క్రొత్త సంవత్సరం కోసం కృప
“అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే”. (1 కొరింథీ 15:10)
మనం పొందుకోవడానికి మనకు అర్హత లేనప్పుడు కృప అనేది మనకు మేలు చేయాలనే దేవుని స్వభావం మాత్రమే కాదు గాని వాస్తవానికి అది మనలోనూ, మన కోసం మంచి కార్యాలను జరిగించడానికి పని చేసే దేవుని నుండి కలిగిన శక్తి.
పౌలు గారు పరిచర్యలో మరింత ఎక్కువగా కృషి చేయడానికి పౌలు గారిలో దేవుని కార్యం జరిగించింది దేవుని కృపయే: “వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.” పౌలు, “మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి” అని చెప్పినప్పుడు, “మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ 2:12-13) అని జోడించి వ్రాస్తున్నాడు. కృప అనేది దేవుడు మనలో మన కోసం జరిగించు మంచి కార్యములైయున్నవి.
ఈ కృప గతం మరియు భవిష్యత్తయి ఉన్నది. ఇది భవిష్యత్తు నుండి మన వద్దకు వచ్చే అక్షయమైన కృపా నది నుండి ప్రస్తుత (వర్తమాన) అనంతమైన జలపాతం మీదుగా గతంలో నిరంతరం పెరుగుతున్న కృప యొక్క జలాశయంలోకి నిరంతరం ప్రవహిస్తోంది.
తర్వాత వచ్చే ఐదు నిమిషాలలో భవిష్యత్తు నుండి మీ వద్దకు ప్రవహించే కాపాడే కృపను మీరు పొందుకుంటారు మరియు మీరు గతం యొక్క రిజర్వాయరులో మరొక ఐదు నిమిషాల విలువైన కృపను కూడగట్టుకుంటారు. గతంలో మీరు అనుభవించిన కృపకు సరియైన స్పందన ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం, భవిష్యత్తులో మీకు వాగ్దానం చేయబడిన కృపకు సరియైన స్పందన ఏంటంటే విశ్వాసం. గత సంవత్సరంలో అనుభవించిన కృపకు మనం కృతజ్ఞత కలిగినవారమై ఉన్నాం, క్రొత్త సంవత్సరం కోసం భవిష్యత్తు కృపలో మనం నిశ్చయత కలిగియున్నాం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web