మనం సమస్తాన్ని పరిపాలిస్తాం

మనం సమస్తాన్ని పరిపాలిస్తాం

షేర్ చెయ్యండి:

నేను జయించి నా తండ్రితో కూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతో కూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను”. (ప్రకటన 3:21)

లవొదికయలోని సంఘానికి యేసు ఈ మాట చెప్పినప్పుడు, ఆయన చెప్పిన ఈ మాటకు అర్థం ఏమిటి? యేసు కూర్చున్న సింహాసనం మీద కూర్చుంటామా? నిజంగానా?

ఇది బాధలు,శోధనలు మరియు పాపభరితమైన ఆనందాలున్న ఈ లోకంలో  అంతము వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొని, జయించు ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన వాగ్దానమై ఉన్నది (1 యోహాను 5:4). అందుచేత, మీరు యేసును నమ్మిన నిజమైన విశ్వాసియైతే, తండ్రియైన దేవుని సింహాసనం మీద కూర్చుని ఉన్న, దేవుని కుమారుని సింహాసనం మీద, మీరు కూడా కూర్చుంటారు.

విశ్వాన్ని పరిపాలించడానికి గల హక్కును, అధికారాన్ని, “దేవుని సింహాసనం” సూచిస్తుందని నా అభిప్రాయం. ఆ సింహాసం మీదనే యేసు కూర్చొని ఉంటాడు. “ఆయన తప్పకుండ పరిపాలించాలి,” “ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను” (1 కొరింథీ 15:25) అని పౌలు ద్వారా రాయించబడింది. అందుచేత, “…నా సింహాసనమందు కూర్చుండబెట్టుదును…” (ప్రకటన 3:21) అని యేసు చెప్పినప్పుడు, సమస్తాన్ని పాలించే విషయాన్ని మనతో పంచుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు.

ఇదే విషయాన్ని మనస్సులో పెట్టుకొని, “సమస్తమును ఆయన (యేసు) పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది” అని ఎఫెసీ 1:22-23 వచనాలలో పౌలు చెప్తున్నాడా?

సంఘమైన మనం “సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నాం.” ఈ మాటకు అర్థం ఏమిటి? విశ్వమంతా ప్రభువు మహిమతో నింపబడుతుందని (సంఖ్యా 14:21) నేను అర్థం చేసుకుంటున్నాను. ఆ మహిమకు సంబంధించిన ఒక పార్శ్వం ఏమిటంటే, ప్రతి చోట జరిగే ఆయన పరిపాలన, ఎటువంటి అవరోధాలు లేకుండా పూర్తిగా వ్యాపించి ఉంటుంది.

అందుచేత, ఎఫెసీ 1:23వ వచనానికి అర్థం ఏంటంటే, యేసు మన ద్వారా ఆయన మహిమగల పరిపాలనతో విశ్వాన్ని నింపుతాడు. ఆయన పరిపాలనలో పాలుపంచుకున్నప్పుడు, మనం ఆయన పరిపాలన యొక్క సంపూర్ణతగా ఉంటాం. మనం ఆయన పక్షాన, ఆయన శక్తితో, ఆయన అధికారం క్రింద పరిపాలిస్తాం. ఈ విధమైన అర్థంలో, మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం.

ఈ ధన్యతను, మనం పట్టించుకోవలసిన రీతిలో పట్టించుకోవట్లేదు. ఇది మనకు ఎంతో ఎక్కువ, ఎంతో మంచి విషయం, అద్భుతమైన విషయం. ఇందుచేతనే, “మీ మనోనేత్రములు వెలిగింపబడినందున [వెలిగించబడతాయి], ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో…”  (ఎఫెసీ 1:18) అని దేవుని సహాయం కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు.

ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని సహాయం లేకుండా, మనం భవిష్యత్తులో ఏమై ఉండబోతున్నామో దాని యొక్క అద్భుతాన్ని ప్రస్తుతం అనుభవించలేము. కానీ మనం దానిని ఉన్నది ఉన్నట్లుగా అనుభూతి చెందితే, ఈ ప్రపంచం పట్ల మన భావోద్వేగ ప్రతిస్పందనలన్నీ మారుతాయి. క్రొత్త నిబంధనలోని వింతైన, తీవ్రమైన ఆజ్ఞలు ఒక్కప్పుడు కనుపించినంత వింతగా ఇప్పుడు కనుపించవు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...