డిజైరింగ్ గాడ్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు బోధకుడు అయిన జాన్ పైపర్ గారితో ఇంటర్వ్యూ
“రాజ్యము” అనేది ఏసుప్రభు యొక్క బోధలలో ఒక పెద్ద అంశము. “రాజ్యము” అనే పదం ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అనే ఇంగ్లీష్ బైబిల్ లోని సువార్త పుస్తకాలలో 120 సార్లు ప్రస్తావించబడింది. అయితే కొత్త నిబంధనలోని మిగతా పుస్తకాలలో రాజ్యము అనే పదం 34 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది. యూ.కే నుండి క్రిస్టఫర్ అనే వ్యక్తి ఇలా రాస్తున్నాడు. “పాస్టర్ జాన్ పైపర్ గారు! ఎంతో అద్భుతంగా ఉన్న “APJ ” అనే పాడ్ క్యాస్ట్ ను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు. పూర్తిగా అపరిచితులైన నాలాంటి వ్యక్తులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పడానికి మీరు అంతగా ప్రయత్నం చేయటం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను! అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే : కేవలం మత్తయి సువార్తలోనే రాబోయే రాజ్యాన్ని గురించి బోలెడన్ని వచనాలతో (కనీసం 55 వచనాలతో) నిండి ఉంది. కానీ అపోస్తులుల కార్యములు మొదలుకొని పత్రికల వరకు చూస్తే “రాజ్యము”ను గురించిన ప్రస్తావన చాలా తక్కువగా కనబడుతుంది.. కాబట్టి “దేవుని రాజ్యము” అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే సంఘమేనా లేక అంతకంటే పెద్దదేదైనా ఉందా?”
ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు నేను వింటున్నాను :
(1) దేవుని రాజ్యము అంటే ఏంటి?
(2) ఏసుప్రభు యొక్క బోధనలలో దాని గురించి ప్రత్యేకంగా దృష్టి నిలిపి దాని గురించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు , కానీ కొత్త నిబంధన పత్రికలలో చూస్తే దాని గురించి అంత ప్రాధాన్యత, ప్రత్యేకత ఎందుకు కనపడదు?
ఈ ప్రశ్నలన్నిటికీ నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి.
ఏలుటమరియుపరిపాలించుట
దేవుని రాజ్యము అనే మాట ఎన్ని విధాలుగా ఉపయోగించినప్పటికీ అర్థవంతముగా అనిపించే విధంగా, నేను చెప్పగల అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ లో రాజ్యము అనే పదానికి ఉన్న ప్రాథమికమైన భావము ఏదనగా దేవుని పరిపాలన — ప-రి-పా-ల-న — ఇది ప్రజలకు మరియు ప్రదేశానికి వర్తించేది కాదు. రాజ్యము ఒక ప్రదేశాన్ని నియమిస్తుంది, ఒక జనాన్ని నియమిస్తుంది, కానీ దేవుని రాజ్యము అనేది ప్రదేశానికి మరియు ప్రజలకు పర్యాయపదం కాదు.
“సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన రాజు ద్వారా దేవుని రాజ్యమును అత్యంత మహిమాన్వితముగా బయలుపరచుటకు దేవుడు నిర్ణయించాడు.”
ఉదాహరణకు, కీర్తనలు 103:19ను చూడండి: యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు.” రాజ్యము అనే పదానికి ప్రాథమికమైన అర్థం ఏలుట అని మీరు చూడొచ్చు. ఆయన ప్రదేశాన్ని ఆయన రాజ్యము ఏలుతుంది అని దాని అర్థం కాదు గాని ; దేవుని పరిపాలన లేదా ఏలుబడి అనేది అన్ని విషయాలను నియంత్రిస్తుంది అని దాని అర్థం.
ఈ విశ్వం యొక్క సింహాసనం మీద ఆయన రాజుగా ఆసీనుడైయుండి, రాజుగా ఆయన ఏలుబడి — ఆయన రాజ్యము మరియు ఆయన పరిపాలన— సమస్త విషయాలను నియంత్రిస్తుంది. బైబిల్లో రాజ్యము అనే పదానికి ప్రాథమికమైన అర్థము ఏదనగా రాజుగా దేవుడు ఏలుబడి చేయటము — ఆయన పరిపాలన, ఆయన క్రియలు, ఆయన ప్రభుత్వము, ఆయన సార్వభౌమ ప్రభుత్వము.
పాపులనురక్షించుట
తన కొరకు ఒక జనమును రక్షించుకొని, ఆ జనము కొరకు లోకమును నూతనపరిచి, వారి పక్షముగా రక్షణ మరియు విమోచన కార్యమును జరిగించే విధంగా రాజ్య పరిపాలన చేయటం అనేది ఈ లోకములో దేవుని సంకల్పం. ఈ కారణం చేత రాజ్యము రావడం అనేది కొత్త నిబంధనలో సువార్తగా చెప్పబడింది.
ఈ ప్రపంచంలోనికి రక్షణకరమైన ఆయన పరిపాలనను స్థాపించుటకు – యేసునందు మరియు యేసు ద్వారా దేవుడు రాజుగా వస్తున్న విధానం — నూతన మార్గం. పాపం, సాతాను మరియు మరణం మీద విజయం పొందుట ద్వారా మొట్టమొదట మానవుల హృదయాలలో ఆ తర్వాత ఒకరితో ఒకరు కలిగి ఉన్న సంబంధాలలో ఆయన పరిపాలనను స్థాపించుటకు ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఆయన రాజ్యము అభ్యాసము చేసుకొనుట ద్వారా ఈ లోక సంబంధమైన రాజ్యమునకు కాక ఆయన రాజ్యముకు లోబడి జీవించే ఒక జనమును తన కొరకు సమకూర్చి వారిని సమాజముగా చేసాడు. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశమును సృష్టించటం ద్వారా రెండవ రాకడలో క్రీస్తు తన పరిపాలనను సంపూర్తి చేస్తాడు.
ఇప్పటికేఉంది, కానీఇంకాలేదు
సువార్తలలో ఏసుప్రభువు రాజ్యమును గురించి బోధించిన తన బోధలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రాజ్యము ప్రస్తుతము ఉన్నది అంతేకాదు భవిష్యత్తులో కూడా రాబోతుంది. పరలోక రాజ్యం మీ మధ్య ఉంది అని ఆయన చెప్పిన మర్మము ఏంటంటే – సంపూర్తి చేయబడలేదు కానీ ప్రస్తుతము మాత్రం మన మధ్య ఉన్నది.
ఉదాహరణకి, రాజ్యాన్ని గురించిన భవిష్యత్ కోణాన్ని “ప్రభువు నేర్పిన ప్రార్థనలో” చూడగలం : “నీ రాజ్యం వచ్చును గాక” (మత్తయి 6:10). నీ రాజ్యాన్ని తీసుకురా ప్రభువా. మేము ఆశిస్తున్న విధంగా నీ రాజ్యం ఇంకా ఇక్కడ లేదు. నీ రాజ్యాన్ని తీసుకురా ప్రభువా. మానవుల జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో నీ పరిపాలన పూర్తిగా తీసుకురా ప్రభువా అని ప్రతిరోజూ మనం ప్రార్థించాలి.
“ సిలువ వేయబడి పునరుద్దానుడైన క్రీస్తు యొక్క ప్రభుత్వము ప్రస్తుతము ఉద్ఘాటన మరియు ప్రాధాన్యతను పొందవలసియున్నది.”
ఆయన యెరుషలేముకు సమీపముగా ఉన్నప్పుడు, దేవుని రాజ్యము వెంటనే వస్తుందని ప్రజలు అనుకున్నారు కాబట్టి లూకా19:11లో ఏసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అది వెంటనే రాదని ఏసుప్రభుకి తెలుసు. దేవుని రాజ్యము వెంటనే ప్రత్యక్షము కాదు, కానీ పదేపదే ఏసుప్రభు ఇలా అన్నాడు, “పరలోక రాజ్యము సమీపించియున్నది. మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించి యున్నది.”
వాస్తవానికి లూకా 11:20 లో ఇంకా స్పష్టంగా ఉంది: “అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.” దీనికంటే మరి స్పష్టంగా, లూకా 17:21 లో చెప్పబడింది, “ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది.”
ఇంకా రాలేదు, ఇప్పటికే ఉంది అని రెండు విధాలుగా దేవుని రాజ్యము గురించి ఎలా చెప్పగలము? “అది రాబోతుంది, దాని గురించి ప్రార్థన చేయండి, అది ఇంకా రాలేదు, అది వెంటనే రాదు. కానీ మీ మధ్యలోనే ఉంది, మీ మీద ఉంది, మీకు సమీపంగా ఉంది” అని ఆయన చెప్పాడు. ఈ విధంగా ఎలా చెప్పగలడు?
దీనికి జవాబు ఏంటంటే, దేవుని పరిపాలననే దేవుని రాజ్యము — ఒక జనమును విమోచించటం, రక్షించటం అనే పనిని ఈ లోకంలో దేవుడు సార్వభౌమముగా చేసి, భవిష్యత్తులో ఆ కార్యమును, తన ప్రజలను మరియు విశ్వమంతటిని సంపూర్ణముగా నూతనపరచటం అనేది సంపూర్తి చేస్తాడు.
సిలువకోసంసింహాసనాన్నివర్తకముచేయటం
“దేవుని రాజ్యము” లేక “పరలోక రాజ్యము” అనే పదజాలము ఏసుప్రభు బోధలలో ప్రాముఖ్యమైనది మరియు స్పష్టముగా బోధించబడిన విషయం, కానీ పత్రికలలో ఎందుకు తక్కువగా బోధించబడింది అని అడిగితే, దీనికి మనం ఎలా జవాబు చెప్పాలి?
నా సలహా ఇది: ఏసుప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో సున్నితమైన ఈ రెండిటి మధ్యలో జీవించాడు : తాను దేవుని కుమారునిగా మరియు నిజమైన రాజుగా తన అసలైన ఉనికిని తెలియజేసుకోవడం అనేది ఒక కోణం అయితే, తాను ఈ భూమి మీద రాజుగా చేయబడటానికి బలవంతపెట్టబడకుండా(యోహాను 6వ అధ్యాయంలో వారు ఆయన ఆ విధంగా చేశారు) తనను తాను మరుగు చేసుకొనుట మరొక కోణం.
వారు వచ్చి ఆయనను రాజుగా చేయడానికి సిద్ధమైపోయారు. వారు చూసిన దానిని ఎవరితోనూ తెలియజేయవద్దని ఏసుప్రభు కొంతమందితో పదేపదే చెప్పిన విషయం మీకు గుర్తుంది కదా (మత్తయి 17:9; మార్కు 7:36). ఎందుకంటే వారు అలా చెప్తే, యోహాను 6లో జరిగినట్టుగా రాజ సింహాసనం పై ఆయనను బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన రాజరికము యొక్క స్వభావాన్ని అపార్థం చేసుకోవడం ప్రబలి, రాజకీయ తిరుగుబాటు మొదలైయ్యే ప్రమాదముంది.
ఆయన వచ్చింది దాని కోసం కాదు గానీ సిలువ మీద మరణించటానికే వచ్చాడు. అందుకోసమే ఆయన వచ్చాడు. ఇప్పుడే సింహాసనం అదిష్టించడానికి రాలేదు కానీ మరణించడానికి వచ్చాడు. సిలువ మరణ పునరుత్థానాలా ద్వారా మాత్రమే ఆయన రాజుగా ఉంటాడు. ఆయన శిష్యులకు కూడా ఇది అంతగా అర్థం కాలేదు.
పునరుత్థానడైనవ్యక్తేప్రభువు
ఆయన ఈ భూమ్మీద జీవించిన కాలంలో వారు అర్థం చేసుకోలేని విషయాన్ని ఆయన పునరుత్థానుడైన తర్వాత, ఆయన శిష్యులు ఎంతో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. సిలువ వేయబడి పునరుత్థానుడైన రాజులో దేవుని రాజ్యము అత్యంత మహిమకరంగా బయలుపరచబడింది. పునరుత్థానానికి ముందు మరియు పునరుత్థానానికి తర్వాత ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. అయితే ఏసుప్రభు ఈ భూమి మీద జీవించిన కాలములో దేవుని రాజ్యము గురించి ఏం బోధించాడు అనేదాని యొక్క ప్రాముఖ్యత ఏమాత్రం తక్కువ కాలేదు. కానీ వారి అవగాహన మారింది. సిలువ వేయబడి పునరుత్థానుడైన ప్రభువు మీద అది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత నిలుపుతుంది.
“‘ఏసు, ప్రభువై ఉన్నాడు” అనే మాట ‘రాజు వచ్చేసాడు’ అనే మాటకు పర్యాయపదంగా పత్రికలలో వాడబడింది”
పత్రికలలో ఎంతో స్పష్టంగా మరియు కొత్తగా ఉద్ధాటించబడిన విషయం ఇలా వెల్లడి చేస్తుంది, “ఏసు, ప్రభువై ఉన్నాడు.” వాస్తవానికి, పదేపదే అడిగితే నేను ఈ విధంగా చెప్తాను : “రాజ్యము వచ్చేసింది” అనేది “ఏసు, ప్రభువై ఉన్నాడు” అనేదానికి పర్యాయపదంగా ఉంది. దీనిని మరొక విధంగా చెప్పాలంటే, “ఏసు, ప్రభువై ఉన్నాడు” అనేది పత్రికలలో రాజ్యమునకు పర్యాయపదంగా వాడబడింది— పరిపాలన — “రాజు వచ్చేసాడు.”
“ఆయన వచ్చేసాడు” అనేది మాత్రమే కాదు గాని “ఆయన వస్తాడు” అనేది కూడా అంతే నిజం. దేవుని రాజ్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడల్లా మనం చాలా మంచి పని చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. సంఘములో మరియు లోకంలో యేసు యొక్క పరిపాలన గురించి అపోస్తులులు బోధించి అన్వయించినట్లుగా మన బోధ కూడా ఉండేలా చూసుకోవాలి. సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తు యొక్క ప్రభుత్వము నేటి బోధలలో నొక్కి వక్కాణించబడాలి.