హతసాక్షుల కోసం దేవుని ప్రణాళిక

హతసాక్షుల కోసం దేవుని ప్రణాళిక

షేర్ చెయ్యండి:

“తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికియ్యబడెను; మరియు – వారివలెనే చంపబడబోవువారి సహ దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను”. (ప్రకటన 6:11)

దాదాపు మూడు వందల సంవత్సరాలపాటు హతసాక్షుల రక్తంతో తడిసిన మట్టిలో క్రైస్తవ్యం వృద్ధి చెందింది.

ట్రాజన్ చక్రవర్తి (క్రీ.శ. 98) వరకు, హింస అనుమతించబడింది కాని చట్టబద్ధం కాదు. ట్రాజన్ నుండి డెసియస్ వరకు (సుమారు క్రీ.శ. 250) హింస చట్టబద్ధమైనది. క్రైస్తవులను ద్వేషించి, తన సంస్కరణలపై వాటి ప్రభావం ఉంటుందని భయపడిన డెసియస్ నుండి, క్రీ.శ. 311 లో సహనానికి సంబంధించిన మొదటి శాసనం వరకు, హింస చట్టబద్ధమైనది మాత్రమే కాదు గాని అది విస్తృతమైనదిగా మరియు సాధారణమైనదిగా ఉండెను.

ఈ మూడవ కాలంలో ఉండేటువంటి పరిస్థితిని ఒక రచయిత ఇలా వర్ణించాడు:

జనసమూహాల ద్వారా భయము అన్ని చోట్ల వ్యాపి౦చి౦ది; మరియు లాప్సీల సంఖ్య [బెదిరించబడినప్పుడు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు] . . . అపారంగా పెరిగింది. అయితే, దృఢంగా ఉండి, లొంగిపోకుండా హతసాక్షులైనవారి సంఖ్యకు కొదువే లేదు. హి౦స విస్తృత౦గా, తీవ్ర౦గా ఉ౦డేకొద్దీ, క్రైస్తవుల ఉత్సాహ౦, వారు ఎదుర్కొనే శక్తి మరింత ఎక్కువుగా బలపడింది.

అందుచేత, మూడువందల ఏళ్ళపాటు క్రైస్తవుడిగా ఉండటమనేది మీ ప్రాణాలకు, ఆస్తులకు, కుటు౦బానికి ఎ౦తో అపాయకరంగ ఉండేది. మీరు ఎక్కువగా ప్రేమించేదానికి ఇది ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఆఖరికి హతసాక్షులవడం జరిగింది.

హతసాక్షులైనవారితో కలిపి, ఇంకా హతసాక్షులయ్యేవారి గురించి ఒక నిర్దిష్టమైన సంఖ్య ఉందని సార్వభౌమాధికారముగల దేవుడు చెప్పాడు. సంఘాన్ని స్థాపించి, బలపరచడంలో వీరిది ప్రత్యేక పాత్ర ఉంది. జీవిత౦ బాగుపడుతు౦ది కాబట్టే దేవుని ప్రజలు తనను సేవి౦చాలని తరచూ చెప్పే సాతాను నోటిని మూపించడంలో వారిది ప్రత్యేకమైన పాత్ర ఉ౦ది. ఇదే యోబు 1:9-11 వచనాలలోని సారాంశం. 

హతసాక్షులవ్వడమనేది ఆకస్మికంగా జరిగేది కాదు. ఇందులో దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదేమి లేదు. ఇది ఊహించనిదైతే కాదు. ఇది క్రీస్తు కోసం వ్యూహాత్మకంగా దృఢంగా అనుకొని ఓడిపోయేది కాదు. 

ఇది ఓడిపోయినట్లుగా కనిపిస్తుంది గాని ఇది ఏ మనుష్యుడు ముందుగానే ఆలోచించని, ఊహించని విధంగా పరలోకంలో వేసిన ప్రణాళికలో భాగమై ఉంటుంది. దేవుని చాలిన కృపలో విశ్వాసముంచుట ద్వారా అంతము వరకు సహించిన వారందరి కోసం ఈ ప్రణాళిక విజయంతమవుతూ ఉంటుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...