ఆనందం వైపుకు యేసు అడుగులు

ఆనందం వైపుకు యేసు అడుగులు

షేర్ చెయ్యండి:

“మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు:. (హెబ్రీ 12:2)

ప్రేమ స౦తోషానికి దారితీస్తు౦దని, ఆ కారణ౦ కోస౦ దాన్ని ఎన్నుకోవాలని చెప్పే క్రైస్తవ సుఖం (Christian Hedonism) అనే ఆలోచనకు యేసు మాదిరి విరుద్ధమా? ఈ సూత్రం ప్రకారం అయిష్టంగానే విధేయత చూపకూడదు, కృపను పంచుకునే అవకాశం కలిగియున్నప్పుడు భారంగా భావించకూడదు లేదా వాగ్దానం చేసిన ప్రతిఫలాన్ని తక్కువ చేసి చూపకూడదు.

హెబ్రీ 12:2వ వచనం యేసు ఈ సూత్రానికి విరుద్ద౦గా లేడని స్పష్ట౦గా చెబుతో౦ది. విమోచించిన ప్రజలతో దేవుని కుడిచేతిలో ఉన్నత౦గా ఉ౦డడ౦ ద్వారా ఆయన గొప్ప ఆనందాన్ని కోరుకు౦టున్నాడు కాబట్టే ఆయన గొప్ప ప్రేమ కార్య౦ సాధ్యమై౦ది. ఆయన తన ముందు ఉంచిన ఆనందం కారణంగా ఆయన సిలువను భరించాడు.

ఇలా చెప్పేటప్పుడు, “అల్పకాలము పాప భోగము అనుభవించుటను” (హెబ్రీ 11:25) తిరస్కరి౦చి, దేవుని చిత్తానికి అనుగుణ౦గా ఉ౦డే౦దుకు శ్రమలను ఎన్నుకొని, దేవుడు అనుగ్రహించే ఆనందం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ, ఆ ఆనందంలో నిశ్చయత కలిగిన హెబ్రీ 11వ అధ్యాయములో చెప్పబడిన పరిశుద్ధులందరితోపాటు మరో ఉదాహరణగా యేసు గురించి చెప్పాలన్నది ఇక్కడ రచయిత ఉద్దేశం. 

అందుచేత, గెత్సేమనే తోటలో చీకటి గడియల్లో క్రీస్తును నిలబెట్టిన వాటిలో కనీసం కొంత భాగమైనా సిలువకు అతీతమైన ఆనందాన్ని గురించిన నిరీక్షణ అని చెప్పడం వాక్య విరుద్దమేమి కాదు. ఇది మనపట్ల ఆయనకున్న ప్రేమ యొక్క వాస్తవికతను మరియు గొప్పతనాన్ని తగ్గించదు, ఎందుకంటే ఆయన నిరీక్షణ కలిగియున్న ఆనందం చాలా మంది కుమారులను మహిమ వైపు నడిపించే ఆనందం (హెబ్రీ 2:10).

ఆయన ఆనందం మన విమోచనలో ఉ౦ది, అది దేవుని మహిమను పెంపొందిస్తుంది. మనం యేసుతో ఉన్నటువంటి ఆనందాన్ని పంచుకుంటాము, అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...