నాశనం చేయబడింది మరియు సంతోషించబడింది
“నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను”. (ద్వితీయో 7:6)
మన రక్షణలో దేవుని సార్వభౌమ కృపకు సంబంధించిన కాల్వినిస్టిక్ బోధ కోసం ఉపయోగించే తులిప్ (TULIP) అనే పాత ప్యూరిటన్ పదానికి సంబంధించిన కృపా సిద్ధాంతాలు ఏమిటి? అంటే, ఆ చెట్టులోని ప్రతి కొమ్మ అగస్టీనియన్ సిద్ధాంత సారంతో నిండియుంటే ఆ కృపా సిద్ధాంతాలు ఎలా ఉంటాయి?
- సంపూర్ణ భ్రష్టత్వం అంటే కేవలం చెడు మాత్రమే కాదు, దేవుని అందాన్ని చూడలేని అంధత్వం, లోతైన ఆనందాన్ని ఆశ్వాదించలేకపోడం.
- షరతులు లేని ఎన్నిక అంటే త్రిత్వ సహవాసంలో దేవుని ఆనంద ప్రవాహంగా, మన ఉనికి కలగక ముందే యేసులో మన సంపూర్ణ ఆనందం ప్రణాళిక చేయబడింది.
- నిశ్చయ ప్రాయశ్చిత్తం అంటే క్రొత్త నిబంధన రక్తం ద్వారా దేవుని ప్రజల కోసం దేవునిలో వివరింప సాధ్యం కానటువంటి ఆనందం ఖచ్చితంగా భద్రపరచబడిందనే భరోసా.
- ప్రతిఘటించ నసాధ్యమైన కృప అంటే మన౦ ఆత్మహత్యా ఆనందాలకు లోనుకాకుండా చూసుకోవడానికి, ఉన్నతమైన ఆనందాల సార్వభౌమాధికారం ద్వారా మనల్ని స్వతంత్రులనుగా చేయడానికి దేవుని ప్రేమ యొక్క నిబద్ధత, శక్తియై ఉన్నది.
- పరిశుద్ధుల పదిలత అంటే దేవుని దక్షిణ హస్తంలో శాశ్వత ఆనందాన్ని పొందడం కోసం, ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనంద స్వాస్థ్యం కోసం సమస్త బాధలు, శ్రమల ద్వారా అల్ప సుఖాల అంతిమ బంధకంలోనికి మనల్ని పడనీయకుండా మనల్ని కాపాడే సర్వశక్తిమంతుడైన దేవుని కార్యం.
పైన చెప్పబడిన ఐదు అంశాలలో బేషరతుగా ఎన్నుకోవడం అనే అంశం నా ఆత్మకు అత్యంత కఠినమైన, మధురమైన తీర్పులను ఇస్తోంది. షరతులులేకుండా అనే పదం స్వీయ అతిశయములన్నిటిని (హెచ్చింపులన్నిటిని) నాశనం చేస్తుంది (అదే కఠినమైన భాగం); ఎన్నుకోవడం అనేది ఆయన అమూల్యమైన సొత్తుగా నన్ను చేసింది (ఇదే మధురమైన భాగం).
వాక్యానుసారమైన కృపా సిద్ధాంతాల అందాలలో ఒకానొక అందం ఏంటంటే వాటి ఘోరమైన వినాశనాలు వాటి గొప్ప ఆనందాలకు మనల్ని సిద్ధం చేస్తాయి.
“నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను” (ద్వితీయో 7:6) అనే మాటలు వినగానే, ఏర్పరచుకోవడమనేది ఒకవేళ మనపైన ఆధారపడి ఉన్నట్లయితే, మనమెంతో అహంకారులగా మారుతాం గాని అహంకారం నుండి మనలను రక్షించడానికి, మనం బేషరతుగా ఎన్నుకోబడ్డామని ప్రభువు మనకు బోధిస్తున్నాడు (ద్వితీయో 7:7-9). “ఆయన ఒక చెత్తను తన నిధిగా తయారు చేసుకున్నాడు” అని మనం చాలా సంతోషంగా పాడుకోగలుగుతున్నాం.
మనల్ని మనం హెచ్చించుకోకుండా లేక మనలో మనం అతిశయించకుండా బేషరతుగా ఎన్నుకోబడిన కృప, వినాశకరమైన స్వతంత్రత మరియు రక్షించగల ఇతర కృపా కార్యాలను మనకొరకు స్వీకరించి, వాటిని రుచి చూద్దాం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web