“ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు, ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు”. (హెబ్రీ 3:3-6)

యేసు క్రీస్తునందు నిరీక్షణ కలిగి, అతిశయించువారందరూ దేవుని ఇల్లు. అంటే, మోషే కాల౦లోనో లేదా భూమ్మీద యేసు సంచరించిన రోజుల్లోనో కాదు గాని నేటికి యేసు మనకు సృష్టికర్తయై, మన యజమానియై, మన పరిపాలకుడై, మనకు అన్నిటిని సమకూర్చేవాడుగా ఉన్నాడు.

యేసు ఈ ఇంటి “నిర్మాణ కర్త” అని పిలువబడ్డాడు. మోషే కట్టేవాడు కాదు. మోషే ఇంట్లో ఒక భాగమై ఉన్నాడు. అందుచేత,
“మోషే క౦టే ఎక్కువ మహిమకు అర్హుడిగా యేసు పరిగణి౦చబడ్డాడు, అంటే ఇంటికంటే ఇంటిని నిర్మించినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు” అని చెప్పబడింది. అందుచేత, ఇ౦టిని నడిపి౦చడ౦లో, ఇంటికి దేవుని వాక్యాన్ని ఇవ్వడ౦లో మోషే ఎ౦తో గొప్పవాడుగా ఉన్నప్పటికీ ఆయన ఇంటిలో ఒక భాగమై ఉన్నాడు. అయితే, యేసు ఆ ఇంటి నిర్మాణకుడై ఉన్నాడు.

అందుచేత, మనం యేసులో అతిశయిస్తే, ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటే, మనమే ఆయన ఇల్లు, ఆయనే మన నిర్మాణకుడు, యజమాని, పాలకుడు మరియు అన్నిటిని సమకూర్చువాడు. ఆయన తన ఇల్లు నాశనమవ్వడానికి గాని లేక పాడైపోవడానికి గాని అనుమతించడు.

ఆ తర్వాత, గ్రంథకర్త, నిర్మాణకుడు మరియు ఇల్లు అనే అంశం నుండి కుమారుడు మరియు సేవకుడు అనే అంశానికి మారుస్తున్నాడు. “మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు.” అందుచేత, క్రీస్తు తాను కట్టిన ఇంటిలో, గృహ నిర్వాహకములో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ, ఆయనకు ఇవ్వబడిన ఘనత మోషేకంటే గొప్పది. మోషే సేవకునిగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడు, వారసుడైయున్నాడు.

“అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపెట్టినయెడల మనమే ఆయన యిల్లు” అని హెబ్రీ 3:6 సెలవిచ్చినట్లుగా మనం కూడా ఇంటిలో భాగమైయున్నాం. అన్ని విధాలుగా, మోషేకు చెందవలసిన గౌరవాన్ని మోషేకు ఇద్దాం. అయితే, హెబ్రీయుల పుస్తకమంతటికీ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు గొప్పవాడని చెప్పడమే. క్రీస్తు అన్ని విధాలుగా గొప్పవాడు. ఆయన దేవుని ప్రజల ఇంటికి నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన దేవుని ప్రజల ఇంటిలో కుమారుడై ఉన్నాడు. మనం మోషేను గౌరవిద్దాం, అయితే మన సృష్టికర్త, మన సహోదరుడైన యేసును ఆరాధిద్దాం.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *