ఆయన సంపూర్ణతను ఆనందించు

ఆయన సంపూర్ణతను ఆనందించు

షేర్ చెయ్యండి:

“ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి”. (యోహాను 1:16)

గత ఆదివారపు ఆరాధన ప్రారంభమవడానికి ముందు, మా సంఘసభ్యుల విశ్వాసం కొరకు, మరియు మా జంటనగరాల్లో ఉన్న సంఘాల కొరకు మరియు మా దేశం కొరకు ప్రార్థనలో పోరాడే ఒక చిన్న పరిశుద్ధుల గుంపు ఉంది. అందులో ఒకాయన యోహాను 1:14,16 లోని మాటలను ఉపయోగించి ప్రార్థన చేశాడు.

ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి… ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.

ఒకరకంగా చెప్పాలంటే ఒక గొప్ప ప్రత్యక్షత కలిగిన సమయంగా చెప్పొచ్చేమో! “క్రీస్తు సంపూర్ణత” అనే పదం ద్వారా అసాధారణమైన ప్రభావాన్ని ఆ క్షణంలో కొంత మేరకు నేను అనుభవించాను. అవును, నేను నిజంగా ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితిని అని నాకు నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. నేను ఆ సమయంలో ప్రతిరోజు కృప వెంబడి కృపను పొందుతున్నాను అని అర్ధం అయ్యింది. మధ్యాహ్నమంతా ఆయన పాదాల దగ్గర కూర్చోవడం లేదా నా బైబిల్ చదవడం కంటే మధురమైనది మరొకటి లేదని నేను భావించాను.

ఈ “సంపూర్ణత” నాపై ఎందుకు అంత ప్రభావాన్ని చూపింది — ఈ క్షణం వరకు అది అసాధారణంగా నన్ను ఎందుకు కదిలింపచేస్తోంది?  ఎందుకంటే. . .

  • …ఎవరి సంపూర్ణత నుండి నేను కృపతో తడిసిముద్దాయ్యానో  ఆయనే దేవునితో ఉన్న మరియు దేవుడైయున్న వాక్యము (యోహాను 1:1-2), కాబట్టి ఆయన సంపూర్ణత అంటే దేవుని సంపూర్ణత. – అదే దైవికమైన సంపూర్ణత, అనంతమైన సంపూర్ణత;
  • …ఈ వాక్యమే శరీరదారియై మనలో ఒకడుగా ఉండి, తన సంపూర్ణతతో మనలను వెంటాడుతున్నాడు; ఇది అందుబాటులో ఉండే సంపూర్ణత;
  • …ఈ వాక్యం మానవ రూపంలో కనిపించినప్పుడు, ఆయన మహిమ కనిపించింది; ఆయనది మహిమగల సంపూర్ణత;
  • …ఈ వాక్యం “తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుడు” (యోహాను 1:14). కాబట్టి దైవిక సంపూర్ణత కేవలం దేవుని నుండి వచ్చింది మాత్రమే కాదుగాని దేవుని ద్వారా వచ్చింది. దేవుడు తన సంపూర్ణతను అందించడానికి దేవదూతను పంపలేదు కానీ ఆయన తన ఏకైక కుమారుడిని పంపాడు.
  • …కుమారుని యొక్క సంపూర్ణత కృప యొక్క సంపూర్ణత. నేను ఈ సంపూర్ణతలో మునిగి నాశనమవ్వను కానీ ఈ సంపూర్ణత ద్వారా అన్ని విధాలుగా ఆశీర్వదించబడతాను;
  • …కృప యొక్క సంపూర్ణత మాత్రమే కాదు, సత్యం యొక్క సంపూర్ణతయే ఈ సంపూర్ణత. నేను సత్యాన్ని విస్మరించే పైపై కృపతో అలంకరించబడటం లేదు; ఈ కృప బండలాంటి వాస్తవంలో పాతుకుపోయింది.

నేను క్రీస్తు యొక్క సంపూర్ణతను చూసి విస్మయమొందడం, సంతోషంతో నిండిపోవడం, ఆశ్చర్యం కాదా!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...