ఓటమికి భవిష్యత్తు
“అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు”. (1 సమూయేలు 12:20–22)
ఇశ్రాయేలీయులు భయాందోళనకు గురై, ఇతర దేశాలవలె తమకూ ఒక రాజును ఇవ్వాలని సమూయేలును కోరుకున్నారు. వారు చేసిన ఈ పాపం విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు నుంచి వచ్చిన మంచి మాటలు: “భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే.” దేవుని స్పందన విరుద్ధంగా ఉంది – ఎంత అద్భుతంగా ఈ స్పందన ఉందో మీరు విన్నారా? వాస్తవానికి “భయపడండి, ఎందుకంటే మీరు ఈ కీడు చేసారు” అని దేవుడు చెప్పాలని మీరు ఆశించాలి. భయపడటానికి సరియైన కారణం: మీరు దేవుణ్ణి కాకుండా మరొక రాజును కోరి గొప్ప కీడు చేసారు! కానీ సమూయేలు అలా అనటం లేదు. “భయపడవద్దు; మీరు ఈ కీడు చేసిన మాట నిజమే.” అని అంటున్నాడు.
సమూయేలు ఇంకా ఇలా అన్నాడు, “అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.”
ఇది సువార్త: మీరు ఘోరమైన పాపం చేసినప్పటికీ, ప్రభువును ఘోరంగా అవమానించినప్పటికీ, ఇప్పుడు మీకు ఒక రాజు ఉన్నాడు కానీ ఇంకో రాజు కావాలని కోరడం పాపమయినప్పటికీ, జరిగిన పాపం విషయంలో మరియు ఇంకా రాబోతున్న బాధాకరమైన పర్యవసానాల విషయములో మనము వెనక్కు వెళ్లలేనప్పటికీ, మీకు భవిష్యత్తు ఉంది. మీకు నిరీక్షణ ఉంది. మీకు దయ ఉంది.
భయపడకు! భయపడకు!
తరువాత 1 సమూయేలు 12:22లో ఈ మంచి వార్తకు ఆధారమును గూర్చి మరియు పునాదిని గూర్చి ఈ విదంగా చెప్తున్నాడు. ఇంత పాపం చేసినా భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు? ” యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.”
తన నామము పట్ల దేవునికి ఉన్న నిబద్ధతయే సువార్తకు ఆధారం. మీరు విన్నారా? మీరు పాపం చేసినప్పటికీ భయపడకుడి. “తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.” ఈ సత్యం మీపై రెండు రకాలుగా ప్రభావం చూపిస్తుంది: హృదయ విదారకమైన వినయం మరియు గొప్ప ఆనందం. వినయం ఎందుకంటే మీ విలువ మీ మోక్షానికి పునాది కాదు. ఆనందం ఎందుకంటే దేవుడు తన నామము విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ రక్షణ విషయంలో కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఇంతకంటే నిశ్చయమైనది ఇంకేమీ లేదు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web