క్రీస్తు రాకడ కోసం ఆతృతగా ఎదురు చూసే నిజమైన విశ్వాసం.

షేర్ చెయ్యండి:

ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొనియుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్షమగును”. (హెబ్రీ 9:28)

క్రీస్తు రక్తం ద్వారా మీ పాపాలన్నీ తీసివేయబడ్డాయని, ఆయన తిరిగి వచ్చినప్పుడు దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా అయన మిమ్మల్ని భద్రపరిచాడని, నిత్యజీవంలోనికి నడిపిస్తాడని తెలుసుకున్న మీరు ఏమి చేయాలి? దీనికి జవాబు ఏంటంటే, క్రీస్తు రాకడ కోసం ఆతృతగా ఎదురు చూసే విధానంలో ఆయన్ని విశ్వసించాలి.

“ఆయన కోసం ఆతృతగా కనిపెట్టుకొని ఉన్నవారిని” రక్షించడం కోసం ఆయన రాబోతున్నాడని లేఖన భాగం తెలియజేస్తోంది. అలాంటప్పుడు, మీరు ఎలా సిద్ధపడతారు? క్రీస్తునందు దేవుని క్షమాపణను మీరు ఎలా అనుభవిస్తారు మరియు క్రీస్తును కలవడానికి ఎలా సిద్ధపడతారు? ఎలాగంటే,తిరిగి రాబోవు క్రీస్తు కోసం కనిపెట్టుకొని ఆతృతగా ఎదురు చూసే విధానంలో ఆయనను విశ్వసించడం ద్వారా మాత్రమే సిద్ధపడగలం.

క్రీస్తు కోసం ఈ విధంగా ఎదురు చూడడమనేది ఆయనను మనం ప్రేమిస్తున్నామనడానికి, ఆయనను విశ్వసిస్తున్నామనడానికి, నిజముగా ఆయనయందు నమ్మిక కలిగియున్నామనడానికి సూచనయైయున్నది.

క్రీస్తు కోసం ఎటువంటి ఆశ ఆసక్తి లేకుండా, నరకం నుండి మాత్రమే తప్పించుకోవాలన్న మోసపూరితమైన విశ్వాసముంది. అటువంటి విశ్వాసం రక్షించదు. తిరిగి రాబోయే క్రీస్తు కోసం ఆతృతతో ఎదురుచూసే స్థితిని పుట్టించదు. వాస్తవానికి, ఈ విశ్వాసం ఎలా ఉంటుందంటే క్రీస్తు రానంత కాలంపాటు, ఈ లోకాన్ని బాగా అనుభవించవచ్చు అనే విధంగా ఉంటుంది.

అయితే, రక్షకునిగా, ప్రభువుగా, మన ధననిధిగా, మన నిరీక్షణగా, మన ఆనందముగా క్రీస్తును నిజంగా నమ్మినటువంటి విశ్వాసమే, రాబోవు క్రీస్తు కోసం ఆతృత కలిగి కనిపెట్టుకొని ఉంటుంది. అదే రక్షించే విశ్వాసం. అందుచేత, మీరు లోకం నుండి, పాపం నుండి వెనక్కి తిరగమని బ్రతిమాలుతున్నాను. క్రీస్తు వైపుకు తిరగండి. ఆయనను పొందుకోండి, ఆయనను ఆహ్వానించండి, అగ్ని నుండి తప్పించుకునేందుకు మాత్రమే క్రీస్తును హత్తుకోకుండా, మీరు ఆతృతగా ఎదురుచూసే ప్రభువుగా, స్నేహితునిగా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలుగల ఆధ్యాత్మిక నిధిగా ఆయనను హత్తుకోండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...