శ్రమలకు గల ఐదు ఉద్దేశాలు

శ్రమలకు గల ఐదు ఉద్దేశాలు

షేర్ చెయ్యండి:

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము”. (రోమా 8:28)

మనం అనుభవిస్తున్న శ్రమలకు అతి సూక్ష్మ కారణాలను మనం అరుదుగా తెలుసుకుంటాం, అయితే విశ్వాసాన్ని కాపాడే అతి పెద్ద కారణాలను బైబిల్ మనకు అందిస్తోంది. 

మనం శ్రమల పాలైనప్పుడు, లేక ఇతరుల శ్రమలలో వారికి సహాయం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కాపాడే కారణాలను జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా, నిరీక్షణను కోల్పోకుండా మనకు సహాయం చేయడానికి దేవుడు మనకిచ్చిన కొన్ని సత్యాలను మనమిప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. 

వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి 5 విషయాలు ఈ క్రింద చెప్పబడ్డాయి (ఒకవేళ ఇవి ఉపయోగకరంగా ఉన్నట్లయితే వాటిలో మూడు విషయాలను గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి). 

మన శ్రమలకు దేవుని యొక్క అతి పెద్ద కారణాలలో ఈ క్రింద చెప్పబడినవి కూడా ఉన్నాయి: 

పశ్చాత్తాపం: దేవునికన్నా ఎక్కువగా ఈ భూమి మీద దేనిని కూర్చుకోకుండ ఉండటానికి మనకు మరియు ఇతరులకు శ్రమ ఒక పిలుపుగా యున్నది. 

“మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.”- లూకా 13:4-5

నమ్మకం: దేవుణ్ణి నమ్మడానికి మరియు ఈ లోకంలోని జీవనాధారాలను నమ్మకుండ ఉండటానికి శ్రమ ఒక పిలుపుయైయున్నది. 

“సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేకయుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.” – 2 కొరింథీ 1:8-9

నీతి: శ్రమ అనేది ప్రేమగల మన పరలోకపు తండ్రి యొక్క క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ద్వారా ఆయన నీతిని మరియు పరిశుద్ధతను పంచుకుంటాం. 

…“ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను, స్వీకరించు ప్రతి కుమారుని దండించును” అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి….. వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12:6, 10-11

బహుమానం: మనం ఈ భూమి మీద పోగుట్టుకున్న ప్రతి నష్టానికి వంద రెట్లు ఎక్కువగా పొందుకోవడానికి పరలోకంలో ఒక గొప్ప బహుమానాన్ని సృష్టించేందుకు శ్రమ పని చేస్తుంది.

“క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.” 2 కొరింథీ 4:17

చివరిగా, జ్ఞాపకం చేయుట: శ్రమ పడుటకే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు గనుక మనం పొందే శ్రమ దేవుని శిక్ష కాదు గాని ఆయన మనల్ని శుద్ధి చేయుటకేనని శ్రమ మనకు జ్ఞాపకం చేస్తుంది. 

ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:10-11

అందుచేత, మనకు సంభవించిన శ్రమలకు అతి సూక్ష్మమైన కారణాలు మనకు తెలియనందున, నాకే ఎందుకు జరగాలి, ఈ విధంగా ఎందుకు జరగాలి, ఇంత కాలం ఎందుకు? అనే ప్రశ్నలతో క్రైస్తవ హృదయం ఆక్రందన చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, శ్రమలకు గల అతి సూక్ష్మ కారణాలు, వాక్యంలో చెప్పబడ్డ దేవుని అతిపెద్ద ఉద్దేశాలను చూడకుండా పట్టించుకోకుండా చేసేందుకు కారణం కాకుండా చూసుకోండి. 

“సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమునుగలవాడని మీరు తెలిసికొనియున్నారు.”  (యాకోబు 5:11).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...