“నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను”. (కీర్తన 56:3)
మన చింతకు మూలం అపనమ్మకంలో ఉందనే సత్యానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, “నేను దాదాపు ప్రతిరోజూ చింతకు సంబంధించిన భావాలతో పోరాడుతుంటాను; కాబట్టి దేవుని కృప మీద నాకున్న విశ్వాసం సరిపోదని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను రక్షింపబడతాననే భరోసా ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను” అనే విధంగా ఉంటుంది.
ఈ విషయానికి సంబంధించి నా ప్రతిస్పందన ఏంటంటే మీరు కారు పందెంలో (రేసులో) ఉన్నారనుకోండి, మీరు పందెంలో గెలుపొందడానికి ఇష్టంలేని మీ శత్రువు మీ కారు విండ్ షీల్డ్ పై (అద్దంపై) బురదను విసిరాడని అనుకుందాం. మీరు మీ లక్ష్యాన్ని తాత్కాలికంగా పోగుట్టుకొని, పక్కదారి పట్టడం ప్రారంభించినంత మాత్రాన మీరు కారు పందెం నుండి వైదొలగిపోతున్నారని (ప్రక్కకు పోతున్నారని) అర్థం కాదు.
మీరు పందెంలో వేరొక తప్పుడు మార్గంలో (రేస్ ట్రాక్ లో) ఉన్నారని కూడా కాదు. అలాగైతే, మీతోపాటు పోటి చేసే మీ శత్రువు మిమ్మల్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టడు. దానికి అర్థం ఏంటంటే మీరు ఆ సమయంలో తప్పనిసరిగా మీ విండ్ షీల్డ్ (కారు అద్దాలను) తుడిచే వైపర్లకు పని పెట్టాలి (వైపర్లను ఆన్ చేయాలి).
మనం చింతించినప్పుడు దేవుని మహిమ గురించి, ఆయన మన కోసం కలిగియున్న గొప్ప భవిష్యత్తు గురించి మనకున్న దర్శనం మసకబారుతుంది, అలాగని మనకు విశ్వాసం లేదని కాదు, లేక మనం పరలోకం చేరుకోలేమని కాదు గాని మన విశ్వాసం దాడికి గురైందని అర్థం.
మొదటి దెబ్బకు, దేవుని వాగ్దానాలపై మనకున్న నమ్మక౦ సన్నగిల్లవచ్చు, తారుమారు కావచ్చు. అయితే, మనం పందెంలో పరుగు తీసే సరియైన మార్గంలో (రేస్ ట్రాక్ లో) ఉంటామా మరియు ముగింపు రేఖను చేరుకుంటామా లేదా అనేది, మనం తిరుగుబాటు విధానంలో ఉన్నామా లేదా అనేదానిపైన ఆధారపడి ఉంది, అంటే మనం చింతకు సంబంధించిన అవిశ్వాసానికి విరుద్ధంగా పోరాడతామా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం విండ్ షీల్డ్ వైపర్లను ఆన్ చేస్తామా? (మనం విండ్ షీల్డ్ వైపర్లకు పని పెడతామా?)
“నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను” అని కీర్తన 56:3 చెప్తోంది.
గమనిక: “నేను భయముతో పోరాడను” అని ఈ వాక్యం చెప్పట్లేదు. భయం దాడి చేస్తుంది, పోరాటం ఆరంభమవుతుంది. అందుచేత, నిజమైన విశ్వాసులకు చింతలనేవి ఉండవని బైబిల్ చెప్పట్లేదు. దానికి బదులుగా, చింతలనేవి మన మీద దాడి చేసినప్పుడు మనం వాటితో ఎలా పోరాడాలో బైబిల్ మనకు బోధిస్తోంది. మన కారు అద్దాల వైపర్లకు ఎలా పని పెట్టాలో (వైపర్లను ఎలా ఆన్ చేయాలో) బైబిల్ మనకు చెప్తోంది.



