మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే, (రోమా 6:20-21)
ఒక క్రైస్తవుడు పూర్వం తాను దేవున్ని అవమానపరిచాడని గ్రహించి కళ్ళు తెరిచినప్పుడు, క్రైస్తవుడు ఆ విషయంలో సిగ్గుపడడం సరియైనదే. పౌలు రోమా సంఘంతో ఇలా అన్నాడు, “మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు… అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా?”
మనం ఒకప్పుడు దేవునికి అవమానకరంగా జీవించిన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకొని, బాధను అనుభవించడానికి సరైన సమయం ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే, దీని గురించి ఆలోచించడం ద్వారా మనం అలా కదలకుండా ఉండి పోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ సున్నితమైన క్రైస్తవ హృదయం తన యవ్వనపు మూర్ఖత్వాల గురించి తిరిగి ఆలోచించినపుడు మనం మన గత జీవితాన్ని ప్రభువుతో పరిష్కరించుకున్నప్పటికి, దాని గురించి అవమానంగా భావించకుండా ఉండలేము.
సరియైన అవమాన భావం చాలా ఆరోగ్యకరమైనది మరియు విముక్తిని కలిగిస్తుంది. పౌలు థెస్సలొనీక సంఘంతో ఇలా అన్నాడు, “ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.” (2 థెస్సలొనీకయులకు 3:14). దీనర్థం అవమాన భావం (సిగ్గు) అనేది మారు మనస్సు కోసం మనం వేసే ఒక సరియైన రక్షణార్థమైన అడుగు; అలాగే కొన్నిసార్లు ఒక విశ్వాసి జీవితంలో ప్రేమ చల్లారిన స్థితి లేదా పాపంతో ఉన్న స్థితి విషయంలో వేసే ఒక పశ్చాత్తాప అడుగు. అవమాన భావం (సిగ్గు) అనేది ఖచ్చితంగా తప్పించుకోవాల్సిన విషయం కాదు. దేవుడు తన ప్రజలకు చేసే మంచిలో దానికి చోటు ఉంది.
తప్పుడు అవమాన భావానికి, సరియైన అవమాన భావానికి ప్రమాణం మనం బైబిల్లో చూడొచ్చు. ఈ ప్రమాణం సంపూర్తిగా దేవుని కేంద్రీకృతమైందని మనం నిర్ధారించవచ్చు.
తప్పుడు అవమాన భావం గురించి బైబిల్ ఇలా చెబుతోంది, ఇతర వ్యక్తుల దృష్టిలో అది ఎంత బలహీనమైనా, మూర్ఖమైనా, లేదా తప్పైనా, అది దేవుని గౌరవించేది అయితే దానిని అవమానంగా భావించవద్దు. లేదా తప్పుడు అవమాన భావానికి దేవుని-కేంద్రీకృత ప్రమాణాన్ని వర్తింపజేయడానికి మరొక మార్గం ఏంటంటే: మీరు ప్రస్తుతం ఏదో ఒక విధంగా చెడు చేస్తే తప్ప, అవమానకరమైన పరిస్థితి కారణంగా సిగ్గుపడకండి.
చాలా మంచి మాటలు జ్ఞాపకం చేసారు.
Blessed are they that mourn for their sins and come for repentance.