విశ్వాసులు ఏ విధంగా తీర్పు తీర్చబడతారు?

విశ్వాసులు ఏ విధంగా తీర్పు తీర్చబడతారు?

షేర్ చెయ్యండి:

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.”
(ప్రకటన 20:12)

అంతిమ దినాన గల తీర్పు గురించేమిటి? మన పాపాలు మనకు జ్ఞాపకం చేయబడతాయా? మన పాపాలు బయలుపరచబడతాయా? ఈ విషయాన్ని ఆంథోని హోకీమా గారు చాలా చక్కగా ఇలా చెప్పారు, “విశ్వాసుల వైఫల్యాలు మరియు లోపాలు తీర్పు దినమున బయలుపరచబడతాయి. అయితే, విశ్వాసుల పాపాలు, వారి వైఫల్యాలు క్షమించబడిన పాపాలుగా తీర్పు దినమున ఆ రోజు బయలుపరచబడతాయి, వారి అపరాధాలు పూర్తిగా యేసు క్రీస్తు రక్తము చేత కప్పబడి ఉంటాయన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం.”

ఈ విధంగా ఊహించుకోండి. ప్రతి వ్యక్తికి సంబందించిన ఒక ఫైల్ ను దేవుడు కలిగియుంటాడు (ప్రకటన 20:12లో “గ్రంథములు” అనే మాటను గమనించగలం). మీరు చేసిన ప్రతి పని లేక చెప్పిన ప్రతి మాట అక్కడ గ్రేడ్ లేదా కొలమానంతో రికార్డ్ చేయబడుతుంది (మత్తయి 12:36). ఆ గ్రేడింగ్ “ఎ” గ్రేడ్ నుండి “ఎఫ్” గ్రేడ్ వరకు ఉంటుంది. “మంచివైనా చెడ్డవైనా మీరు మీ శరీరమందు జరిగించిన ప్రతి క్రియకై ” తీర్పు తీర్చబడటానికి “క్రీస్తు న్యాయ సింహాసనం” ఎదుట మీరు నిలువబడినప్పుడు, దేవుడు మీకు సంబంధించిన ఫైల్ తెరిచి, పరీక్షలన్నిటికి గ్రేడ్ ఇస్తాడు (2 కొరింథీ 5:10).

“ఎఫ్” గ్రేడ్ వచ్చిన ప్రతి పనులన్నిటినీ ఆయన ఒక కుప్పగా వేస్తాడు. ఆ తర్వాత, “డి” మరియు “సి” గ్రేడ్ లలో ఉన్న మంచి వాటిని తీసుకొని “ఎ” గ్రేడ్ స్థానంలో పెడతాడు, చెడ్డవాటిని “ఎఫ్” గ్రేడ్ లోనికి చేర్చుతాడు. ఆ తర్వాత ఆయన “బి” మరియు “ఎ” గ్రేడ్లలో ఉన్న చెడ్డవాటిని తీసుకొని “ఎఫ్” కుప్పలో వేస్తాడు. మంచి వాటినన్నిటిని తీసుకొని “ఎ” గుంపులోనికి వేస్తాడు.  

ఆ తర్వాత, ఆయన మరియొక ఫైల్ ను తెరిచి అనగా “జీవ గ్రంథమును” తెరిచి, మీ పేరును కనుగొంటాడు. ఎందుకంటే మీరు విశ్వాసం ద్వారా క్రీస్తులో ఉన్నారు కాబట్టి. మీ పేరు వెనుక యేసు సిలువ వేయబడిన చెక్కలో నుండి చేయబడిన అగ్గి పుల్ల ఉంటుంది. ఆయన ఆ అగ్గిపుల్లను తీసుకొని, అగ్గిపుల్లను వెలిగించి, “ఎఫ్” ఫైలులో ఉంచిన మీ వైఫల్యాలన్నిటినీ, లోపాలన్నిటినీ తగలబెట్టేస్తాడు. అవి మిమ్మల్ని శిక్షించవు, వాటి నుండి మీకు ఎటువంటి బహుమానాలు కూడా లభించవు.

ఆ తర్వాత, “జీవ గ్రంథం” అనే మీ ఫైల్ నుండి “జీవం అనే ఉచితమైన మరియు కృపగల బోనస్!” అని గురుతు ఉన్నటువంటి సీల్ చేయబడిన ఒక కవరును బయటకు తీస్తాడు, దానిని “ఎ” గ్రేడ్ కుప్పలోనికి వేస్తాడు (మార్కు 4:24; లూకా 6:38) వచనాలను చూడండి).

ఆ తర్వాత, ఆయన కుప్పనంతటిని ఎత్తి పట్టుకొని, “వీటి వలన మీ జీవితం నా రక్తం యొక్క విలువకు, నా తండ్రి కృపకు మరియు నా ఆత్మ యొక్క ఫలానికి నిదర్శనంగా ఉన్నది. ఇవన్నీ మీ జీవితాలు నిత్యమైనవని సాక్ష్యమిస్తున్నాయి. వీటినిబట్టి మీరు మీ బహుమానాలను కలిగి ఉంటారు. మీ యజమాని యొక్క నిత్య ఆనందంలోనికి ప్రవేశించండి” అని ప్రకటిస్తాడు.“

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...