జ్ఞానం పొందుకోడానికి 5 మార్గాలు

జ్ఞానం పొందుకోడానికి 5 మార్గాలు

షేర్ చెయ్యండి:

మన జీవితాలకు జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. మనం జీవిస్తున్న ప్రపంచం మరింత క్లిష్టంగా మరియు సవాలుగా మారుతోంది. కాబట్టి, మనం జ్ఞానంతో జీవించడం నిజంగా చాలా ముఖ్యం.

జ్ఞానము కొరకైన మన అన్వేషణ గురించి, పాస్టర్ జాన్ చేసిన ప్రసంగాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పాస్టర్ జాన్ ఇలా అన్నాడు, “ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలనే ఒక సాధారణ కోరికను కలిగియుంటాడు. ఇది మన మానవ స్వభావం యొక్క సాధారణ పార్శ్వము. అది చెడ్డ విషయమేమీ కాదు; అది మంచి విషయమే. ఆ విధంగానే దేవుడు మనలను చేశాడు. సంతోషముగా ఉండటం చెడుతనమేమీ కాదు; తప్పుడు ప్రదేశాలలో సంతోషాన్ని వెదకడం కనుగొనడమే ఛెడ్డసంగతి. మంచితనం అంటే దేవుణ్ణి సంతోషపెట్టే ప్రదేశాలలో ఆ ఆనందాన్ని వెతకడం మరియు కనుగొనడం. జ్ఞానాన్ని అన్వేషించుటలో శక్తివంతమైన అంశాన్ని పాస్టర్ జాన్ మనకు అందిస్తాడు. ఈ విషయంపై పాస్టర్ జాన్ తన ఆలోచనలను పంచుకున్న అదే సందేశం నుండి ఒక భాగం ఇక్కడ విందాం.

జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలనే విషయంపై  ఐదు సాధారణ సూచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవి వ్యక్తిగతంగా నాకు విలువైనవిగా ఉన్నాయి మరియు ఇవి లేఖనములో నాటబడినవై ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వాటిని పునఃసమీక్షించుట మరియు ఆలోచించుట మనకు చాలా ప్రయోజనకరము.

జ్ఞానము కొరకైన ఆకలి

మొదటి మెట్టు, జ్ఞానము కొరకు బలమైన కోరికను, ఆకలిని కలిగియుండడం మరియు దాని కొరకు ఆత్రుత కలిగియుండడం. సామెతలు 4:8 “దానిని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును” అని వాక్యం బోధిస్తుంది. అవి చవకైన మాటలు కావు. మీరు దేనినైనా ఎంతో విలువైనదిగా ఎంచుకున్నప్పుడు మరియు అది మీకు ప్రియమైనప్పుడు, మీరు దానిని చాలా ఎక్కువగా  ప్రేమిస్తారు. కావున, జ్ఞానము మనకు విలువైనదిగా ఉండాలి. మనము దానిని కోరుకోవాలి మరియు దాని కొరకు ఆకలి కలిగి ఉండాలి; లేనియెడల, మనము దానిని పొందలేము.

రోజుకు పదిహేను నిమిషాలు

రెండవదిగా, దేవుని వాక్యములో జ్ఞానము లభిస్తున్నందున, మనము దేవుని వాక్యమును ధ్యానించుటకు మరియు అధ్యయనం చేయుటకు కృషి చేయాలి. బైబిలును నేరుగా అధ్యయనం చేయడంతో పాటు, 2000 సంవత్సరాల గత చరిత్ర అంతటా గౌరవనీయమైన వేదాంతవేత్తల రచనలను చదవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మనుష్యులు చెమటోడ్చి, దేవుని జ్ఞానముతో లేఖనము యొక్క లోతైన అర్థాలను వివరించారు. ఈ గొప్ప దైవికపరమైన పుస్తకాలను చదవడం ద్వారా, మనము దేవుని ప్రత్యక్షతను గురించి మరియు లోతైన విషయాలను గురించి విస్తృతమైన అవగాహనను పొందగలము. ఈ అద్భుతమైన పుస్తకాల రూపంలో చక్కని వనరులు మనకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడు, వాటిని వాడుకోకుండా మొదటి నుండి ప్రారంభించడం తెలివితక్కువపని.

ఇక్కడ మీకు కొంత ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఈ పుస్తకాలు చదవాలి అని చెప్పినప్పుడు మీకు కలిగే సందేహాలు నాకు తెలుసు :  “వేదాంతశాస్త్రం యొక్క గొప్ప పుస్తకాలను చదవడానికి  మరియు వాటిని పొందుకోడానికి నాకు సమయం లేదా సామర్థ్యం లేదు” అని మీరు ఆలోచిస్తుండచ్చు. అది నిజమని నేను నమ్మను. గొప్ప పుస్తకాలు గొప్పవిగా ఎందుకు పరిగణించబడతాయంటే, అవి కష్టంగా ఉన్నందున కాదు, అవి చదవదగినవి కాబట్టి. అస్పష్టమైన పుస్తకాలు గొప్ప పుస్తకాలు కావు.

“రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించడం ద్వారా వచ్చే ఏడాది ఈ సమయానికి మీరు ఇరవై పుస్తకాలను చదవగలరు.

నిజంగా ప్రోత్సాహకరమైన విషయాన్ని మీతో పంచుకోనివ్వండి. నాలుగు సంవత్సరాల క్రితం నా పాస్టర్ ఇచ్చిన సలహా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మీరు నిమిషానికి 250 పదాలు చదువుతున్నారని ఊహించుకోండి. అది చాలా వేగంగా చదవడం కాదు. మనలో చాలా మంది 250 పదాలు ఒకే నిమిషంలో చదవచ్చు. మీరు ప్రతిరోజూ కేవలం పదిహేను నిమిషాలు మీ జ్ఞానములో, వాక్యం పట్ల అవగాహనలో ఎదగడానికి అవసరమయ్యే ఒక విలువైన పుస్తకాన్ని చదవడానికి కేటాయిస్తే, మీలో అద్భుతాలు జరుగుతాయి. 365 రోజులు, రోజుకు పదిహేను నిమిషాలు అంటే సంవత్సరంలో మొత్తం 5,475 నిమిషాలు. ఇప్పుడు, మనం దానిని 250 తో గుణించినట్లయితే, రోజుకు కేవలం పదిహేను నిమిషాలతో ఒక సంవత్సరంలో మీరు చదవగలిగే పదాలు 1,368,750. ఇప్పుడు, ఒక సగటు పుస్తకంలో ఒక పేజీలో సుమారు 300 నుండి 400 పదాలు ఉంటాయి. మనం 350 తీసుకొని, దానిని 1,368,750తో విభజించినప్పుడు, మనకు సంవత్సరానికి సుమారు 3,910 పేజీలు లభిస్తాయి. సగటు పుస్తకంలో సుమారు 200 పేజీలు ఉన్నాయని పరిగణనలోకి తీసుకుంటే, మీరు సంవత్సరంలో దాదాపు 4,000 పేజీలను చదవగలరని దీని అర్థం.

క్లాసిక్ పుస్తకాన్ని ఎంచుకోండి

ఇది మీకు అర్థమైందా? ప్రతిరోజూ కేవలం పదిహేను నిమిషాలు కేటాయించడం ద్వారా, మీరు ఒక సంవత్సరంలో, ఇరవై పుస్తకాలను చదవడం పూర్తి చేయవచ్చు. నేను దీనిని మొదట విన్నప్పుడు, త్వరగా నా ఇంటికి వెళ్లి, నా క్యాలెండర్ ‌ను తీసుకొని, ఆ విలువైన పదిహేను నిమిషాల సమయం ఎక్కడ కేటాయించాలని పరిశోధించాను. చివరగా, నేను సాధారణంగా వృధా చేసే సమయమైన, సాయంత్రం 5:15 నిమిషాలకు, అంటే రాత్రి భోజనానికి ముందు దానిని నేను కనుగొన్నాను. ఇక నేను ఈ పని చేయడానికి సిద్ధపడ్డాను. నేను ఒక నిర్ణయం తీసుకొని, జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు రాసిన “ఒరిజినల్ సిన్” అనే పుస్తకం చదవడం ప్రారంభించాను. ఇది పెద్ద పుస్తకం అయినప్పటికీ, రోజుకు పదిహేను నిమిషాలు చదవడం ద్వారా రెండు నెలల్లో మొత్తం పూర్తి చేశాను. ఆ తర్వాత ఎంతో ప్రోత్సహించబడి, నేను C.S. లూయిస్, జార్జ్ మెక్ ‌ డొనాల్డ్ మరియు నేను చదవాలనుకున్న అనేక ఇతర రచయితల రచనలను లోతుగా చదివాను. ఇన్ని రోజులు సమయం లేదని, చదవడం అసాధ్యమని అనిపించే పుస్తకాలన్నీ, ఇప్పుడు చదవగలిగాను. ఎందుకంటే గతంలో నేను నిర్లక్ష్యం చేసిన పదిహేను నిమిషాల స్లాట్ ‌ను నేను ఇప్పుడు వాడుకున్నాను కాబట్టి.

నిరీక్షణ లేదని భావించే మీకు ఒక నిరీక్షణ, ఆశ ఉందని గుర్తుచేస్తున్నాను. అద్భుతమైన మార్పును మీలో మీరు చూడడానికి పడుకోడానికి ముందు పదిహేను నిమిషాలను అంకితం చేయండి. జాన్ కాల్విన్ యొక్క “ఇన్స్టిట్యూట్స్”, మార్టిన్ లూథర్ యొక్క “బాండేజ్ ఆఫ్ ది విల్” లేదా” గలతీయులపై రాసిన వ్యాఖ్యానం”, జాన్ బన్యన్ యొక్క “యాత్రికుల పురోగతి”, జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి “మతపరమైన ప్రభావాలు” లేదా మీరు చదవాలని కోరుకునే ఇతర అద్భుతమైన పుస్తకాలేవైనా సరే. అది కష్టం, అసాధ్యమని భావించి పక్కనపెట్టేయకుండా, ప్రతిరోజూ కేవలం పదిహేను నిమిషాలు చదవడానికి కట్టుబడి ఉండండి.

ఒక పెద్ద చెట్టును సైతం చాలా చిన్న ముక్కలుగా కత్తిరించి పడగొట్టొచ్చు. జ్ఞానాన్ని పొందడానికి, ఇది గొప్ప ప్రోత్సాహకరమైన మాట అని నేననుకుంటున్నాను.

శరీర దారియైన జ్ఞానం

మూడవదిగా, ప్రార్థించుట చాలా ప్రాముఖ్యము, ఎందుకంటే  జ్ఞానము ప్రభువు నుండే మనకు లభిస్తుంది.

నాల్గవదిగా, మన మరణాన్ని గురించి తరచుగా ఆలోచించాలి. కీర్తన 90:12లో, మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని కీర్తనాకారుడు చెబుతాడు. మన మరణాన్ని గురించి ధ్యానించుట మనల్ని వెర్రితనము నుండి తప్పించడానికి సహాయపడుతుంది.

“యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి, విశ్వసించి, వెంబడించే వ్యక్తి శాశ్వతమైన మరియు నిజమైన ఆనందము యొక్క ధననిధిని కలిగియుంటాడు.

చివరగా, తప్పకుండా యేసు వద్దకు మనం రావాలి. కొలొస్సయులు 2:3 లో చెప్పినట్లుగా, “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. సొలొమోను జ్ఞానమును గురించి మాట్లాడాడు; కానీ యేసే  దేవుని జ్ఞానము. ఇతరులు సత్యాలను మాట్లాడారు; కానీ, యేసే సత్యము. ఇతరులు వాగ్దానాలు చేశారు; యేసులో దేవుని వాగ్దానాలన్నీ అమెన్ అవును అని మనకు తెలుసు. ఇతరులు క్షమాపణను అందించారు; యేసు క్షమాపణను కొన్నాడు. కాబట్టి, ఆయనయందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ దాచబడియున్నవి.

యేసును ప్రేమించే మరియు విశ్వసించే మరియు అనుసరించే వ్యక్తి, శాశ్వతమైన మరియు నిజమైన ఆనందం యొక్క నిధిని కలిగి ఉంటాడు. కావున, జ్ఞానము పొందుకోవాలనే ఆజ్ఞ మనకు ఇవ్వబడ్డప్పుడు, జ్ఞానము పొందుకొనుట అంటే, మొదటగా, యేసు దగ్గరికి రావడం అని అర్థము. జ్ఞానము, బుద్ధి వివేకముల సంపదలన్నీ  దాగియున్న యేసువద్దకు మీరు రండి.

జ్ఞానవంతుడైన దేవుడు తన దైవిక జ్ఞానంతో మిమ్మల్ని నింపును గాక, తద్వారా ఆయనలో లభించే నిజమైన మరియు శాశ్వతమైన ఆనందాన్ని మీరు ఇప్పుడు మరియు ఎప్పటికీ ఆస్వాదించగలరు. ఆమేన్.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...