“ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను”. (హెబ్రీ 6:17-18)
మన నిరీక్షణను గట్టిగా చేపట్టాలని హెబ్రీ గ్రంథకర్త మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? మన నిరీక్షణకుగల అంతిమ ఆనందం యేసు రక్తం ద్వారా పొంది, మార్చలేని విధంగా భద్రపరచబడి ఉన్నట్లయితే, గట్టిగా పట్టుకోవాలని దేవుడు మనకెందుకు చెప్తున్నాడు?
ఈ ప్రశ్నకు జవాబు ఇక్కడుంది:
- క్రీస్తు మన కోసం చనిపోయినప్పుడు ఇక గట్టిగా పట్టుకునే స్థితి మనకక్కర్లేదనే స్వతంత్రాన్ని తీసుకురాలేదు గాని గట్టిగా పట్టుకునేందుకు కావాల్సిన శక్తిని అనుగ్రహించాడు.
- ఆయన తీసుకు వచ్చింది మనం గట్టిగా పట్టుకోకపోయినా పరవాలేదన్నట్లుగా మన ఇష్టాలను రద్దు చేయడానికి కాదు గాని మనం గట్టిగా పట్టుకోవాలనే ఉద్దేశంతోనే మన ఇష్టాలను రూపాంతరం చేసే శక్తిని తీసుకు వచ్చాడు.
- గట్టిగా పట్టుకోవాలనే ఆజ్ఞను రద్దు చేయుటను ఆయన తీసుకురాలేదు గాని గట్టిగా పట్టుకోవడానికి ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడాన్ని తీసుకువచ్చాడు.
- ఆయన తీసుకువచ్చింది హెచ్చరికకు ముగింపు కాదు గాని హెచ్చరికను మరింత ఎక్కువగా కొనసాగించడానికి తీసుకువచ్చాడు.
ఆయన చనిపోయాడు కాబట్టి, “ఇదివరకే నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను” అని ఫిలిప్పీ 3:12లో పౌలు చెప్పినట్లుగా మీరు చేయవలసి ఉంది. ఇది మూర్ఖత్వం కాదు గాని ఒక పాపి దేవునిలో నిరీక్షణ ఉంచునట్లు చేసేది క్రీస్తు మాత్రమేనన్న సంగతిని ఆ పాపికి చెప్పేదే సువార్తయైయున్నది.
కాబట్టి, నా పూర్ణ హృదయంతో మీకు హెచ్చరిక చేస్తున్నదేమిటంటే క్రీస్తు చేత పట్టుకోవడానికి ఇవ్వబడిన దానిని గట్టిగా పట్టుకోండి. మీకున్న బలమంతటితో, అంటే ఆయన బలముతో గట్టిగా పట్టుకోండి. మీరు కలిగియున్న విధేయత అనే వరాన్ని ఆయన రక్తం ద్వారానే తీసుకురాబడింది.