“ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు”. (1 కొరింథీ 7:22)

“ప్రభువు”కి (అనగా యజమానుడు) బదులుగా “క్రీస్తు” (అనగా మెస్సీయ) అని పౌలు వ్రాయాలని నేను ఆశించేవాడిని.

మన విమోచనకు (“ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు”), యేసు మన యజమానుడు (“క్రీస్తు దాసుడు”) అనే మాటకు పరస్పర సంబంధం ఉందని పౌలు వ్రాస్తున్నాడు. ఈ మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా యజమానులు తమ దాసుల జీవితాలను నియంత్రిస్తారు; కానీ మెస్సీయ తన ప్రజలను వారి బంధకములనుండి విడిపించడానికి వచ్చాడు.

పౌలు ఎందుకు ఇలా అంటున్నాడు? దాసుడుకి(స్వాతంత్ర్యముకి బదులు) మెస్సీయతో, మరియు స్వాతంత్ర్యమును (దాసుడుకి బదులు) యజమానితో ఎందుకు ముడి పెట్టాడు?

సలహా: ఈ పరస్పర మార్పు మన కొత్త స్వేచ్ఛపై రెండు ప్రభావాలను మరియు మన కొత్త బానిస్త్వంపై రెండు ప్రభావాలను చూపుతుంది.

ఒకవైపు, మనలను “ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు.” అని పిలవడంలో, పౌలు మన కొత్త స్వేచ్ఛ భద్రమని మరియు పరిమితం అని చెప్తున్నాడు:

1. ఈ ప్రభువు ఇతర ప్రభువులు అనబడిన వారందరినీ ఏలేవాడు కాబట్టి మన స్వాతంత్ర్యమును ఎవరు సవాలు చేయలేరు – ఖచ్చితంగా సురక్షితం.

2. కానీ, ఇతర ప్రభువులనబడిన వారందరి నుండి స్వాతంత్ర్యము పొంది, మనము ఆ ఒక్క ప్రభువు నుండి స్వాతంత్ర్యము పొందలేదు. అయన దయాసంకల్పమును బట్టి మన స్వేచ్ఛ పరిమితం చేయబడింది. యేసే మన యజమాని.

మరోవైపు, మనలను “క్రీస్తు దాసులు” అని పిలవడంవలన, పౌలు మన దాస్యత్వాన్నితేలికగా, మనోహరమైనదిగా చెప్తున్నాడు:

1. బంధకాల పరిమితుల నుండి శాంతికరమైన బహిరంగ ప్రదేశాల్లోకి వారిని తీసుకురావడానికి మెస్సీయ తనవారిపై హక్కు కలిగిఉంటాడు. “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు…” (యెషయా 9:7)

2. మరియు వారికి మధురమైన ఆనందాన్ని ఇవ్వడానికి అతను వారిని తన స్వంతం చేసుకుంటాడు. “కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.” (కీర్తన 81:16). మరియు మెస్సీయ అనబడిన క్రీస్తే ఆ కొండ.

కాబట్టి, క్రైస్తవుడా వీటిలో సంతోషించు: “ప్రభువులో బానిసగా పిలువబడినవాడు ప్రభువు (యజమాని) వలన స్వాతంత్ర్యము పొందినవాడు”. “అలాగే స్వతంత్రుడిగా పిలవబడినవాడు క్రీస్తు(స్వేచ్ఛనిచ్చే, మదురమైనమెస్సీయ)కు దాసుడు”

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *