విశ్వాసం ఎవరిని విశ్వసిస్తుందో ఆయన్ని గౌరవిస్తుంది
“అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను”. (రోమా 4:20)
ఓహ్, మనము పవిత్రతను మరియు ప్రేమను వెంబడించడం ద్వారా దేవుడు మహిమపరచబడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. కానీ మన అన్వేషణ తన వాగ్దానాలపై విశ్వాసం ద్వారా బలపరచబడితే తప్ప దేవుడు మహిమపరచబడడు.
మరియు మన పాపాల కొరకు సిలువ వేయబడిన మరియు మనలను నీతిమంతులనుగా తీర్చుట కొరకు పునరుత్తానుడైన యేసుక్రీస్తులో తనను తాను పూర్తిగా బయలుపరుచుకొన్న దేవుడు (రోమా 4:25), మనం ఆయన వాగ్దానాలను సంతోషకరమైన నిశ్చయతతో స్వీకరించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు ఎందుకంటే అవి ఆయన కుమారుని రక్తం ద్వారా కొనబడ్డాయి.
మన బలహీనతలను మరియు వైఫల్యాలను బట్టి మనం తగ్గించబడినప్పుడు మరియు భవిష్యత్తు కృప కొరకు ఆయనను విశ్వసించినప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. రోమా 4:20లో అబ్రాహాము విశ్వాసాన్ని పౌలు ఇలా వర్ణించాడు, “అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.”
అతను తన విశ్వాసంలో బలపడ్డాడు, తద్వారా దేవునిని మహిమ పరిచాడు. దేవుని వాగ్దానాలలో విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన అత్యంత జ్ఞానిగా, బలమైనవానిగా, మంచివానిగా మరియు నమ్మదగిన వ్యక్తిగా ఘనతపొందుతాడు. కాబట్టి, దేవుని భవిష్యత్ కృప గూర్చిన వాగ్దానాలలో విశ్వాసం ఉంచడం ద్వారా ఎలా జీవించాలో మనం నేర్చుకోకపోతే, మతపరమైన కఠినమైన గొప్ప కార్యాలను మనం చేయవచ్చు, కానీ దేవుని మహిమ కోసం కాదు.
భవిష్యత్ కృపపై వినయపూర్వకమైన విశ్వాసం ఉంచడం ద్వారా పవిత్రంగా జీవించడానికి శక్తి వస్తుంది అప్పుడు ఆయన మహిమపరచబడతాడు.
మార్టిన్ లూథర్ ఇలా అన్నాడు, “[విశ్వాసం] అది ఎవరిని విశ్వసిస్తుందో ఆయనను అత్యంత గౌరవప్రదంగా మరియు అత్యున్నత మర్యాదతో ఘనపరుస్తుంది. ఎందుకంటే అది ఆయన సత్యవంతుడని మరియు నమ్మదగినవాడని భావిస్తుంది.” నమ్మకమైన దాత కీర్తిని పొందుతాడు.దేవుని ఘనత కోసం మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలనేది నా గొప్ప కోరిక. మరియు భవిష్యత్తు కృపలో విశ్వాసంతో జీవించడం అంటే, అది తల ఎత్తే అవిశ్వాసంతో పోరాడడమే.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web