సర్వ సంతృప్తిని కలిగించేది

సర్వ సంతృప్తిని కలిగించేది

షేర్ చెయ్యండి:

యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. (కీర్తన 37:4)

ఆనందమును అన్వేషించాలా వద్దా అనేది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు,  ఎందుకంటే కీర్తనలలో అలా చేయమని ఆజ్ఞాపించబడింది: “యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” (కీర్తన 37:4).

కీర్తనాకారులు దీన్ని చేయడానికి ప్రయత్నించారు:
“దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవునికొరకు తృష్ణగొనుచున్నది” (కీర్తనలు 42:1-2).
“నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.” (కీర్తనలు 63:2).

మనుష్యులు “నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు” (కీర్తన 36:8) అని కీర్తనాకారుడు అనటంలో అర్ధం దాహాన్ని తీర్చేది ఒకటి ఉంది అని అర్ధం.  

మన ఆరాధనకు మూలమైన దేవుని మంచితనానికి ప్రతిగా మీరు నిరాసక్తితో మీ స్తుతి చెల్లించడం భావ్యం కాదని నేను కనుగొన్నాను. లేదు, ఇది ఆనందించదగ్గ విషయం: “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి!” (కీర్తన 34:8). రుచి చూచి తెలిసికొనుడి.

” నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి!” (కీర్తన 119:103).

సి.ఎస్. లూయిస్ చెప్పినట్లుగా, కీర్తనలలో “సర్వ సంతృప్తిని కలిగించేది” ఎవరు అంటే దేవుడే. ఆయన ప్రజలు తనలో కనుగొన్న ” ఆనందసంతోషములు” కోసం సిగ్గు పడకుండా ఆయనను ఆరాధిస్తారు (కీర్తన 43:4). పరిపూర్ణ మరియు అంతులేని ఆనందానికి మూలం ఆయనే: “నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” (కీర్తన 16:11).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...