పాస్టర్ జాన్, చాలా మంది శ్రోతలు ఈ ప్రశ్నను అడగడానికి ఇమెయిల్ చేశారు: నిశ్చితార్థం చేసుకున్న ఒక జంట, వివాహానికి ముందు శృంగారం విషయంలో ఎంత వరకు వెళ్ళవచ్చు?
ఇది నిజంగా ముఖ్యమైన ప్రశ్న. మన సంస్కృతి శృంగార ఆకర్షణలతో నిండిపోయింది. అంతర్జాలాన్ని తెరవగానే శృంగార కోరికను కలిగించే ప్రకటనలు లేకుండా మీరు మీ అంతర్జాలాన్ని తెరవలేరు. ఏదో రకమైన శృంగార ప్రేరేపణ లేని టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలు మీరు చూడటం చాలా అరుదు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఒక యువకుడు మరియు యువతి (లేదా ఆ విషయానికి వస్తే పురుషుడు మరియు మహిళ) కలిసి తిరగడం ప్రారంభించినప్పుడు, వారు శారీరకంగా ఎలా వ్యవహరించాలి? అని అడగడం చాలా కీలకమని నేను భావిస్తున్నాను.
మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయంలో బైబిల్ మన మార్గదర్శి మరియు మన అధికారం. “సరే, నిశ్చితార్థం అయిన జంటలు లేదా డేటింగ్ ప్రారంభించిన జంటలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రత్యేకంగా చెప్పే ఒక్క వాక్యం కూడా బైబిల్‌లో లేదు. మనం బైబిల్‌లోని సత్యాలను ఒకచోట చేర్చి, వాటి నుండి కొన్ని నిర్ణయాలకు రావడం ద్వారా వాటిని తెలుసుకోవాలి. నేను ఆ సత్యాలలో కొన్నింటిని ఒకచోట చేర్చే ప్రయత్నం చేస్తాను.
శృంగారం మంచిది
మొదటిగా, శృంగారం మంచిది. ప్రధానంగా ఇది చెడ్డది లేదా జాగ్రత్తగా ఉండు అనే హెచ్చరికతో నేను దీన్ని ప్రారంభించాలని అనుకోవడం లేదు. శృంగారం మంచిది. 1 తిమోతి 4:3 ప్రకారం, రాబోయే రోజుల్లో కొందరు కొన్ని విషయాలను నిషేధిస్తారు, వివాహం కూడా దానిలో ఉంటుంది, ఎందుకంటే వివాహంలో శృంగారం అనే వికారమైన విషయం ఉందని వారు భావిస్తారు. పౌలు 1 తిమోతి 4:4,5లో మరింత వివరిస్తూ: “దేవుడుసృజించినప్రతివస్తువునుమంచిది. కృతజ్ఞతాస్తుతులుచెల్లించిపుచ్చుకొనినయెడలఏదియునిషేధింపతగినదికాదు; ఏలయనగాఅదిదేవునివాక్యమువలననుప్రార్థనవలననుపవిత్రపరచబడుచున్నది.” అని అన్నాడు.
” శృంగారం (లైంగిక సంబంధం) మంచిది, కానీ అది వివాహంలో మాత్రమే ఆనందించాలి.”
ఆశ్చర్యకరంగా, మంచి శృంగార సంబంధం క్రైస్తవుల కోసం ఉద్దేశించబడింది అని ఇది చెబుతుంది. అదికృతజ్ఞతాహృదయంతోస్వీకరించేవారికోసంఉద్దేశించబడింది. 1 కొరింథీయులు 7:3 ఇలా చెబుతోంది “భర్తభార్యకునుఆలాగుననేభార్యభర్తకునువారివారిధర్మములునడుపవలెను.” 1 కొరింథీయులు 7:5లో ఇంకా హెచ్చరిస్తూ, ఈ శృంగార సాన్నిహిత్యం నుండి కేవలం తాత్కాలికంగా మాత్రమే దూరంగా ఉండమని చెబుతుంది, లేకపోతే సాతాను మిమ్మల్ని శోధించవచ్చు. శృంగారం కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే కాదని దీని అర్థం.
దేవుడు మన జీవితాల్లో శృంగార సంబంధాన్ని మరింత లోతైన, వ్యక్తిగత, మరియు సంతృప్తికరమైన కారణాల కోసం ఉంచాడు. అయితే సామెతలు 5:18–19లోని అద్భుతమైన వాక్యం ప్రతి పురుషుడు ఇష్టపడే ఒక సత్యాన్ని చెబుతుంది:“నీఊటదీవెననొందును. నీయౌవనకాలపుభార్యయందుసంతోషింపుము. ఆమెఅతిప్రియమైనలేడి, అందమైనదుప్పిఆమెరొమ్ములవలననీవుఎల్లప్పుడుతృప్తినొందుచుండుము. ఆమెప్రేమచేతనిత్యముబద్ధుడవైయుండుము.” కాబట్టి, బైబిల్ ప్రకారం శృంగార స్పర్శ స్పష్టంగా మంచి విషయమే. ఇది మొదటి సత్యం.
శృంగార అనేది వివాహం కోసమే
రెండవ సత్యం, శృంగార సంబంధాన్ని వివాహంలో మాత్రమే ఆస్వాదించాలి. 1 కొరింథీయులకు 6:18 “జారత్వమునకుదూరముగాపారిపోవుడి” అని చెబుతుంది. వ్యభిచారానికి మరియు జారత్వానికి మధ్య తేడా ఉంది. వివాహంలో అక్రమ లైంగిక సంబంధం ఉంది: దానిని వ్యభిచారం అంటారు. వివాహానికి ముందు అక్రమ లైంగిక సంబంధం ఉంది: దానిని జారత్వం అంటారు. అక్కడికి వెళ్లకండి “దాని నుండి పారిపోండి” అని పౌలు అంటున్నాడు.
1 కొరింథీయులకు 7:9లో పౌలు ఇలా అంటాడు: “అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.” ఎందుకంటే ఈ అద్భుతమైన ప్రక్రియ “శృంగారం” అని పిలువబడుతుంది. ఇది వివాహంలోనే పరిపూర్ణంగా సంతృప్తి చెందేందుకు రూపొందించబడింది.
దీనికి ఒక కారణం ఏమిటంటే లైంగిక సంబంధం యొక్క శారీరక కలయిక అనేది శాశ్వత ఒడంబడికలో భావోద్వేగ, ఆధ్యాత్మిక కలయికకు భౌతిక మూలస్తంభంగా ఉండాలి. మనం జంతువులం కాదు. లైంగిక సంబంధానికి మన మొత్తం వ్యక్తిత్వాన్ని ఆనుకుని ఉండే లోతైన మూలాలు మరియు విస్తరించే శాఖలు ఉన్నాయి మరియు ఇది మన ఆత్మ, మనసు, మరియు శరీరాన్ని సమగ్రంగా ప్రభావితం చేస్తుంది.
మన సినిమాల్లో, సాహిత్యంలో, ప్రకటనల్లో, పురుషుడు మరియు స్త్రీ మధ్య ఉన్న ఒడంబడికతో కూడిన, లోతైన, వ్యక్తిగత, భావోద్వేగ, ఆత్మీయ కలయిక సంబంధం నుండి శృంగారాన్ని వేరు చేయడానికి మనం ప్రయత్నించాము. ఇది ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది.
ఈ విషయంలో స్త్రీలు పురుషులకన్నా సమగ్రంగా ఆలోచిస్తారు. స్త్రీలు శృంగారాన్ని కేవలం శారీరక తృప్తికోసమే కాకుండా, అన్ని కోణాల్లో అనుభవించాలని ఆకాంక్షిస్తారు. జంతువులాగా శృంగారంలో మాత్రమే తృప్తి పొందాలనే పురుషుల వాంఛకు సంబంధించిన వస్తువులుగా వారిని చూడకూడదని స్త్రీలు ఆశిస్తారు. స్త్రీలు సంబంధాన్ని కోరుకుంటారు. స్త్రీలు ఈ సంబంధంలో వ్యక్తిగత ప్రమాణాలను మరియు ఒప్పందబద్ధమైన నిబద్ధత ప్రమాణాలను కలిగి ఉండాలని కోరుకుంటారు.
“లైంగిక కోరికను మేలుకొలిపే స్పర్శను మరియు ముద్దులను నివారించండి. అవి ఆట కోసం కాకుండా, ముందస్తు లైంగిక ప్రేరణ (ఫోర్‌ప్లే) కోసం రూపొందించబడ్డాయి”
మీడియాలో చాలా మంది స్త్రీలు పురుషుల ఆకాంక్షలకు లోబడుతూ, లైంగికతను సమగ్రమైన, వ్యక్తిగతమైన దృక్పథంతో కాకుండా, మరింత పశుప్రాయమైన రీతిలో వ్యవహరించే విధానంలోకి ఆకర్షితులవుతున్నట్లు చూడటం విచారకరం.
కాబట్టి వివాహం అనేది దేవుడు ఇచ్చిన ఒక అందమైన, సంపూర్ణమైన నిబద్ధత మరియు నిబంధన కలిగిన, లోతైన, వ్యక్తిగత, ఆత్మీయ వాస్తవికతను కలిగి ఉండటానికి ఉద్దేశించినది, ఇది లైంగిక సంబంధం యొక్క శిఖరంగా ఉంటుంది.
కేవలం క్రియలు మాత్రమే కాదు
మూడవ పరిశీలన ఏమిటంటే మానసిక లైంగిక సంబంధం వివాహం కోసం ఉద్దేశించబడింది. యేసు చెప్పాడు “నేను మీతో చెప్పునదేమనగా – ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” (మత్తయి 5:28). దీని అర్థం మీ మనస్సులో లైంగిక కార్యం (సెక్స్) చేయడం. ఒక స్త్రీని చూస్తూ ఆమెతో పడుకున్నట్లుగా లేదా ఆమె బట్టలు విప్పుతున్నట్లుగా ఊహించుకోవడం. ఊహల ద్వారా కూడా ఇలాంటివి చేయకూడదు.
అలా జరగనివ్వకుండా మీ కన్ను పీకివేయాలి ఎందుకంటే అది వివాహం కోసం ఉద్దేశించబడింది. వివాహంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా లైంగిక సంబంధం కలిగి ఉండాలి.
అవి మొదటి మూడు బైబిల్ పరిశీలనలు. ఇప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేసే ముందు వీటికి అనుభవపూర్వకమైన ఒక పరిశీలనను కలిపి చూద్దాం.
లైంగిక స్పర్శను దేవుడు రూపొందించాడు మరియు చాలా మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులు దానిని సెక్స్ కి ముందుగా అనుభవిస్తారు. అదే దాని అసలు ఉద్దేశం. లైంగికంగా స్పర్శించడం ప్రారంభించి, కోరికలు తీవ్రమవుతున్నప్పుడు దానిని ఆపడం అత్యంత నిరాశపరిచే విషయం. ఆ స్పర్శలు మరియు ఆ కాంక్ష మిమ్మల్ని సంపూర్ణమైన వైవాహిక శృంగారానికి (సెక్స్) తీసుకెళ్లడానికి ఉద్దేశించబడ్డాయి. దేవుడు దానిని ఆ విధంగా రూపొందించాడు. అందుకే దానిని ” లైంగిక ప్రేరణ (ఫోర్‌ప్లే)” అని పిలుస్తారు.
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి
ఇప్పుడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. నా ప్రధాన సూచన ఇదే. లైంగిక కార్యంలోకి(సెక్స్) నడిపించే లైంగిక స్పర్శకు దూరంగా ఉండండి, అంటే లైంగిక స్పర్శ ద్వారా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే కోరిక కలిగే పరిస్థితులలో మిమ్మల్ని మీరు ఉంచుకోకండి.
కాబట్టి నా అభిప్రాయము ఇదే: లైంగిక కోరిక(సెక్స్)ను కలిగించే లైంగిక స్పర్శ మరియు ముద్దు పెట్టుకోవడం మానుకోండి. అవి కేవలం ఆట కోసం కాకుండా, ముందస్తు లైంగిక ప్రేరణ (ఫోర్‌ప్లే) కోసం రూపొందించబడ్డాయి.
“స్త్రీలారా, ఒక పురుషుడు నీతో ఉండటానికి కేవలం శరీర సంబంధమే(సెక్స్) కారణమైతే, అతను నీకు తగినవాడు కాదు.”
ప్రత్యేకంగా చెప్పాలంటే దాని అర్థం రొమ్ములను లేదా జననేంద్రియాలను తాకడం అని నేను అనుకుంటున్నాను. ఏ సాధారణ వ్యక్తి కూడా “రొమ్ములను లేదా జననేంద్రియాలను తాకడం మా దృష్టిలో లైంగిక చర్య(సెక్స్) కాదు, మేము ఇంతకు మించి ఇక ముందుకు వెళ్ళం అని అనడాన్ని నేను ఊహించలేను. అది కేవలం పిచ్చి.
లైంగిక స్పర్శ అనేది వివాహ బంధంలో మరింత లోతైన అనుబంధానికి దారితీసే ఒక ప్రక్రియ కోసం రూపొందించబడింది, మీరు వివాహానికి సమీపిస్తున్నట్లయితే ఇది ఒక శుభప్రదమైన విషయం. దీన్ని ఒక శ్రావ్యమైన సంగీత రాగంతో పోల్చితే, రాగం మొత్తం వివాహం కోసం స్వరపరచబడినట్లయితే, దాని ప్రారంభ స్వరాలు కూడా అదే వివాహం కోసం ఉన్నట్లు భావించాలి.
ఒక సంబంధంలోకి ప్రవేశిస్తున్న పురుషులు మరియు స్త్రీలు వారి బంధం ముఖ్యమైనది అని భావిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఈ విషయం గురించి మాట్లాడాలి అని నేను సూచిస్తాను. వారు ఒకరినొకరు లైంగికంగా ప్రేరేపించే లైంగిక స్పర్శ మరియు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరినొకరు ఎలా ప్రలోభపెట్టకూడదో వారు స్వయంగా నిర్ణయించుకోవాలి.
నేను పురుషులను వేడుకుంటున్నాను. ఈ విషయంలో బలంగా ఉండండి, స్వచ్ఛమైన మరియు పవిత్రమైన నమూనాను ఏర్పాటు చేయండి. దయచేసి ఆమెనే ఈ విషయాన్ని ప్రస్తావించమని లేదా నియంత్రణ చేయమని చేయవద్దు. మీరు ఆమెను పరిశుద్ధతలో నడిపించండి.
ఆమెను పరిశుద్ధతలో నడిపించినందుకు దాని కోసం నిన్ను ప్రేమిస్తుంది. బైబిల్ విరుద్ధమైన పాపాత్మకమైన రీతిలో ఆమెను ఉపయోగించుకోకుండా మీరు ఆమెను ఎంతో విలువైనదిగా భావించినందున, తగిన సమయంలో, ఆమె మరింత పూర్తిగా, అందంగా, మరియు సంపూర్ణంగా తనను తాను మీకు అప్పగిస్తుంది.
నేను స్త్రీలకు చెప్పేదేమిటంటే ఒక పురుషుడిని మీతో ఉండేలా చేయడానికి అతనిని ఆకర్షించేందుకు శరీర స్పర్శను ఉపయోగించకండి. శరీర సంబంధమే అతన్ని మీతో ఉంచుకునే మార్గమైతే, అతను నిజంగా విలువైనవాడు కాదు.
ఏ పురుషుడికైనా ధైర్యంగా చెప్పండి: “లేదు. ఆలా చేయకండి. దయచేసి, మన సంబంధాన్ని ఆ దిశగా తీసుకెళ్లవద్దు” అని చెప్పడానికి సంకోచించకండి. అతడు ఆ పవిత్రతా కోణంపై ఎంత సున్నితంగా ఉంటాడో చూసి, నీవు ఎలాంటి వ్యక్తితో వ్యవహరిస్తున్నావో తెలుసుకోవచ్చు.
యుద్ధం విలువైనది
“హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8). అదే మనం కోరుకునేది. మనం దేవుడిని చూడాలనుకుంటున్నాం. మన వివాహంలో అందమైన, లైంగిక సంబంధాలలో ఆయనను చూడాలనుకుంటున్నాము. అత్యంత పవిత్రంగా ఉన్న వివాహిత జంటలు కూడా ఒకరినొకరు అత్యంత మధురమైన, ఉత్తమమైన అనుభవాన్ని పొందగలరని మరియు వివాహంలో దేవుడిని అనుభవించగలరని నేను భావిస్తున్నాను.
చివరిగా ఒక మాట. ఒకవేళ ఏకాకి జీవితం గడిపే మీరు ఈ మాటలు వింటూ, “అన్ని బాగానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఇంకా వివాహం కాలేదు. భవిష్యత్తులో వివాహం జరుగుతుందనే ఆశ కనిపించడం లేదు. నేను ఏం చేయాలి?” అని అనుకుంటున్నట్లయితే, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.
మీరు అసంపూర్ణులని భావించకండి. యేసుక్రీస్తు ఇప్పటివరకు జీవించిన వారిలో అత్యంత సంపూర్ణ మానవుడు, మరియు ఆయన ఎప్పుడూ లైంగిక సంబంధం కలిగి ఉండలేదు. వివాహం చేసుకోకపోవడం, లైంగిక సంబంధం కలిగి ఉండకపోవడం అంటే అసంపూర్ణ మానవుడిగా ఉండటం కాదు. యేసులా లైంగిక సంబంధం లేకుండానే ఒక వ్యక్తి సంపూర్ణమైన, అత్యంత ఫలవంతమైన మరియు సంపూర్ణ మానవుడుగా ఉండగలడు.



