మీరు దేవుని కొరకు చేయబడ్డారు
“యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు”. (1 సమూయేలు 12:22)
దేవుని నామము తరచుగా ఆయన కీర్తిని, ఆయన ప్రతిష్ఠితను, ఆయన విశిష్టతను సూచిస్తుంది. ఒకరు తనకు తాను గొప్ప పేరు సంపాదించుకున్నారని అన్నప్పుడు, “పేరు” అంటే పైన చెప్పబడిన అర్ధం వచ్చేటట్లే ఉపయోగిస్తాం కదా. మనము కొన్నిసార్లు అది “పేరు”న్న బ్రాండ్ అని అంటాము. అంటే అది ప్రసిద్ధమైన బ్రాండ్ అని అర్థం. 1 సమూయేలు 12:22లో దేవుడు ఇశ్రాయేలీయులను “తనకు” ప్రజలుగా చేసుకున్నాడని మరియు “తన ఘనమైన నామము నిమిత్తము” ఇశ్రాయేలును త్రోసివేయడని చెప్పినప్పుడు సమూయేలు ఆ అర్ధముతో చెప్పాడని నేను అనుకుంటున్నాను.
తన పేరు పట్ల దేవునికి ఉన్న ఆసక్తిని గురించిన ఈ ఆలోచనా విధానం అనేక వాక్య భాగాలలో ధృవీకరించబడింది.
ఉదాహరణకు, యిర్మీయా 13:11లో ఇశ్రాయేలు తాత్కాలికంగా అనర్హులుగా ఉన్న సందర్భాలు ఉన్నప్పటికీ, దేవుడు తన మహిమను కనిపించేలా చేయడం కొరకు దేవుడు ఇశ్రాయేలీయులను నడుముకు కట్టుకునే వస్త్రంగా లేదా బెల్ట్‌గా వర్ణించాడు. “నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నాడు మరియు దేవుని వస్త్రముగా ఎందుకు చేశాడు? “కీర్తి స్తోత్ర మహిమలు” గా ఉంటుందని.
ఈ సందర్భంలో “స్తోత్ర” మరియు “మహిమ” అనే పదాలను ఉపయోగించడాన్ని బట్టి “పేరు” అంటే ఇక్కడ “కీర్తి” లేదా “ప్రఖ్యాతి” లేదా “విశిష్టత” అని అర్ధం చేసుకోవాలి. ఆయనకు పేరు తెచ్చేలా దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. యెషయా 43:21లో ఇశ్రాయేలీయులు “నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.” అని దేవుడు చెప్పాడు.
కొత్త నిబంధనలో సంఘం నిజమైన ఇశ్రాయేలుగా తనను తాను చూసుకున్నప్పుడు, పేతురు మన కోసం దేవుని ఉద్దేశాన్ని ఇలా వివరించాడు: “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశము” (1 పేతురు 2:9).
మరో మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలును మరియు సంఘమును ఈ లోకములో ఆయనకు పేరు తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే మనం మొదటగా ప్రార్థిస్తాము, “నీ నామము పరిశుద్ధపరచబడుగాక” (మత్తయి 6:9). అందుకే “నీ నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు.” (కీర్తన 23:3) అని మనం ప్రార్థిస్తాము.
గుర్తుంచుకోండి, మనము దేవుని-కేంద్రీకృత ప్రజలమని అన్నప్పుడు, మనం దేవుని-కేంద్రీకృతత్వంలో దేవునితో కూడా మనము చేరుతున్నామని దానర్థం. సిలువకు ఈ వైపున, క్రీస్తుపై ఆధారపడిన, క్రీస్తును పైకెత్తే ప్రజలు అని దీని అర్ధం. “చిన్న పిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.” (1 యోహాను 2:12). “మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.” (కొలొస్సయులు 3:17).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web
One comment
Praise the Lord 👐 very good information 🙏