“అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను”. (అపొ కార్యములు 16:14)
పౌలు బోధించిన ప్రతిచోటా కొందరు నమ్మారు మరియు కొందరు నమ్మలేదు. అపరాధము చేత పాపము చేత చచ్చిన వారిలో కొందరు (ఎఫెసీయులు 2:1, 5) ఎందుకు విశ్వసించారు? మరి కొందరు ఎందుకు నమ్మలేదు? దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
కొందరు ఎందుకు విశ్వసించలేదో దానికి సమాధానం ఏమిటంటే, వారు “దానిని త్రోసివేసి[రి]” (అపొ కార్యములు 13:46) ఎందుకంటే సువార్త సందేశం “[వారికి] వెఱ్ఱితనముగా మరియు [వారు] గ్రహింపజాలనిదిగా ఉంది” (1 కొరింథీయులు 2:14). “శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు” (రోమా 8:7).
సువార్తను విని తిరస్కరించే ప్రతి ఒక్కరూ “వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు” (యోహాను 3:20). వారు “అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత” (ఎఫెసీ 4:18) అని రాయబడింది. ఇది అపరాధ అజ్ఞానం. సత్యం అందుబాటులో ఉంది. కానీ “దుర్నీతిచేత [వారు] సత్యమును అడ్డగించు[తున్నారు]” (రోమా 1:18).
అయితే అందరూ తిరుగుబాటు చేసే హృదయ కాఠిన్య స్థితిలో ఉన్నారు, వారి అపరాధాలలో మరణించారు కానీ కొందరు ఎందుకు నమ్ముతున్నారు? అపొస్తలుల కార్యముల పుస్తకం కనీసం మూడు రకాలుగా సమాధానం ఇస్తుంది. ఒకటి, వారు నమ్మడానికి నియమించబడ్డారు. పౌలు పిసిదియలోనున్న అంతియొకయలో బోధించినప్పుడు, అన్యజనులు సంతోషించారు మరియు “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.” (అపొస్తలుల కార్యములు 13:48).
కొందరే ఎందుకు నమ్ముతారు అనే ప్రశ్నకు మరొక సమాధానం, దేవుడు పశ్చాత్తాపాన్ని ప్రసాదించాడు కాబట్టి. యెరూషలేములోని పరిశుద్ధులు, యూదులే కాదు అన్యజనులు కూడా సువార్తకు ప్రతిస్పందిస్తున్నారని విన్నప్పుడు, వారు ఇలా అన్నారు, “అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడు.” (అపొస్తలుల కార్యములు 11:18).
అయితే ఒక వ్యక్తి సువార్తను ఎందుకు నమ్ముతాడు అనే ప్రశ్నకు అపొస్తలుల కార్యాలలో స్పష్టమైన సమాధానం ఏమిటంటే దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. లూదియ దీనికి మంచి ఉదాహరణ. ఆమె ఎందుకు నమ్మింది? అపొస్తలుల కార్యములు 16:14 ఇలా సెలవిస్తుంది, “ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.”
మీరు యేసును నమ్మినవారైతే, ఇవన్నీ మీకు సంభవించాయి: మీరు నమ్మడానికి నియమించబడ్డారు; మీకు మారుమనస్సు దయచేసి యున్నాడు; మరియు ప్రభువు మీ హృదయాన్ని తెరిచాడు. మీరు విశ్వాసి అవ్వడం ఒక అద్భుతమని మీ జీవితాంతం దేవుని పట్ల మీరు కృతజ్ఞతతో ఉప్పొంగిపోవాలి.
Good