్రియ కోసం పిలువబడటం
మూడవ రకమైన పిలుపు ఒక ప్రక్రియ. ఈ పిలుపు ద్వారా దేవుడు తన పిల్లలను సంఘంలో గానీ, ఉద్యోగ స్థలంలో గానీ, ఇంట్లో గానీ ఫలవంతమైన సేవా స్థానాలలోకి నడిపించే ప్రక్రియ అని నేను చెప్తున్నాను.
ఈ రకమైన పిలుపును మనం వినే విధానం ఏమిటంటే, మనలను ప్రపంచంలో ఫలవంతమైన సేవా స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు మన కోసం పనిచేస్తున్న ఆరు మార్గాలను గమనించాలి. తప్పనిసరిగా మనకు యాభై సంవత్సరాలు కలిగి ఉండే పదవి ఉండకపోవచ్చు. దేవుని పిలుపు మారుతుంటుంది, మనం ఆ మార్పును గమనించవచ్చు. అయితే, తదుపరి పిలుపు ఏమిటి? అది జీవితాంతం కొనసాగుతుందా, లేక పదేళ్ల పాటు మాత్రమే ఉంటుందా? ఇదే ప్రశ్న సాండ్రా అడుగుతోంది.
ఈ ఆరు విషయాలు ఇక్కడ ఉన్నాయి మరియు నేను వాటిని చాలా క్లుప్తంగా చెబుతాను. ఆమె ఇలా చెప్పింది “ప్రార్థించడం తప్ప నాకు ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.” ఇది నిజమే, ఎందుకంటే ప్రార్థన ఈ ఆరు విషయాల్లో ఒకటి. కానీ ప్రార్థనతో పాటు మనం దృష్టి పెట్టాల్సిన మరో ఐదు విషయాలు కూడా ఉన్నాయి. అవే మనకు దేవుని పిలుపును స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.
1. మంచి చేసే పనులలో నడవడం
లేఖనాల ద్వారా క్రీస్తు కేంద్రంగా ఉన్న ఒక జీవన దృక్పథాన్ని దేవుడు మనకు వెల్లడిస్తాడు మరియు కొన్ని వృత్తులు, కొన్ని పరిశ్రమలు, లేక పరిశ్రమలను నిర్వహించే కొన్ని మార్గాలు మంచివి మరియు మరికొన్ని చెడ్డవి అని లేఖనాలలో మనకు వెల్లడిచేశాడు.
ఏది మంచి, ఏది చెడు అనేది స్పష్టంగా తెలియనప్పుడు ప్రపంచంలో కొన్ని సేవా మార్గాలు ఎక్కువ ఉపయోగకరంగా లేదా తక్కువ ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన మనకు చూపిస్తాడు.
“ఎన్నో ఎంపికలున్న ఈ ప్రపంచంలో,
దేవుని బహుమతులు ఆయన పిలుపుతో నడిచే మార్గంలో ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి.”
దీన్ని మనకు చూపిస్తూ, లోకంలో చెడు లేదా హాని కలిగించే లేదా నిరుపయోగకరమైన పిలుపుల నుండి మనలను దూరంగా ఉంచడానికి ఆయన పని చేస్తాడు. ప్రతి వృత్తి క్రీస్తు అనుచరుడికి అనుకూలంగా ఉండదు మరియు అది దేవుడు మనకు ఇచ్చే చాలా ముఖ్యమైన మార్గదర్శకత్వం.
2. అవసరాల వైపు పరిగెత్తడం
దేవుడు ప్రపంచంలోని నిజమైన అవసరం ఏమిటో మరియు ప్రపంచానికి నిజంగా ఏమి అవసరమో రెండింటినీ మనకు చూపించడానికి తన వాక్యం ద్వారా మాట్లాడాడు. మన వృత్తిలో మనకు మార్గనిర్దేశం చేసేలా మన వ్యక్తిగత భద్రత, సౌకర్యం, సంపద మరియు సౌలభ్యం గురించి మాత్రమే ఆలోచించకుండా తన ప్రజలను ఆ అవసరాల వైపు మొగ్గు చూపడానికి ఆయన చర్య తీసుకున్నాడు.
“నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” (మార్కు 12:31) అని ఆయన చెప్పాడు. మానవ అవసరాన్ని ఎలా నిర్వచించాలో ఆయన మనకు అవగాహన కల్పించాడు. ఆ అవసరాలు ఎక్కడ ఉన్నాయో గ్రహించడానికి ఆయన మనకు కళ్ళు మరియు చెవులను ఇచ్చాడు. కాబట్టి మనకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన చర్యలో ఒక భాగం ఏమిటంటే, మనల్ని స్వార్థం నుండి దూరం చేసి, అవసరాలను తీర్చే దిశగా మళ్లించి, ఆపై ప్రపంచంలోని నిజమైన అవసరాలను మనకు చూపించడం.
3. మీరు ప్రేమించే విషయాలను మరచిపోకండి
దేవుడు ప్రతి క్రైస్తవునిలో వివిధ సామర్థ్యాలను ఇవ్వడానికి చర్య తీసుకున్నాడు, లేదా మనం వాటిని తలాంతులు అని పిలవవచ్చు. పౌలు దీని గురించి ఎలా మాట్లాడుతున్నాడో వినండి ఎందుకంటే మీరు అలా చేస్తే నేను మాట్లాడుతున్న దాని రుచి మీకు అర్థమవుతుంది. “సరే, అది కేవలం ఆత్మీయమైనది. అది సంఘానికి సంబందించినది” అని మీరు చెప్పే దాని గురించి నేను మాట్లాడటం లేదు.
అయన చెప్పినది ఇక్కడ రోమా 12:6-8 లో ఉంది: “మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,” — వేరు వేరు కృపావరాలు — “ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
ఇప్పుడు, ఆ చివరి మూడు – పంచిపెట్టుట, పైవిచారణ చేయుట మరియు కరుణించుట అనే ఈ వరాలు క్రైస్తవ సమాజంలోని జీవితానికి మరియు సాధారణ మానవ సంబంధాలలోని జీవితానికి రెండింటికీ వర్తిస్తాయని మనం గమనించేలా చేయాలి.
“పరిశుద్ధత దేవుని చిత్తమైతే, పరిశుద్ధత నుంచి కలిగే కోరికలు
మీ మార్గదర్శకత్వానికి ముఖ్యమైనవని చెప్పడం సురక్షితం.”
ఇక్కడ నా ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే మనందరికీ వేర్వేరు స్వభావాలు, అంతర్ దృష్టి, విభిన్న ప్రవృత్తులు, విభిన్న నైపుణ్యాలు, విభిన్న మానసిక సామర్థ్యాలు, విభిన్న భావోద్వేగ బలాలు, విభిన్న అభిరుచులు, ఒత్తిడి మరియు ఓర్పు కోసం విభిన్న సామర్థ్యాలు, సమూహాలు మరియు ఏకాంతానికి వేర్వేరు సామర్థ్యాలు, మరియు ఇంకా ఇంకా ఇంకా ఉన్నాయి. ఆహాదేవుడు మనల్ని ఎంత భిన్నంగా చేశాడో! అంటే ఆయన మనల్ని కొన్ని విషయాల్లో ఇతర విషయాల కంటే మరింత ప్రభావవంతంగా ఉండేలా, ఇతర పనుల కంటే ఇంట్లో కొన్ని పనులు చేయడంలో మరింత ప్రభావవంతంగా ఉండేలా ఆయన మనల్ని రూపొందించాడు.
ఇంట్లో ఉండటం గురించి ప్రస్తావించినప్పుడు నేను దానిని సంపూర్ణమైనదని చెప్పడం లేదు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు అనిపించేది మాత్రమే చేయాలని నేను చెప్పడం లేదు. ఈ రోజు చాలా మంది యువకులు చేస్తున్న పెద్ద తప్పు అది అని నేను భావిస్తున్నాను. వారు ఇలా అంటున్నారు, “నా వరాలకు సరిగ్గా సరిపోయేది మాత్రమే నేను చేస్తాను. నా అభిరుచులకు సరిగ్గా సరిపోయేది మాత్రమే చేస్తాను. నాకు నిజంగా సంతృప్తినిచ్చేది మాత్రమే నేను చేస్తాను, ఎందుకంటే నా వ్యక్తిగత చేతికి చేతి అది తొడుగులా సరిపోతుంది.”
చరిత్రలో చాలా సార్లు ప్రజలు తమ మనుగడను కాపాడుకోవడానికి, లేదా మహత్తరమైన మేలు చేయడానికి, వారు చేయవలసిన అవసరం ఉన్నందున వారు చేయడానికి తగినవి కాదని భావించిన అనేక పనులు చేయాల్సి వచ్చింది.
ఏది ఏమైనప్పటికీ, ఎంపికలు చాలా ఉన్న ప్రపంచంలో నేను మద్దతు ఇస్తూ చెబుతాను మరియు పశ్చిమ దేశాలలో ఇది చాలా నిజం, దేవుని వరం దేవుని పిలుపులో మరింత ముఖ్యమైన భాగం అవుతుంది.
4. వినడానికి వేగిరపడండి
దేవుడు మన జీవితాల్లో జ్ఞానవంతులైన సలహాదారులను ఉంచాడు మరియు వారి మాట జాగ్రత్తగా వినాలని తన వాక్యంలో నిర్దేశించాడు. మన చుట్టూ ఉన్న నిజమైన అవసరాలలో ఒకటి సలహాదారుల మాట వినడం. ఇది సామెతలు 11:14: “నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.” కాబట్టి మనం శూన్యంలో పనిచేయము. మీ జీవితం పట్ల దేవుని చిత్తాన్ని శూన్యంలో కనుగొనడానికి ప్రయత్నించవద్దు. జ్ఞానం మరియు ప్రేమతో కూడిన సమాజంలో మనం భాగమై యున్నాం.
5. మోకాళ్ల ప్రార్థన చేయండి
మనం చేసే ఎంపికలలో జ్ఞానవంతులుగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేవుడు మనకు ప్రార్థన అనే వరాన్ని ఇచ్చాడు. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” ( యాకోబు 1:5 ). కాబట్టి మనం ఈ అంశాలలో ప్రతిదాని గురించి ప్రతిరోజూ ప్రార్థిస్తాము.
నేను 72 సంవత్సరాల వయసులో కూడా దీన్ని చేస్తున్నాను. “దేవా, నా జీవితాన్ని వృధా చేసే పని గురించి నన్ను ఎంపికలు చేసుకోనివ్వకండి” అని ప్రార్థిస్తున్నాను.
6. మీ పవిత్ర కోరికలను పరిగణించండి
ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం కావడంతో కొంత వివాదాస్పదంగా అనిపించవచ్చు. అయితే దేవుడు ఆ ఐదు ముఖ్యమైన విషయాల ద్వారా మరియు ఆయన ఆత్మ ద్వారా మరింత వ్యక్తిగత రీతిలో మన మనస్సుల్లోనూ, హృదయాల్లోనూ పనిచేస్తాడని నేను విశ్వసిస్తాను. సంఘంలో లేదా లోకంలో ఏదో ఒక ప్రత్యేకమైన సేవ కోసం ఆయన మనలో బలమైన, పునరావృతమయ్యే కోరికలను ఉద్భవింపజేస్తాడు. ఈ కోరికలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మనకు అత్యంత ఆత్మీయంగా అర్థవంతమైన క్షణాల్లో మనలను మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయి.
అవును, మీరు చేసే సేవలో మీకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి దేవుడు మీ తరపున చర్య తీసుకునే చాలా ముఖ్యమైన మార్గం మీ కోరికలు అని నేను చెబుతున్నాను. ఆ కోరికలు అత్యంత విశ్వసనీయమైనవి అయినప్పుడు వాటికి మూడు లక్షణాలు ఉంటాయని నేను చెబుతున్నాను.
1. అవి పునరావృతమయ్యే కోరికలు. అవి క్షణికమైన భావోద్వేగాలు కాదు కాని, మరలా మరలా మన హృదయంలో ఉద్భవిస్తూనే ఉంటాయి.
2. అవి బలంగా ఉంటాయి. అవి మారుతున్న అభిరుచుల మాదిరిగా, గతించిపోయేవి కావు, బలహీనమైనవి మరియు అల్పమైనవి కావు.
3. మూడవది అత్యంత ముఖ్యమైనది, ఈ కోరికలు, మీరు పాపంలో నడుస్తున్నప్పుడు, దేవుని నుండి దూరంగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పుడు, ఆరాధనను ఆనందించనప్పుడు, వాక్యంలో సమయం గడపనప్పుడు లేదా ఇతరులకు సేవ చేయడంలో చురుకుగా లేనప్పుడు వచ్చే కోరికలు కావు. అటువంటి సందర్భాల్లో కలిగే కోరికలు విశ్వసనీయమైనవి కావు. పౌలు స్పష్టంగా చెప్పాడు, “మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము” (1 థెస్సలొనీకయులకు 4:3). “దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోగలను?” అని విద్యార్థులు నన్ను అడిగేవారు. నేను ఇలా చెప్పేవాడిని “మీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలుసు: పరిశుద్ధత. అదే మీ పట్ల దేవుని చిత్తం.” మీ పట్ల దేవుని చిత్తం పరిశుద్ధతైతే, ఆ పరిశుద్ధత వల్ల కలిగే కోరికలు మీ మార్గదర్శకత్వానికి ముఖ్యమైనవని చెప్పడం సురక్షితం.
సారాంశం
కాబట్టి అవి ఇలా ఉంటాయి:
- ఏ విధమైన సేవ మంచిది మరియు ఇతరులకు ఏది మేలు చేస్తుంది?
- ప్రపంచానికి ఉన్న అసలైన అవసరాలు ఏమిటి?
- దేవుడు నన్ను ఎక్కువ లేదా తక్కువ ఫలవంతంగా ఉండేలా ఏ వరాలతో ఆశీర్వదించాడు?
- దైవభక్తి గల వ్యక్తుల నుండి నేను ఎటువంటి సలహా పొందుతున్నాను?
- నేను జ్ఞానం కోసం నిరంతరం ప్రార్థిస్తున్నానా?
- నా హృదయంలో తరచుగా కలిగే, బలమైన, పరిశుద్ధ కోరికలు ఏమిటి?



