ఎవరెస్ట్ పర్వతం కంటే శ్రేష్టమైనది
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమా 8:28)
మీరు ఈ గొప్ప వాగ్దానపు వెలుగులో జీవిస్తే, మీ జీవితం ఎవరెస్ట్ పర్వతం కంటే మరింత దృఢంగా మరియు స్థిరంగా ఉంటుంది.
మీరు రోమా 8:28 లోపల ఉన్నప్పుడు ఏమీ మిమ్మల్ని చెదరగొట్టదు. రోమా 8:28 కి బయట, అంతా గందరగోళం, ఆందోళన, భయం మరియు అనిశ్చితి. దేవుని సర్వము ఆవరించి యున్న భవిష్యత్తు కృపకు సంబంధించిన ఈ వాగ్దానానికి బయట మాదకద్రవ్యాలు, అశ్లీలత మరియు డజన్ల కొద్దీ వ్యర్థమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సన్నని గోడలు, రేకులతో వేసిన పైకప్పు లాంటి బలహీనమైన పెట్టుబడి వ్యూహాలు, అశాశ్వతమైన బీమా కవరేజులు మరియు అల్పమైన పదవీ విరమణ ప్లాన్లు ఉన్నాయి. డెడ్‌బోల్ట్ తాళాలు మరియు అలారం వ్యవస్థలు మరియు యాంటీ బాలిస్టిక్ క్షిపణుల కాగితపు కోటలు ఉన్నాయి. రోమా 8:28కి బయట వెయ్యి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
మీరు ప్రేమ యొక్క తలుపు గుండా రోమా 8:28 యొక్క మిక్కిలి బలమైన, స్థిరమైన నిర్మాణంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రతిదీ మారుతుంది. మీ జీవితంలో స్థిరత్వం మరియు లోతు మరియు స్వేచ్ఛ వస్తాయి. మీరు ఇకపై దేనికి కొట్టుకొనిపోలేరు. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మీ మేలు కోసం అన్ని శ్రమలను మరియు మీరు అనుభవించే అన్ని ఆనందాలను పరిపాలిస్తాడనే విశ్వాసం మీ జీవితంలో సాటిలేని ఆశ్రయం, భద్రత, ఆశ, మరియు శక్తిని ఇస్తుంది.
దేవుని ప్రజలు నిజంగా రోమా 8:28 యొక్క భవిష్యత్తు కృపతో జీవించినప్పుడు (వ్యాధులు మొదలుకొని మరణం వరకు) వారు ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛగా, బలమైన మరియు అత్యంత ఉదారమైన వ్యక్తులుగా ఉంటారు.
వారి వెలుగు ప్రకాశిస్తుంది మరియు ప్రజలు పరలోకంలో ఉన్న తమ తండ్రిని మహిమపరుస్తారు (మత్తయి 5:16).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web
One comment
అవును. Piper గారు సత్యంపై ఇచ్చిన వివరణ చాలా ఆదరణ కలిగించగలిగింది.