“దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తనతోడు అని ప్రమాణము చేసి – నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను”. (హెబ్రీ 6:13-14)
విలువ, గౌరవం, హుందాతనం, గొప్పతనం, అందం, కీర్తిలాంటి ఇతర విలువలకంటే పదివేల రెట్లు ఎక్కువ విలువలు కలిగియున్న ఒకే ఒక్క వ్యక్తి దేవుడే. కాబట్టి, దేవుడు ప్రమాణం చేసినప్పుడు, తనతోడు అని ప్రమాణం చేశాడు.
ఆయన ఇంకా పైకి వెళ్లగలిగితే మరింత ఎత్తుకు వెళ్లేవాడు. ఎందుకు? మీరు కలిగియున్న నిరీక్షణలో బలమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. దేవుడు తనతోడు అని ప్రమాణం చేసినప్పుడు, ఆయన తనను తాను ఎన్నడు అలక్ష్యం చేసుకోడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నటికి నిరర్థకం చేయబడదని దేవుడు చెబుతున్నాడు.
ఆయన మనకు మరి ఎక్కువ భరోసా ఇవ్వలానుకుంటే దానిని ఖచ్చితంగా ఇచ్చేవాడే. ఎందుకు? మీ నిరీక్షణ విషయంలో బలమైన ప్రోస్తాహాన్ని ఇవ్వడానికి అలా చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం ఆయనకు ఎంత అసాధ్యమైన విషయమో, తనను తాను తృణీకరించుకోవడం కూడా అంతే అసాధ్యమని దేవుడు తన తోడని ప్రమాణం చేయడం ద్వారా ఆయన మనకు చెబుతున్నాడు.
విశ్వంలో దేవుడు మాత్రమే గొప్ప విలువను కలిగి ఉన్నాడు. దేవునికంటే విలువైనది లేక అద్భుతమైనది ఏదీ లేదు. కాబట్టి, దేవుడే తనతోడు అని ప్రమాణం చేస్తున్నాడు. ఇలా చేయడం ద్వారా ఆయన చెప్పేది ఏమంటే, “ఎంత వీలైతే అంతగా నాలో నీవు ఎక్కువ నమ్మకాన్ని కలిగియుండాలన్నదే నా ఉద్దేశం.” దానికి మించి ఇంకా ఎక్కువ సాధ్యమైతే, ఆయన మనకు ఇచ్చి ఉండేవాడని హెబ్రీ 6:13 చెప్తోంది. “తనకంటె ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తనతోడు అని ప్రమాణము చేశాడు.”
ఈయన మన దేవుడు, దేవునిలో మీరు కదలని నిరీక్షణగలవారై ఉండునట్లు ప్రేరేపించడానికి ఆయన చేరుకోగలిగిన ఎత్తైన స్థాయికి చేరుకోగలిగిన దేవుడు. కాబట్టి, ఆశ్రయం కోసం దేవుని వద్దకు పరుగులు తీయండి. మనల్ని నాశనం చేసే లోకపు/లౌకిక నిరీక్షణలన్నిటినుండి వెనుదిరిగి దేవునిపై నిరీక్షణ ఉంచండి. ఆశ్రయ దుర్గంగా, నిరీక్షణ బండగా దేవుని పోలిన వారు ఎవరూ లేరు, మరేది ఉండదు.