“హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి”. (మత్తయి 2:3)
తనను ఆరాధించకూడదనుకునే వ్యక్తులకు యేసు ఇబ్బందిగా మారాడు, అలాంటి వారిపై వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది బహుశా మత్తయి యొక్క మనస్సులో ఉన్న ఒక ప్రధాన అంశం కాదుగాని కథ కొనసాగుతున్నప్పుడు దాని నుండి ఈ గూడ అర్ధమును మనం గ్రహించవచ్చు.
ఈ కథలో, యేసును ఆరాధించకూడదనుకునే రెండు రకాల వ్యక్తులు ఉన్నారు.
మొదటి రకం యేసును అస్సలు పట్టించుకోని వ్యక్తులు. వారి జీవితాల్లో ఆయన ఒక సున్నా. యేసు ఉన్న దినాలలో ఈ గుంపుకి ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మత్తయి 2:4 ఇలా చెబుతోంది, “కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.” కాబట్టి వారు హేరోదు ప్రశ్నకు జవాబిచ్చి యధావిధిగా ఎవరి పని వారు చేసుకోడానికి తిరిగి వెళ్లిపోయారు. జరుగబోతున్న దానిని దృష్టిలో ఉంచుకుని నాయకులు పూర్తి నిశ్శబ్దంగా ఏమి చేయకుండా ఉండిపోవడం చాలా విపరీతంగా అనిపిస్తుంది.
గమనించండి, మత్తయి 2:3 ఇలా చెబుతోంది, “హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.” మరో మాటలో చెప్పాలంటే, మెస్సీయా జన్మించినట్లు ఎవరో భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధాన యాజకులు ఎలాంటి స్పందన లేకుండ ఉండడం విస్మయం కలిగిస్తుంది: జ్ఞానులతో ఎందుకు వెళ్లకూడదు? ఎందుకంటే వారికి ఆసక్తి లేదు. వారు దేవుని కుమారుడిని కనుగొని అతనిని పూజించాలనే మక్కువ లేదు.
యేసును ఆరాధించడానికి ఇష్టపడని రెండవ రకం ప్రజలు ఆయన ద్వారా తీవ్రంగా ముప్పు పొంచి ఉందని భావించే వారే. అతడే హేరోదు. అతను నిజంగా భయపడుతున్నాడు. ఎంతగా అంటే అతను యేసుని వదిలించుకోవడానికి పథకం వేసి అబద్ధం చెప్పి సామూహిక హత్యకు పాల్పడ్డాడు.
కాబట్టి ఈ రోజుల్లో కూడా, క్రీస్తుకు మరియు ఆయన ఆరాధకులకు ఈ రెండు రకాల వ్యతిరేకతలు వస్తాయి: ఉదాసీనత మరియు శత్రుత్వం. మీరు ఆ రెండు గుంపుల్లో ఒక్కటిలోనైనా లేరని నేను ఆశిస్తున్నాను..మరియు మీరు క్రైస్తవులైతే, ఈ మెస్సీయను ఆరాధించడం మరియు అనుసరించడం అంటే ఏమిటో మరియు దానికి ఎంత వెల చెల్లించాలో అని ఆలోచించుకునే సమయంగా ఈ క్రిస్మస్ ను మార్చుకోండి.