ఆత్మీయముగా ఉండుట అనగా అర్థమేమిటి?

ఆత్మీయముగా ఉండుట అనగా అర్థమేమిటి?

షేర్ చెయ్యండి:

ప్రశ్న:

ఆత్మీయముగా ఉండుట అంటే ఏమిటి అని మీరు ముగ్గురు వ్యక్తులను అడిగినప్పుడు, మీకు నాలుగు వేర్వేరు సమాధానాలు లభిస్తాయి. ఆత్మీయత యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆత్మీయతను వారి సొంత విధానంలోనే చూస్తారు. కానీ బైబిలు పరమైన ఆత్మీయత అంటే ఏమిటి? బైబిల్ నుండి ఆత్మీయతకు స్పష్టమైన అర్థాన్ని మనం పొందగలమా?

ఒక యౌవ్వన సోదరికి బైబిలు పరమైన ఆత్మీయత అంటే ఏమిటి అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఆమె ప్రశ్నేమిటంటే :

“పాస్టర్ జాన్, నా తల్లి మరియు నాకు బైబిల్ ఆత్మీయతపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. నా భర్త నేను ఆత్మీయముగా లేమని ఆమె చెబుతుంది. ఎందుకంటే ఆత్మీయతను, భాషలలో మాట్లాడుట, కలలను వివరించుట మరియు స్వస్థతను చెప్పుకొనుట వంటి ఆత్మీయ వరములుగా ఆమె చూస్తుంది. నా భర్త మరియు నేను మిషన్ ఫీల్డ్ లో పనిచేశాం మరియు సంఘములో చురుకుగా పాల్గొన్నాం, ప్రభువును ప్రేమిస్తూ అన్ని విషయములలో ఆయనను వెదుకుతున్నాం. మా తల్లిగారి మాటలకు ఎలా స్పందించాలో నాకు తెలియట్లేదు. నా భర్త మరియు నేను ఆత్మీయులం కాకపోవడం సాధ్యమేనా?  మా జీవితాలలో ఆత్మ ఫలమును ఈ విధానంలో నేను చూడట్లేదు. మేము  ఆత్మీయముగా లేమని నేను అనుకోను. మేము ఆత్మీయులము కాదని ఇలా మాట్లాడినప్పుడు నేను ఎలా స్పందించాలి? మరి ముఖ్యంగా, నిజమైన క్రైస్తవ ఆత్మీయత ఎలా కనిపిస్తుంది?”

జవాబు:

ముందుగా, భాష మరియు నిర్వచనాల గురించి మనం మాట్లాడదాం. తర్వాత, బైబిలు “ఆత్మసంబంధమైన” అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తుందో మనం చూద్దాం. బైబిల్లో “ఆత్మీయత” అనే పదం 29 సార్లు కనిపిస్తుంది. ఎక్కువగా అపొస్తలుడైన పౌలు రచనలలో సుమారు 27 సార్లు మనం ఆ పదాన్ని చూస్తాం. మిగతా రెండు సార్లు పేతురు యొక్క మొదటి పత్రికలో మనం గమనిస్తాం. ఈ పదం విస్తృతంగా ఉపయోగించబడలేదు. కాబట్టి, క్రొత్త నిబంధనలోని ఆత్మీయతను మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఎక్కువగా పౌలు దానిని ఎలా అర్థం చేసుకున్నాడో అనే దానిపై దృష్టి పెడతాము.

ఎవరి ఆత్మీయత?

మొదట భాష వాడకంతో ప్రారంభిద్దాం. ఒక నవ యుగ (న్యూ ఏజ్) ఆత్మీయ స్త్రీని ఊహించుకోండి. ఆమె భవిష్యవాణి చెప్పడం, ప్రేతాత్మలతో మాట్లాడటం, అదృష్టం చెప్పడం, చేతి జాతకం చూడడం మరియు భూమి ఆరాధన వంటి పనులను చేస్తుంది. ఆమె మన పరిణతి చెందిన క్రైస్తవ సోదరితో, “నేను చేసే పనులు మీరు చేయట్లేదు కాబట్టి  మీరు ఆత్మసంబంధులు కారు” అని చెబుతుంది.

ఆ పనులు బైబిలు పరంగా ఆత్మీయమైనవని భావించేవి కావు కాబట్టి ఆ యువతి, బెదిరిపోదని  లేదా తీవ్రంగా విమర్శించబడదని నేను భావిస్తున్నాను. వాస్తవానికి, బైబిల్ ఆ పనులన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కానీ విషయం ఏంటంటే: ఈ నూతన యుగపు ఆత్మీయవాది తన సొంత నిర్వచనం ద్వారా తనను తాను ఆత్మీయంగా చూసుకుంటుంది. కాబట్టి, ఎవరు ఆత్మీయంగా ఉన్నారనే దాని గురించి వాదించడం పెద్దగా సహాయపడదు. “ఆత్మసంబంధమైన” అంటే ఏమిటో మీరు నిర్వచించకపోతే, వాదనలన్నీ  వ్యర్థమైపోతాయి. వారు దాని గురించి పూర్తిగా భిన్నమైన ఆలోచనలను కలిగిఉంటారు కాబట్టి, భిన్నమైన మార్గాల్లో ఆ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

“నా తల్లి మరియు నేను బైబిల్ పరమైన ఆత్మీయతను భిన్నంగా చూస్తాము “అని యవ్వన సోదరి చెప్పినప్పుడు, ఆమె రెండు విషయాలను సూచిస్తుంది. ఒకటి, వారు ఆ పదం యొక్క అర్థముతో ఏకీభవిస్తారు కానీ ఆమె మరియు ఆమె భర్త ఆ ప్రమాణానికి అనుగుణంగా ఉన్నారా లేదా అనే దానిపై విభేదిస్తారు. లేదా రెండవదిదా, బైబిల్ ఆత్మీయత అంటే ఏమిటో అనే విషయంపై వారు విభేదిస్తారు. ఇది ఒకే ప్రమాణాలను ఉపయోగించి ఒకరినొకరు నిర్ధారించడం కష్టతరం చేస్తుంది మరియు వారు నిజంగా ఒకరి పాయింట్లను ఒకరు అర్థం చేసుకోలేరు మనకు తెలుస్తుంది.

ఆ యువతి చెప్పిన దాని నుండి, ఆమె రెండవ ఆలోచన వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె తల్లి ఆత్మీయతను బైబిల్ కోణంలో చూస్తుంది, భాషలలో మాట్లాడుట, కలలను వివరించుట మరియు స్వస్థపరుచుట మొదలైన వరములను కలిగిఉంది. అయితే, యవ్వన సోదరికి ఆత్మీయత గురించి దానికి వేరుగా భిన్నమైన అవగాహన ఉంది.

ఆత్మ నివసించు ప్రజలు

వాస్తవానికి “ఆత్మసంబంధమైన” అనే పదానికి అర్థమేమిటో అర్థంచేసుకొవడానికి మనం పౌలు రచనలను పరిశీలిద్దాం. ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ ఆశీర్వాదములు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ దేహములు, ఆత్మీయ వరములు, ఆత్మీయ బండ మరియు ఆత్మీయ ఆహారమును గూర్చి పౌలు మాట్లాడుతూ “ఆత్మీయ” అనే పదాన్ని వాడుతాడు కానీ, ప్రస్తుతానికి మనం కేవలం “ఆత్మసంబంధమైన ప్రజలు” అనే పదంపై మాత్రమే దృష్టి పెడదాం.

పౌలు ఈ పదాన్ని మూడు విధాలుగా ఉపయోగిస్తున్నాడని మరియు అవన్నీ ఒకే ప్రధానమైన ఆలోచనపై ఆధారపడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. బైబిలు ఆత్మీయతను గూర్చిన ప్రధానమైన  భావన ఇదే. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, వారు నూతనంగా జన్మించినపుడు  ఎవరైనాసరే వారు ఆత్మీయులైపోతారు. ఈ కొత్త జన్మ అంటే వారు ఇకపై దేవుణ్ణి వ్యతిరేకించే, వారి శరీర సంబంధమైన కోరికలచే నియంత్రించబడరు కానీ, దేవుని విశ్వసించుటకు మరియు ప్రేమించుటకు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. కాబట్టి, ఆత్మసంబంధమైన వ్యక్తి ప్రధానంగా పరిశుద్ధాత్మునిచే స్వాభావికంగా మార్చబడిన వ్యక్తి. వారు అవిశ్వాసం నుండి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడినవారు. వారు ఆత్మసంబంధులు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత సృష్టించబడ్డారు మరియు పరిశుద్ధాత్మను నివాసముగా కలిగియుంటారు.

కాబట్టి, “ఆత్మీయత” గూర్చిన పౌలు గారి అవగాహన ఎక్కువగా ఒకరి సొంత ఆత్మ నుండి కాకుండా దేవుని ఆత్మ నుండి వస్తుంది. ఎందుకంటే వారి సొంత ఆత్మ చాలా చురుకైనది లేదా వారు మార్మికమైన లేదా ఆత్మీయ విషయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడాన్ని బట్టి పౌలు వారిని ఆత్మీయులని పిలవట్లేదు.

ఆత్మీయ vs ప్రకృతి సంబంధమైన

ఆత్మీయతను అర్థం చేసుకోవడానికి కీలకమైన వాక్యభాగము 1 కొరింథీ 2:12–15. వాటి నుండి కొన్ని వచనాలను చదవనివ్వండి:

“దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.”

ఇక్కడ “ఆత్మసంబంధులు” అని పిలువబడే ఈ ప్రజలు ఎవరు? వారు ఆత్మను పొందుకున్నవారు. వారు వాటిని అర్థం చేసుకోగలిగినందున వారు అపొస్తలుల ద్వారా ఆత్మ బోధించిన మాటలను స్వీకరిస్తారు. వారు ఆత్మీయులు గనుక వాటిని అర్థం చేసుకుంటారు. అటువంటి వారు మాత్రమే తాను సంభాషించే ఈ ఆత్మీయ సత్యాలను నిజంగా గ్రహించగలరని మరియు స్వీకరించగలరని పౌలు ఇక్కడ నొక్కిచెప్పాడు.

కాబట్టి, తరువాతి వచనమైన 14 వ వచనంలో, కొంతమంది మాత్రమే ఈ ఆత్మీయ విషయాలను ఎందుకు అర్థం చేసుకోగలరో పౌలుగారు వివరిస్తారు: ఆత్మీయ వ్యక్తికి భిన్నంగా, పౌలు “స్వాభావిక వ్యక్తిని”లేదా ప్రకృతి సంబంధి అయినా వ్యక్తిని ఆయన రూపాంతరించబడని, రక్షింపబడని మరియు పరిశుద్ధాత్మ లేకుండా ఉన్న వ్యక్తిగా పేర్కొంటాడు. ఈ వ్యక్తి “దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” (1 కొరింథీయులు 2:14). అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఆత్మీయ ‌జ్ఞానము వారికి లేనందున వారి అవగాహన పరిమితమైనది. ఈ విషయాలు వెర్రితనము కాదు; అవి వాస్తవంగా సత్యమైనవి మరియు అందమైనవి, కానీ పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం లేకుండా వారు చూడలేరు.

పౌలు “ఆత్మసంబంధమైన వ్యక్తిని” ప్రకృతి సంబంధి అయిన వ్యక్తితో ఇక్కడ పోలుస్తున్నాడు. ఆత్మీయ వ్యక్తి “అన్నిటిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు”. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము” (1 కొరింథీయులు 2:15–16). దీనర్థము, విషయాలను అంచనా వేయడానికి, పరిశుద్ధాత్మ మన మనస్సును రూపాంతరపరుస్తాడు. మనము జ్ఞానమును వెర్రితనము అని పిలవము. బదులుగా, క్రీస్తు సత్యము యొక్క నిజమైన వెలుగు ద్వారా మనము విషయాలను చూస్తాము. కానీ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి, ఈ దృక్పథం అర్ధవంతం కాదు; ఇది వారికి నిజమైనది కాదు కాబట్టి అది వారికి మూర్ఖత్వంగా అనిపిస్తుంది.

కావున, ఈ వాక్యభాగము నుండి నా సారాంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మను కలిగియున్న నిజమైన క్రైస్తవులను వివరించడానికి పౌలు ప్రధానంగా “ఆత్మసంబంధమైన” అనే పదాన్ని ఉపయోగిస్తాడు. వారు ఇకపై స్వాభావికమైన ప్రజలు కారు. వారు అసహజమైనవారు. ఆత్మ చేత మరల జన్మించిన ప్రజలు. వారి మనస్సులు ఇప్పుడు సువార్తలో క్రీస్తు యొక్క సౌందర్యాన్ని మరియు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగల్గుతాయి. కాబట్టి, అత్యంత ప్రాథమికమైన విధానంలో, నిజమైన క్రైస్తవులందరూ ఆత్మీయులే.

పౌలు ఈ పదాన్ని మరో రెండు విధాలుగా ఉపయోగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, కానీ ఈ ఉపయోగాలు ఈ ప్రధాన ఆలోచన యొక్క వైవిధ్యాలు లేదా పొడిగింపులు మాత్రమే అవి వైరుధ్యమైనవి కావు.

క్రీస్తునందు పరిపక్వత

మొదటిది, పౌలు, వారి ఆత్మీయ జీవితంలో ఎక్కువ అనుభవజ్ఞులైన మరియు పరిపక్వత చెందిన క్రైస్తవులకు ఆత్మీయ అనే పదాన్ని ఉపయోగిస్తాడు.

పౌలు 1 కొరింథీయులకు 3:1 లో ఈలాగు వ్రాయుచున్నాడు, ” సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని”.

వారు ఆత్మీయులు కాదని అతడు చెప్పడం లేదు, కానీ, అతడు వారిని “క్రీస్తునందు పసిపిల్లలుగా” చూస్తున్నాడు.”దీని అర్థం వారు ప్రాథమికంగా ఆత్మీయంగా లేరని నేను అనుకున్నాను, కాని పౌలు, వారు పరిపక్వతతో వ్యవహరించడం లేదని చెబుతున్నాడని, నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సంఘములో కలహాలు మరియు అసూయలు ఉన్నాయి, కాబట్టి పౌలు వారి ప్రవర్తనను బట్టి వారిని ఆత్మీయ పసిపిల్లలుగా పరిగణించాడు.

గలతీయులు 6:1 లో పరిపక్వత గల క్రైస్తవునికి  ఆత్మీయత అనే పదాన్ని వాడిన ఉదాహరణ కూడా మనం చూద్దాం : “సహోదరులారా, ఎవడైనను ఏ అపరాధములో చిక్కుకొనిన యెడల, ఆత్మసంబంధియైన మీరు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. పాపములో ఉన్న వ్యక్తి కూడా క్రైస్తవుడు అయినప్పటికీ, పౌలు, ఆత్మీయతలో పరిపక్వత చెందిన వారు, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని మంచి దారికి తీసుకుని రమ్మని కోరుతున్నాడు. పౌలు “ఆత్మీయత” అనే పదాన్ని రెండవదిగా  ఆ ఆత్మీయతను గూర్చి మరింత పరిణతి చెందిన అనుభవనికి ఇక్కడ వాడుతునట్టుగా మనం అర్థం చేసుకుంటం.

లేఖనమునకు లోబడుట

పౌలు “ఆత్మసంబంధమైన” అనే పదాన్ని మరొక విధంగా వ్యంగ్యమైన విధానంలో ఉపయోగిస్తాడు. ఇది 1 కొరింథీయులకు 14:37 లో రాయబడింది : “ఎవడైనను తాను ప్రవక్తయనియైనను ఆత్మసంబంధియనియైనను తలంచుకొనినయెడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు ధృఢముగా తెలిసికోవలెను”. హాస్యాస్పదంగా, ఆత్మీయ వరలను కలిగియున్నవారు కొందరున్నారు. వారు మన యౌవ్వన సోదరి యొక్క తల్లి ఆలోచనలతో పోలియున్నారు. అందుచేత వారు ఆత్మసంబంధులమని చెప్పుకుంటారు. కానీ పౌలు ఇలా చెప్పడం ద్వారా వారిని సవాలు చేస్తాడు, ఏమని “ఆత్మీయముగా ఉండుట యొక్క నిజమైన పరీక్ష, భాషలలో మాట్లాడుట లేదా స్వస్థపరచుట లేదా దయ్యములను వెళ్లగొట్టుట వంటి ఈ వరలను గూర్చి కాదు. ఇది మీరు అపొస్తలుల బోధలను అంగీకరిస్తారా మరియు అనుసరిస్తారా అనే దాని గురించే. మా మాటలు ప్రభువు నుండి వస్తాయని మీరు నమ్ముచున్నారా?”

ఈ ప్రశ్న అడిగిన యువతికి నా సలహా ఏమిటంటే. ఆమె పరిశుద్ధాత్మ ఫలములన్నిటిని తన జీవితములో వెంటాడుతూనే ఉండాలి. సంపూర్ణమైన వినయముతో, తన తల్లి తప్పుగా అర్థం చేసుకున్న విధానాన్ని గూర్చి సిగ్గుపడకుండ ఉండాలి. ఆత్మీయ వరలను కలిగియుండుటనేది ఒక వ్యక్తిని ఆత్మీయంగా చేయదని ఆమె గ్రహించాలి. కొరింథులో ఉన్న సమస్య కూడా అదే. నిజముగా ఒకరిని ఆత్మసంబంధిగా చేసేదేంటంటే, పరిశుద్ధాత్మను కలిగియుండుట మరియు ఆయన ఫలన్ని చూపించుట ద్వారా క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట. పరిపక్వత చెందిన ఆత్మీయత అంటే ఇదే.

జాన్ పైపర్ గారు desiringGod.org ని స్థాపించి బోధిస్తున్న దైవజనులు. బేత్లెహెం కళాశాల & సెమినరీకి ఛాన్సలర్ గా ఉన్నారు. మినియాపోలిస్, మిన్నెసోటాలో గల బేత్లెహెం బాప్టిస్ట్ చర్చికి 33 సంవత్సరాలు పాస్టర్ గా పరిచర్య చేశారు. ఆయన 50 కన్నా ఎక్కువ పుస్తకాలు రాశారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...