తిరిగి వచ్చేట్లు చేయడం
“యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము”. (విలాప. 5:21)
దేవుని ప్రజలు తమ పాపంలోనూ, అవిశ్వాసంలోనూ జారుకునే స్థితి నుండి దేవుని తట్టు తిరగడానికి దేవుడే కారణమయ్యేంతవరకు వారికి నిరీక్షణ లేదు.
విలాపవాక్యములు అనే ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలోనే అత్యంత నిరాదరణకు గురైన పుస్తకం. దేవుడు తన కను గుడ్డుగా చెప్పుకున్న యెరూషలేమును ఆయనే నాశనం చేశాడు.
- ప్రభువు తన ఉగ్రతను పూర్తిగా నెరవేర్చాడు; ఆయన తన కోపాగ్నిని కుమ్మరించాడు; మరియు ఆయన సియోనులో అగ్నిని రాజబెట్టాడు, తద్వారా దాని పునాదులు కాల్చివేయబడ్డాయి. (విలాప. 4:11)
- మన కళ్ళకు అందమైనవారినందరిని ఆయన చంపేశాడు. (విలాప. 2:4)
- తన విస్తారమైన అతిక్రమములవలన ప్రభువు తనని బాధపెట్టాడు. (విలాప. 1:5)
అయితే, ఈ పుస్తకం ఎలా ముగుస్తుంది?
ఇది కేవలం ఒకే ఒక నిరీక్షణతో ముగుస్తుంది:
యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము! (విలాప. 5:21)
నాకు మరియు నీకు ఒకే ఒక నిరీక్షణ ఉంది !
“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము” (లూకా 22:31-32) అని యేసు పేతురుతో చెప్పెను.
ఇక్కడ నీవు వెనుదిరిగితే అని లేదు గాని నీవు వెనుదిరిగినప్పుడు అని ఉంది. నేను మీ కోసం ప్రార్థించాను! మీరు వెనుదిరుగుతారు. మీరు వెనుదిరిగినప్పుడు, మిమ్మల్ని భక్తిహీనత నుండి వెనక్కి తీసుకు వచ్చి నా వైపుకు మిమ్మల్ని తిప్పింది నా సార్వభౌమ కృపయే.
ఓ క్రైస్తవుడా, ఇది మీ విషయంలోనూ నిజమే. విశ్వాసమందు సహనముతో ఉండుటయే నీ ఏకైక నిరీక్షణ. అందులో ఆనందించండి.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే. (రోమా 8:34)
వెనక్కి తిరుగునట్లు ఆయనే చేశాడు. అందుచేత,“తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” (యూదా 1:24-25). ఆమేన్!
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web