“చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలె ఏర్పరచుకొనెను”. (ద్వితీయో 10:14-15)

దేవుని ఎన్నుకునే ప్రేమ, అంటే ఆయన తన కోసం ఒక జనంగాన్ని ఎన్నుకునే ప్రేమ పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఇది ఆయనకున్న అనంతమైన జ్ఞానం ద్వారా ఆయనకున్న అపరిమితమైన ఆనందంలో నుండి వచ్చే కృపా ప్రవాహం.

భూమి మీదనున్న సమస్త జనాంగముల నుండి ఇశ్రాయేలీయులను ఎన్నుకోవడంలో దేవుడు కలిగియున్న సంతోషాన్ని ద్వితీయో 10:14-15 వివరిస్తుంది. ఇక్కడ రెండు విషయాలను గమనించండి.

మొదటిగా, 14 మరియు 15 వచనాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని గమనించండి. సమస్త విశ్వం మీద దేవుడు సర్వాధికారం కలిగియున్న నేపథ్యంలో ఇశ్రాయేలీయులను ఎన్నుకొనుట గురించి మోషే ఎందుకు వివరించాడు? 14వ వచనంలో “ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే” అని, 15వ వచనంలో “తన ప్రజల కోసం ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు” అని  మోషే ఎందుకు చెప్పాడు?

ఈ ప్రజలను ఎన్నుకోవడానికి దేవుడు ఏదో విధంగా సిద్ధంగా ఉన్నాడని, ఆయన ఎంపికకు కొన్ని పరిమితులు ఉన్నాయని, వారిని ఏదో విధంగా ఎంచుకోవలసి వచ్చిందనే భావనను వదిలించుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దేవుడు మాత్రమే తన హక్కుతో అధికారంతో తన ప్రజలను కలిగియుంటాడు తప్ప దేవతలనబడే మరి ఏ ఒక్కరికి అది సాధ్యం కాదనే అన్యుల ఆలోచనను విచ్చిన్నం చేయడమే దీని ఉద్దేశం.

యెహోవాయే (యావే – త్రియేక దేవుడు) ఒకే ఒక నిజమైన దేవుడన్నది సత్యం. విశ్వంలో ఉన్నటువంటి సమస్తం ఆయనదే మరియు తన స్వంత స్వాస్థ్యంగా ఏ జనాంగమునైనా ఎన్నుకునే హక్కు అధికారాలను ఆయన మాత్రమే కలిగియున్నాడు.

అందుచేత, ఇశ్రాయేలీయులను గురించి చెప్పలేని అద్భుత సత్యం ఏంటంటే ఆయన వారిని ఎన్నుకోవడమే. ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. ఆయన విమోచించు ఉద్దేశాల కోసం భూమి మీదనున్న ఏ జనాంగములనైనా ఎన్నుకోవడానికి ఆయనకి సర్వ హక్కులు, అధికారాలు ఉన్నాయి, లేక ఆయన వారినందరిని ఎన్నుకోవడానికి, వారిని ఎన్నుకోకుండా ఉండటానికి కూడా ఆయన హక్కులను అధికారాలను కలిగియున్నాడు.

అందుచేత, ఆయన తన గురించి “వారి దేవుణ్ణి” అని వారికి చెప్పుకున్నప్పుడు, ఆయన కనాను దేవుళ్ళతోను లేక ఐగుప్తు దేవుళ్ళతోను సమానుడని తన గురించి చెప్పుకోవడం లేదు. ఆ జనాంగములను ఆయన సొంతం చేసుకున్నాడని అర్థం. ఇది ఆయనకు సంతోషం కలిగించి ఉంటే, ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం ఆయన పూర్తిగా విభిన్నమైన ప్రజలను ఎన్నుకునేవాడు.

14 మరియు 15 వచనాలను ఈ విధంగా కలిపి పెట్టడానికిగల ఉద్దేశం ఏంటంటే దేవుని అధికారాన్ని, సార్వత్రిక హక్కులను మరియు స్వేచ్చను నొక్కి చెప్పడానికే.

15వ వచనంలో గమనించదగిన రెండవ విషయం ఏంటంటే “ఆయన తన మనస్సును మీ పితరుల మీద ఉంచడానికి” దేవుడు తన సర్వాధికార స్వేచ్చను ప్రయోగించిన విధానం. “పితరులను ప్రేమించడానికి వారియందు ఆయన సంతోషించడం.” ఆయన స్వేచ్చగా పితరులను ప్రేమించడంలో సంతోషించటాన్ని ఎన్నుకున్నాడు.

ఇశ్రాయేలీయుల పితరుల కోసం దేవుడు కలిగియున్న ప్రేమ స్వేచ్చతోనూ కరుణతోనూ కూడినదైయుండెను మరియు పితరులు తమ యూదత్వంలోను లేక తమ గుణగణాలలో ఉన్నారన్నదానిని బట్టి ఆ ప్రేమ నిర్బంధించబడియుండలేదు.

ఇది మనకు ఒక పాఠమైయున్నది. ఎందుకంటే, క్రీస్తులో విశ్వాసులమైన మనల్ని దేవుడు స్వేచ్చగా ఎన్నుకున్నాడు. మనలో ఏదో ఉందన్నదానిని బట్టి కాదు గాని అలా చేయడానికి దేవుడు సంతోషించాడు కాబట్టి మనం స్వేచ్చగా ఎన్నుకోబడ్డాం.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *