“కాబట్టి – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును”. (మత్తయి 6:31-34)

మత్తయి 6:25-34 వచనాల్లో అవిశ్వాసానికి వ్యతిరేకంగా మంచి పోరాటం చేయడానికి మరియు చింత నుండి విముక్తి పొందడానికి సహాయం చేసేందుకు యేసు రూపొందించినవి (డిజైన్ చేసినవి) కనీసం ఏడు వాగ్దానాలు ఉన్నాయని గత రెండు రోజుల్లో చూశాం. ఈ రోజు మనం మిగిలిన చివరి మూడు వాగ్దానాలను చూద్దాం.

వాగ్దానం #5: కాబట్టి – ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును. (మత్తయి 6:31-32)

దేవుడు మీ అవసరాలను నిర్లక్ష్యపెడతాడని అనుకోవద్దు. ఆయనకి మీ అవసరాల గురించి తెలుసు. ఆయన “మీ పరలోకపు తండ్రి.” ఆయన దూరం నుండి చూస్తూ ఊరకనే ఉండేవాడు కాదు. ఆయన సంరక్షిస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు.

వాగ్దానం #6: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33)

మీరు మీ వ్యక్తిగత భౌతిక అవసరాల గురించి చింతించకుండా, ఈ లోకంలో ఆయనకున్న ఉద్దేశం కోసం మిమ్మల్ని మీరు అంకితం చేసుకోగలిగితే, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మరియు ఆయనకు మహిమను చెల్లించడానికి మీకు కావలసినవన్నీ ఆయన తప్పక దయజేస్తాడు. “అవన్నీ మీకు అనుగ్రహించబడుతాయి” అని నేను అర్థం చేసుకున్నాను. మీరు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు ఆయనను మహిమపరచడానికి ఆహారం, నీరు, దుస్తులు, ప్రతీది మీకు అనుగ్రహించబడును. మీరు ఆయన కోసం చనిపోవడమే ఆయన ఉద్దేశ్యం కావచ్చు, అయితే, ఆయన మహిమార్ధమై దీనిని చేయుటకు మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు.

ఇది, “తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” అనే రోమా 8:32లోని వాగ్దానాన్ని పోలి ఉన్నది. దాని తర్వాత, “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా – నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” (రోమా 8:35-37) అని వ్రాయబడింది. కరువు, వస్త్రహీనత రావచ్చు గానీ మనం జయించినవారికంటే ఎక్కువగా ఉండటానికి అవసరమైనవన్నిటిని మనం కలిగి ఉంటాం.

వాగ్దానం #7: “రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును” (మత్తయి 6:34)

మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఏ రోజు మీరు పరీక్షంచబడకుండా దేవుడు చూసుకుంటాడు (1 కొరింథీ 10:13). ఆయన మీ కొరకు పనిచేస్తాడు, తద్వారా “నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును” (ద్వితీయో 33:25).

ప్రతి రోజూ ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. అయితే, ఆయన కృపవలన మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఏ సమస్య ఉండదు. ప్రతి రోజు ప్రతి ఉదయం నూతన కృపలతో నిండి ఉంటుంది, ఆ రోజు కష్టానికి సరిపోయే కృప ఉంటుంది (విలాప 3:22-23). మీకు కావలసిన కృపను అందించకుండ ఆయన ఏ మంచి పనిని మీ నుండి ఆశించడు (2 కొరింథీ 9:8).

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *