దేవుని మహిమ అనేది లేఖనాలలో చాలా గొప్ప విషయం. డిజైరింగ్ గాడ్ అనే మా సంస్థలో మేము కూడా దీనిని చాలా గొప్ప విషయంగా భావిస్తాము.  కొన్ని సంవత్సరాలుగా పాస్టర్ జాన్ ఫైపర్ గారు దేవుని మహిమ యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ విధంగా వర్ణిస్తున్నారు. 

  • దేవునిమహిమయొక్కనిరూపణమనరక్షణకుపునాదిలాంటిది, మరియుదేవునిమహిమనుహెచ్చించటంఅనేదిమనరక్షణయొక్కలక్ష్యముగాఉన్నది” 
  • దేవునిమహిమేఅన్నిటియొక్కఅంతిమమైనలక్ష్యము“ 
  • చరిత్రనుఐక్యపరిచేలక్ష్యముదేవునిమహిమ” 
  • సంపూర్ణమైన, నిత్యమైనఆనందానికిమూలాధారముదేవునిమహిమ” 

 ఈ విధంగా దేవుని మహిమను గురించి ఆయన ఎన్నో కోణాల్లో చెప్పారు.

ఇవన్నీ చాలా బలమైన మాటలు — కానీ దేవుని మహిమను గురించి మరింత కచ్చితంగా చెప్పాలంటే  “మహిమ ఎన్నటెన్నటికీ ఆయనకే చెందును గాక” అనే శీర్షికతో జాన్ ఫైపర్ గారు డిసెంబరు 17, 2006న  చేసిన ప్రసంగంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. అందులోని ఒక చిన్న భాగాన్ని మీకు ఇక్కడ అందిస్తున్నాం, ఆయన ఏం చెప్పాడో దయచేసి వినండి.

సాధ్యమైనదానినినిర్వచించటం.

దేవుని మహిమను నిర్వచించటం అసాధ్యమని అంటాను, ఎందుకంటే అది “బాస్కెట్ బాల్” అనే పదంలాంటిది కాదు, అది “సౌందర్యం” అనే పదం లాంటిది. బాస్కెట్బాల్ గురించి నేను అస్సలు వినలేదు, అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని ఎవరైనా మీతో చెప్తే – వారికి అదేంటో తెలియదని అర్థం – కాబట్టి, “బాస్కెట్ బాల్ అంటే ఏంటో నిర్వచించండి లేదా వర్ణించండి” అని వారు మిమ్మల్ని అడుగుతున్నారు. దాన్ని వర్ణించడం మీకు అంత కష్టంగా ఏమి అనిపించదు. మీ చేతులను ఉపయోగించి వారికి ఈ విధంగా వివరిస్తారు. 

అది 9 లేక 10 ఇంచుల వెడల్పు ఉంటుంది, ఒక రబ్బరుతో లేక తోలుతో గాని తయారుచేయబడి ఉంటుంది, దానిలో గాలి నింపాలి. మీరు దానిలో గాలి నింపితే , అది గట్టిగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ బంతిని నేలకేసి కొట్టొచ్చు, వేరే వారికి అందించడానికి దాన్ని విసరొచ్చు, దాన్ని నేలకు కొట్టుకుంటూ పరిగెత్తొచ్చు. ఆ బాస్కెట్ బాల్ కోర్టు రెండు చివర్ల లో ఒక రింగ్ ఉంటుంది(కానీ అది బాస్కెట్ లాగా ఉపయోగిస్తారు), ఆ రింగ్ లోకి బాల్ ని వేస్తే గోల్ అయినట్టు.  అందుకే దాన్ని బాస్కెట్ బాల్ అంటారు. 

“దేవుడు ఎంతో ప్రత్యేకమైన వాడు. ఆయన అనంతమైన పరిపూర్ణత, గొప్పతనము మరియు విలువైనవాడు.”

బాస్కెట్ బాల్ అంటే ఏంటో మీరు వివరించిన తర్వాత వారికి మంచి అవగాహన వచ్చుంటుంది.  ఏదైనా బాల్ ని చూసినప్పుడు అది ఫుట్ బాలా, వాలీ బాలా లేక బాస్కెట్ బాలా అనేది వారు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

కానీ “సౌందర్యము” అనే మాటతో అలా చేయలేం. ఇవి మనం మాట్లాడేటప్పుడు వాడే పదజాలంలో కొన్ని పదాలే.  మనం వాటిని చెప్పలేం కానీ చూడగలం. మనందరము కలిసి ఫలానా దాని వైపు  చూస్తూ, అబ్బా ఎంత బాగుందో అని అంటాము.  అందంగా ఉండటమంటే ఏంటో మనందరికీ ఒకటే భావన ఉండొచ్చు. కానీ ఎంత అందంగా ఉందో వర్ణించడానికి మాటల్లో చెప్పటం మాత్రం చాలా కష్టమే.

పరిశుద్ధుడుఅంటేఎంతోవిలువైనవాడుఅనికూడాఅర్థము 

మహిమ అనే పదం కూడా అలాంటిదే. మరి నేను దానిని ఎలా వర్ణించగలను? మీరు ప్రయత్నించాల్సిందే ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పే అవకాశం ఇవ్వకూడదు. నేను ఈ విధంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. పరిశుద్ధత అనే వాక్యానుసారమైన పదాన్ని తీసుకొని దానితో పోల్చి ఈ విధముగా ప్రశ్నించుకుందాం, “దేవుని మహిమ మరియు దేవుని పరిశుద్ధతకు మధ్య వ్యత్యాసం ఏమిటి?” ఈ విధంగా ఒకదానితో మరొకటి సరిపోల్చడం ద్వారా, దేవుని మహిమ అనే పదం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.  ఈ విధానంలో దేవుని మహిమ అంటే ఏంటో వివరించడానికి ప్రయత్నం చేస్తాను.

దేవుని పరిశుద్ధత అంటే, నాకు తెలిసి, మరెవరితో సరిపోల్చలేని పరిపూర్ణత, గొప్పతనం మరియు విలువ, వీటన్నింటిలో తానెంతో ప్రత్యేకమైనవాడు అని అర్థం. ఆయన పరిపూర్ణత, గొప్పతనము మరియు విలువ అనేవి అంత ప్రత్యేకమైనవి మరియు అంత విభిన్నమైనవి. పరిశుద్ధత అంటే ‘వేరుగా ఉన్నది’ లేక ‘ప్రత్యేకించబడినది’ అనే అర్థంతో మనం బోధించబడ్డాం. ఆయన అనంతమైన పరిపూర్ణత, గొప్పతనము మరియు విలువగలవాడు. 

దేవునిగా తాను ఏమైయున్నాడో, అదే ఆయన పరిశుద్ధత, మరెవరూ ఆయనవలే లేరు. ఆయనకు వెలుపలసరిపోల్చడంత  అనే ఆయన గుణాన్ని మెరుగుపరమెరుగుపరచటం కాదు, అనుకరించటం సాధ్యం కాదు, సరిపోల్చటం సాధ్యం కాదు. ఇది ఆయన అనంతమైన విలువను సూచిస్తుంది – ఆయన అంతర్గతమైన, అనంతమైన విలువను సూచిస్తుంది.

పరిశుద్ధతనువ్యక్తపరచటం

 “సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు,” అని యెషయా 6:3 లో దేవదూతలు ఒకరికొకరు కేకలు వేశారని చదివాం, వారు ఇంకా ఏమని కేకలు వేశారంటే: “సర్వలోకము ఆయనతో నిండియున్నది”.  “పరిశుద్ధత తో,” నిండియున్నది అని కేకలు వేసారేమో అని మీరనుకున్నారేమో కానీ వారలా అనలేదు.  ఆయన “మహిమతో” నిండియున్నది అని అన్నారు.

“ఆయన పరిశుద్ధత యొక్క సౌందర్యము వ్యక్తపరచబడటమే దేవుని మహిమ. ఆయన పరిశుద్ధత అందరి ఎదుట ప్రదర్శించబడుటయే దేవుని మహిమ.”

సర్వలోకము దేవుని మహిమతో మరియు ఆయన పరిశుద్ధతతో నిండియున్నది — అనే మాటల నుండి, ఆయన పరిశుద్ధత యొక్క సౌందర్యము వ్యక్తపరచబడటమే దేవుని మహిమ అని నిర్వచించే ప్రయత్నం చేశాను. ఆయన పరిశుద్ధతను బహిరంగంగా కనపరుచుట, మానవులందరికీ అర్థమయ్యేలా ఆయన తన పరిశుద్ధతను ప్రదర్శించడమే – దేవుని మహిమ.

దయచేసి  లేవియకాండము10:3లో నుండి ఈ మాటలు వినండి. తనకు సన్నిహితంగా ఉన్నవారికి తన పరిశుద్ధతను కనపరుస్తాడని, ప్రజలందరి ఎదుట తనను తాను మహిమ పరచుకుంటానని దేవుడు చెప్పాడు. “నాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును,” అని చెప్తున్నాడు. “ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును” అని మరియొక విధముగా చెబుతున్నాడు.”  ఆయన పరిశుద్ధతను చూడటం, అర్థంచేసుకోవడం, ఎంచుకోవటం, అనేవి ఆయన మహిమను వీక్షించిన దానికి ప్రతిస్పందనగా ఆయనను మహిమపరచడమే. 

మరొక నిర్వచనము ఇక్కడ ప్రయత్నిద్దాం: దేవుని మహిమ అనేది  దేవుని యొక్క నానా విధములైన పరిపూర్ణతలు, ఆయన అనంతమైన సౌందర్యము మరియు ఆయన గొప్పతనము. ఆయన గుణము, విలువ మరియు లక్షణాలు వ్యక్తమవటం మీద నా గమనాన్ని నిలుపుతున్నాను. ఆయన పరిపూర్ణతను మరియు గొప్పతనమును చూసినప్పుడు అవి ఎంతో సౌందర్యంగానూ, ఎన్నో విభిన్నమైన కోణాల్లోనూ కనిపిస్తాయి. ఆ కారణం చేతనే “నానా విధములైన” అనే పదాన్ని ఉపయోగించాను. మరొక వాక్య భాగాన్ని చూడండి : దేవుని మహిమ అనేది దేవుని యొక్క నానా విధములైన పరిపూర్ణతలు, అనంతమైన సౌందర్యము మరియు గొప్పతనము.

దేవుడువిధంగాకేకవేస్తాడు

ఆ ప్రసంగాన్ని పాస్టర్ జాన్ ఫైపర్ గారు ఈ విధంగా ముగించారు: “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి” (కీర్తన 19:1). దీని అర్థం ఏంటి? ఆయన మనకు కేక వేస్తూ చెప్తున్నాడు అని అర్థం. మేఘాల ద్వారా ఆయన కేక వేస్తున్నాడు. నీలి ఆకాశము ద్వారా ఆయన కేక వేస్తున్నాడు. బంగారు వర్ణం లో కనపడే సంధ్యాకాలాలకు ఆకాశము ద్వారా ఆయన కేక వేస్తున్నాడు. పాలపుంతల ద్వారా మరియు నక్షత్రాల ద్వారా ఆయన కేక వేస్తున్నాడు.  “నేను మహిమగలవాడను, మీ కళ్ళు తెరిచి నా మహిమను వీక్షించండి అంటూ కేక వవేస్తున్నాడు. నన్ను తెలుసుకోవటం మీకు మేలు — అని కేక వేస్తున్నాడు.”

బైబిల్ ఇలా చెబుతుంది, “వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది!” (యెషయా 6:3). మీకు చూసే కళ్ళు ఉంటే ఈ గదిలో ప్రతీ చోట దేవుని మహిమను మీరు చూడగలరు.  మనకు చూసే కళ్ళుండాలి. అన్నింటికంటే ప్రప్రదంగా మనకు చూసే కళ్ళుండాలి: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2కోరింథీ4:4).

“దేవుని మహిమ అంటే ఆయన అనంతమైన సౌందర్యము, గొప్పతనము మరియు ఆయన యొక్క నానా విధమునైన పరిపూర్ణతలు.”

కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, “మీరు ఈ విషయాన్ని చూడగలుగుతున్నారా? మీరు ఈ విషయాన్ని ప్రేమిస్తున్నారా?” మీ హృదయ లోతుల్లోకి తొంగి చూస్తే, దీనికోసమే మీరు సృష్టించబడ్డారని మీకర్థమవుతుంది. ఈ రాత్రి సంఘ కూడికలో కూర్చొని, కూడిక ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తూ, ఏ మాత్రం ఆసక్తి లేని వ్యక్తిగా మీరుంటే, ఒకరోజు వస్తుంది(అది ఈ రాత్రే కావాలని ఆశిస్తున్నాను) అప్పుడు మీరు ఈ విధంగా అంటారు, “దీనికోసమే నేను సృష్టించబడ్డాను, దీనికోసమే నేను ఉనికి కలిగి ఉన్నాను: దీనిని చూడడానికే, ప్రతీ విషయం కూడా దీని వైపే సూచిస్తుంది, ఎంతో ఆకర్షణీయమైనదని నేను అనుకున్న మహిమ అంతా కూడా ఆ వైపే వెళుతుంది. ఇదంతా పొట్టు మరియు బూడిద. ఆయనే సరైనవాడు. బైబిలే సరైనది. ఏసు ఒక్కడే సరైనవాడు.” అని మీ అంతట మీరే అంటారు. ఈ విధంగా మీకు జరిగేటప్పటికీ, చాలా ఆలస్యం కాకూడదని నేను నిరీక్షిస్తున్నాను.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *